ఫోకస్

సినిమా రంగానే్న టార్గెట్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ వాడకం ఒక సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాదు. వీటికి అలవాటు పడిన వారిలో స్కూల్ పిల్లలు మొదలుకొని కాలేజి విద్యార్థులు, ఐటీ ఎంప్లాయిస్, రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు అందరూ ఉన్నప్పటికీ ఇటీవల విచారణ జరిగిన తీరు చూస్తే సినిమా రంగానికి మాత్రమే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ఒక విషయం మాత్రం వాస్తవం. దక్షిణాది సినిమా రంగమంతా చెన్నైలో ఉన్నప్పుడు ఎంతో క్రమశిక్షణ ఉండేది. ఎప్పుడైతే హైదరాబాద్‌కు ఫీల్డ్ మారిందో ముంబాయికి చెందిన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఇక్కడి రావడం మొదలు పెట్టాకే క్రమశిక్షణ తప్పింది. ఎక్సైజు ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి నోటీసులు అందుకున్న వారంతా డ్రగ్స్ అడిక్ట్ అయినట్టు భావించకూడదు. డ్రగ్స్ అలవాటు ఈ రంగంలో అసలు లేనేలేదు అని చెప్పడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. డ్రగ్స్ వాడకం ఒక్క సినిమా రంగంలోనే కాదు.. సమాజంలో మంచిచెడు అనేది ఎక్కడైనా, ఏ రంగంలోనైనా ఉన్నట్టుగానే ఒకటో అర శాతమో ఇక్కడ కూడా ఉండివచ్చు. కానీ డ్రగ్స్‌కు కేరఫ్ అడ్రస్ సినిమా రంగం అన్నట్టు ప్రచారం కావడం బాధకరమైన విషయం. ఇతర రంగాల్లోని వారిని వదిలేసి, ఒక్క సినిమారంగానే్న టార్గెట్ చేశారన్న అభిప్రాయాన్ని తుడిచి వేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఎంతటి వారైనా, రాజకీయ నాయకులైనా, చివరికి తమ ప్రభుత్వంలోని మంత్రులైనా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉంటే వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడం ఎంతో సంతోషకరం. డ్రగ్స్ మహమ్మరిని అంతం చేయడం ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినిమా రంగం కూడా సహకరిస్తుంది. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమా రంగాన్ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా ఏర్పడిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

- కవిత, సినీనటి