ఫోకస్
ఎంత పెద్దవారినైనా శిక్షించాల్సిందే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డ్రగ్ మాఫియాతో ఎంత పెద్ద వారైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏ రంగానికి చెందినవారైనా సంబంధాలుంటే ప్రాసిక్యూట్ చేయాలి. వారిని చట్ట ప్రకారం శిక్షించాలి. డ్రగ్స్ సేవించేవారిని, అమ్మేవారిని, దళారులను, సరఫరాదారులపై కేసులు నమోదు చేయాలి. ఈ విషయంలో ఉపేక్షించరాదు. డ్రగ్స్ మాఫియాతో సినిమా లేదా రాజకీయ రంగానికి లేదా సామాజిక రంగాలకు చెందినవారు పలుకుబడి కలిగి ఉన్నారనే కారణంపై ఉదాసీన వైఖరిని అవలంభించరాదు. ఈ మహమ్మారిని వీలైనంత త్వరగా సమాజం నుంచి తరిమివేయాలి. సినిమా రంగం ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. నటులు, నటీమణులు, దర్శకులు, ఇతర కళాకారులను ప్రజలు దైవంగా కొలుస్తారు. కాని దురదృష్టవశాత్తు ఈ రంగానికి చెందినవారి పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు దేశమంతా డ్రగ్ మాఫియా విస్తరించింది. క్రోనీ క్యాపిటలిజం వల్ల నడమంత్రపు సిరి పెరిగి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా డ్రగ్స్‌కు ఆర్డర్ ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే డ్రగ్ మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు ఏజన్సీలను ఏర్పాటు చేసి విస్తృత అధికారాలు ఇవ్వాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కేసుల విచారణను వేగవంతం చేయాలి. డ్రగ్స్‌కు బానిసైన యువతకు పునరావాస సదుపాయం నిమిత్తం రిహాబిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దీనికోసం సైక్రియాట్రిస్టుల సేవలను వినియోగించుకోవాలి. కళాశాల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. డ్రగ్స్ అమ్మకందార్లను పట్టుకునేందుకు సమాజాన్ని అప్రమత్తం చేయాలి. అన్ని వర్గాలు, రంగాల్లో డ్రగ్స్ సేవించేవారున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ వ్యసనానికి ప్రాంతం, వర్గం అనే తేడా లేదు.