రివ్యూ

పాతకథలో కొత్త హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** గౌతమ్‌నంద

తారాగణం: గోపీచంద్, హన్సిక, కేథరిన్ త్రెసా, ముఖేష్ రుషి, చంద్రమోహన్, వెనె్నల కిశోర్, అజయ్ తదితరులు
సినిమాటోగ్రఫి: ఎస్ సౌందర్‌రాజన్
ఎడిటింగ్: గౌతంరాజు
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
నిర్మాతలు: జె భగవాన్, జె పుల్లారావు
రచన, దర్శకత్వం: సంపత్‌నంది
*
జిల్ సినిమా తరువాత బాగా గ్యాప్ తీసుకున్నాడు హీరో గోపీచంద్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న గోపీచంద్ కాస్త భిన్నంగా చేసిన ప్రయత్నమే గౌతమ్‌నంద. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో నిర్మించారు. డబ్బు అవసరం లేని మనిషి ప్రపంచంలో ఉండడు. ప్రస్తుతం మనిషి డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలన్నది కొందరి ఆలోచన. అందుకు దేనికైనా సిద్ధపడతారు కొంతమంది. అలాంటి ఆసక్తికరమైన ఇతివృత్తంతో రూపొందిన చిత్రం గౌతమ్‌నంద. గౌతమ్‌నందగా గోపీచంద్ ఎలా కనిపించాడు? గౌతమ్, నంద ఎవరన్నది తెలుసుకోవాలంటే మాత్రం కథలోకి వెళ్లాల్సిందే.
**
గౌతమ్ (గోపీచంద్) కోటీశ్వరుడైన ఘట్టమనేని విష్ణుప్రసాద్ (సచిన్ ఖేడేకర్) ఏకైక పుత్రుడు. ప్రపంచంలోని టాప్ 50మంది ధనవంతుల జాబితాలో ఉన్నవాడు. అలా అతని ఫొటో ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్‌పేజీగా వచ్చింది. తండ్రి సంపాదనను దేశాలు తిరిగి ఎంజాయ్ చేస్తూ వుంటాడు గౌతమ్. ఓ రోజు పబ్‌లో వెయిటర్ చేసిన పొరపాటుకు చేయి చేసుకుంటాడు గౌతమ్. దానికి ఆ వెయిటర్ అన్న మాటలు గౌతమ్‌ని ఆలోచింపజేస్తాయి. చిన్నప్పటినుంచి బాధంటే ఏమిటో, ఎమోషన్స్ అంటే ఏమిటో తెలియని గౌతమ్ వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. మద్యం మత్తులో కారు నడుపుతున్న గౌతమ్ ఓ వ్యక్తిని ఢీకొడతాడు. ఆ వ్యక్తి తనలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అతని పేరు నంద (గోపీచంద్). పేదరికంతో బాధపడుతూ చావాలనుకుని గౌతమ్ కారు కింద పడతాడు. అతనెందుకు చనిపోవాలని అనుకుంటున్నాడో చెబుతాడు. నంద చెప్పిన కథ విన్న గౌతమ్ నెల రోజులు ఒకరి స్థానంలోకి ఒకరం మారిపోదాం అంటాడు. అలా గౌతమ్ స్థానంలోకి నంద, నంద స్థానంలోకి గౌతమ్ వస్తారు. అలా మారిన తర్వాత వారి వారి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి? గౌతమ్ తీసుకున్న నిర్ణయంవల్ల అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అన్నది మిగతా సినిమా.
ధనవంతుడైన గౌతమ్ లైఫ్‌స్టైల్‌ను పరిచయం చేయడం కోసం సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్, భవంతులు, కార్లు, యాక్ససరీస్ అన్నీ ఒరిజనల్ బ్రాండ్స్ కావడంతో నిజంగా ఒక బిలియనీర్ కొడుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు. రిచ్ కుర్రాడిగా గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగుంది. రెండు విభిన్న పాత్రల్లో నటనతో ఆకట్టుకున్నాడు. కోటీశ్వరుడి కొడుకుగా గడ్డంతో కనిపించే గౌతమ్ పాత్రలో చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. ఫారిన్ లొకేషన్స్‌లో మోడల్స్‌తో తీసిన గోపీచంద్ ఇంట్రొడక్షన్ సాంగ్‌తో ఆకట్టుకుంది. అలాగే మాస్‌గావుండే నంద క్యారెక్టర్‌కి కూడా పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు గోపీచంద్. సెకాండాఫ్‌లో నెగెటివ్ షేడ్స్‌వున్న నంద క్యారెక్టర్‌లో గోపీచంద్ పెర్‌ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్లు హన్సిక, కేథరిన్‌ల గ్లామర్ సినిమాకి ప్లస్. ముఖ్యంగా కేథరిన్ బికినీలో కనిపించిన సన్నివేశం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కామెడీని పండించే విషయంలో వెనె్నల కిషోర్, బిత్తిరి సత్తి శాయశక్తులా కృషి చేశారు.
సాంకేతికవర్గంలో సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫి హైలెట్. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. హీరో, హీరోయిన్ల గ్లామర్‌ను రెట్టింపు చేశాడు. గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. థమన్ బాణీల్లో రెండు పాటలు బాగున్నాయి. చిత్రీకరణ పరంగా అన్ని పాటలూ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. సంపత్‌నంది రాసిన కొన్ని మాటలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్‌కి థియేటర్‌లో క్లాప్స్ వినిపించాయి. అయితే కథ గురించి చెప్పాలంటే హీరో రెండు పాత్రల్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు అందరు టాప్ హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారు. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉంటుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలూ యాక్టివ్‌గానే వుంటారు. ఒక హీరో సెకెండాఫ్‌లో విలన్‌గా మారతాడు. అదే ఈ కథలోని కొత్తదనంగా చెప్పుకోవాలి. రెగ్యులర్‌గా వచ్చే డ్యూయెల్ రోల్ సినిమాలకు భిన్నంగా చిత్రాన్ని రూపొందించాడు సంపత్‌నంది. డబ్బు ముఖ్యంకాదు, మానవతా విలువలు ముఖ్యమనే దర్శకుడి ఆలోచన ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఎవ్వరూ ఊహించని విధంగా నంద విలన్‌గా మారడం, గౌతమ్‌ని చంపాలని ప్రయత్నించడండో ఒక్కసారిగా సినిమా రేంజ్ మారిపోయింది. నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావుల రిచ్‌నెస్ సినిమాలో కనిపించింది.
గోపీచంద్‌తో సంపత్‌నంది చేసిన ఈ ప్రయత్నం ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. మంచి నిర్మాణ విలువలతో కూడిన విజువల్స్ ఫర్వాలేదనిపించే ఫస్ట్ఫా, ప్రీ క్లైమ్సా ట్విస్ట్, బాగుందనిపించే క్లైమాక్స్, గోపీచంద్ నటన సినిమాలో మెప్పించే అంశాలు. కాగా పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో సంపత్‌నంది కొంతమేర విఫలమవడం, అనవసరమైన, బోరింగ్ సన్నివేశాలు కథనంలో అడ్డుపడుతుండటం నిరుత్సాహపరిచే అంశాలు.

-త్రివేది