మెదక్

గుప్త నిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు: గుప్త నిధుల కోసం అర్థరాత్రి దాటిన తరువాత తవ్వకాలు జరిపిన సంఘటన బిడిఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. విశ్వసనీయ సమచారం మేరకు దాడులు జరిపిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. బిడిఎల్ భానూర్ సిఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి సిబ్బందితో కలిసి జరిపిన దాడిలో నిందితులు తవ్వకాలు జరుపుతుండగా పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు అందించిన ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి. బిడిఎల్ పోలీస్‌స్టేషన్ పరిధి రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ శివారులలో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత కొంతమంది గుప్త నిధుల కోసమై తవ్వకాలు జరపడం ప్రారంభించారు. తవ్వకాలు జరుపుతున్న ప్రదేశంలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ తదితర సామగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతకాలంగా అనే్వషణ చేసిన తరువాత తవ్వకాలకు పూనుకున్న వారు పక్కాగా ప్రణాళిక రచించారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత వెలిమెల గ్రామ శివారులలోకి చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో భానూర్ బిడిఎల్ సిఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటరరెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. సంఘటన స్థలంలో ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేసారు. అరెస్టు అయిన వారిలో రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మహమ్మద్ తాహెర్, అప్ప, హైద్రాబాద్ అంబర్‌పేటకు చెందిన రాములు, నల్గొండ జిల్లా సూర్యపేట తిరుమలగిరికి చెందిన వెంకటయ్య, వెంకటేశం, ఉమేష్, వరంగల్ జిల్లాకు చెందిన ఐలయ్యలు ఉన్నారు. అరెస్టు చేసిన ఏడు మందిని సోమవారం పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విపక్షాల వలలో కోదండరామ్
దుబ్బాక: కోదండరామ్ చేస్తున్న రోడ్ షో వీధి భాగోతంలా ఉందని, మేధావైన ఆయన ప్రతిపక్షాలు ఆడిస్తున్నట్లుగా ఆడడం భాదకరమని రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండలంలోని అచ్చుమాయపల్లిలో యాదవులకు గొర్రెల పంపిణీ, సిసి రోడ్ పనులు ప్రారంభించారు. అనంతరం దుబ్బాకలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కోదండరామ్‌కు ప్రతిపక్ష పార్టీలు ఆయన మోకానికి ముసుగేసి మాట్లాడిస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టులు కడితే కోదండరామ్‌కు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు పండక రైతులు ఇంకా చావాలా అన్నారు. మల్లన్న సాగర్‌పై పనులు అడ్డుకునేందుకు కోదండరామ్ ప్రయత్నించడం మంచి పరిణామం కాదన్నారు. ప్రాజెక్టులు కట్టాక తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అప్పుడు కోదండరామ్ చరిత్ర హినుడుగా మిగిలిపోవాల్సి వస్తుందని విమర్శించారు. కోదండరామ్ మేధావిగా తాను ఆయనను చాలా గౌరవిస్తానని కాకపోతే ఆయన చేస్తున్న ప్రజాభిష్ఠ వ్యతిరేకత పనులతో గౌరవాన్ని కోల్పోతున్నారన్నారు. దేశంలో ఏరాష్ట్రం కూడ ఇంత వరకు ఇవ్వని నష్టపరిహారం మల్లన్నసాగర్‌లో భూములు కోల్లోతున్న ముంపు బాధితులకు అధికంగా నష్టపరిహరం ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపి కమ్యూనిస్టుల వలలో చిక్కున్న కోదండరామ్ పనిగట్టుకొని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిర్మించి ప్రజలంతా సుఖంగా ఉండేలా చేయడమే టిఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పద్మ, నాయకులు ఆస స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నేరెళ్ల ఘటన సభ్యసమాజానికి తలవంపు
సిద్దిపేట: రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ అరాచక పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ శాసనపక్షనేత జానారెడ్డి, శాసనమండలి నేత షబ్బీర్ అలీ, పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో టిఆర్‌ఎస్ అండదండలతోనే ఇసుక మాఫియా కొనసాగుతుందన్నారు. ఇసుక మాఫీయాను అడ్డుకున్నందుకు దళితులపై పొలీసులు దాడులు చేయడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘటన దళితులపై దాడి చర్చానీయాంశంగా మారిన ఇంత వరకు ఈ సంఘటనపై నియోజకవర్గానికి చెందిన మంత్రి కెటిఆర్ ఇంత వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. మంత్రి కెటిఆర్‌కు అహాంకారం పనికి రాదు, మానవత్వం కోసమైన బాధితులను పరామర్శించలేదన్నారు. దళితులపై పాశవికంగా వ్యవహరించడమేనా ప్రెండ్లి పోలీసులా అని ప్రశ్నించారు. దళితులపై దాడి చేసిన పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటిపై కేసు నమోదు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన అండగా ఉంటుందన్నారు. పోలీసులపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు చేసేలా ఒత్తిడి తేస్తామన్నారు. మానవ హక్కుల సంఘాన్ని అశ్రయిస్తామన్నారు. నేరెళ్ల సంఘటన సభ్యసమాజానికే తలవంపుగా అభివర్ణించారు. ఇప్పటికైన దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఇన్‌చార్జి తాడూరి శ్రీనివాస్‌గౌడ్, గాదగొని సత్యంగౌడ్ తదితరులు పాల్గ్గొన్నారు.

చేనేత, హస్తకళల ప్రదర్శన ప్రారంభం
సంగారెడ్డి టౌన్: పట్టణంలోని టిటిడి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళల ప్రదర్శనను సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిస్తున్న హస్తకళలను కాపాడుతూ ప్రదర్శించడం అభినందనీయమన్నారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అనంతరం ప్రదర్శనలోని చేనేత, హస్తకళలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, ఐసిడిఎస్ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆహార పదార్థాల కల్తీని సహించేది లేదు
పటన్‌చెరు: చిన్నారులు అతి ఇష్టంగా తినే ఆహార పదార్థాల కల్తీని ఎట్టి పరిస్థితులలోనూ సహించేది లేదని సంగారెడ్డి, మెదక్ జిల్లాల ఫుడ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ తేల్చిచెప్పారు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పటన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సాయిసాగర్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనే పరిశ్రమలో సోమవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. సిసిఎస్ పోలీసులు ఏఎస్‌ఐ ఆసిఫ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌లతో కలిసి బ్రెడ్‌లు, బిస్కెట్‌లలో కలిపే ముడి సరుకులను పరిశీలించిన ఆయన పరీక్షల నిమిత్తం వాటి నమూనాలను సేకరించారు. అనంతరము ఆయన మాట్లాడుతూ తిను బండారాలను తయారు చేస్తున్న పరిశ్రమలను విధిగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా పాశమైలారంలోని సాయి సాగర్ ఫుడ్ ఇండస్ట్రీస్‌లోని ఉత్పత్తులను పరిశీలించడం జరిగిందన్నారు. బిస్కెట్‌లు, బ్రెడ్‌లు తయారు చేస్తున్న సదరు పరిశ్రమ యాజమాన్యానికి ఆహర పదార్థాల తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించడం జరిగిందన్నారు. కొన్ని నమూనాలను సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు నిరంతన తనిఖీల ద్వార కల్తీని పూర్తిగా నిరోధిస్తామన్నారు.

కేతకిలో ప్రత్యేక పూజలు
ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వఠ స్వామి ఆలయంలో సోమవారం నాడు భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది. సోమవారాల్లో గర్భగుడిలోని శివలింగానికి అబిషేకం నిషేదించడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండ మండపంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్నాటక, మహారాష్ర ట నుంచి ఆదివారం రాత్రి కే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని సోమవారం ఉదయం ఐదు గంటల నుంచే దర్శనం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. అమృత గుండంలో స్నానం ఆచరించి జలలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.
అందోల్, జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌గా రాజేశ్వర్
జోగిపేట: అందోల్, జోగిపేట నగరపంచాయతీ కమిషనర్‌గా రాజేశ్వర్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నగరపంచాయతీ ఏర్పడిన నాలుగు సంవత్సరాల్లో 6వ కమిషనర్‌గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. నగరపంచాయతీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కమిషనర్‌లు తరచుగా బదిలీ అవుతూనే ఉన్నారు. కమిషనర్లు బదిలీ కావడం, సస్పెండ్ కావడం తెలిసిందే.

కాంగ్రెసోళ్లది డైరెక్షన్...కోదండరామ్‌ది యాక్షన్
సిద్దిపేట: గజ్వేల్ స్పూర్తి యాత్రతో కోదండరామ్ నిజస్వరూపం బయట పడిందని, కాంగ్రెస్ పార్టీ మెలిముసుగు తొలిగి పోయిందని, కాంగ్రెస్ పార్టీ ఏజెంటుగా పనిచేస్తున్నట్లు రుజువైందని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత వేలేటి రాధకిషన్‌శర్మ అన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో సోమవారం వారు మాట్లాడుతూ 2014లోనే జెఏసి చైర్మన్ హోదాలో కోదండరామ్ కాంగ్రెస్ పార్టీల నాయకులను కలిసి కొందరికి టిక్కెట్లు ఇప్పించే యత్నం చేశారన్నారు. కోదండరామ్‌ది స్వంత లాభమే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రైతుల ఆత్మహత్యలపై మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. ప్రాజెక్టులను కట్టాలంటూనే ప్రభుత్వం ముమ్మరంగా చేపడుతున్న భూసేకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ మూడేళ్లలో రైతు పక్షపాతిగా ముద్ర వేసుకుందన్నారు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే వ్యవసాయానికి 9గంటల కరెంటు ఇచ్చామన్నారు. 24గంటల కరెంటును కొన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీని అందజేశామన్నారు.