ఫోకస్

ప్రభుత్వ నిర్ణయం సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టంలోని లొసుగులను ఆసరాగా తీసుకుని డ్రగ్స్ దందా సాగించడం సమాజాన్ని భ్రష్టుపట్టించడమే. ఇప్పటివరకు డ్రగ్స్ దందా నుంచి తప్పించుకున్న వారు.. ఇకపై తప్పించుకోలేరు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సమాజానికి కీడు తలపెట్టే డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం అనివార్యం. డ్రగ్స్ వాడినా, అమ్మకాలు సాగించినా తీవ్ర నేరం కింద పరిగణించడం ముదావహం. గత కొనే్నళ్లుగా చిన్న చిన్న మత్తుపదార్థాలు పట్టుబడుతున్నప్పటికీ నిందితులు తప్పించుకున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడేవారు 30-40 మధ్య వయస్కులే. కానీ ప్రస్తుతం డ్రగ్స్ విదేశీ బ్రాండ్‌గా మారడంతో వయస్సుతో భేదం లేకుండా వాడేస్తున్నారు. గతంలో ఆర్థికంగా, కలిగినవారే డ్రగ్స్‌ను వాడేవారు. ప్రస్తుత సమాజంలో రిక్షా కూలీ మొదలుకొని సంపన్నులు కూడా డ్రగ్స్‌కు బానిసలవడం విచారకరం. గత నాలుగేళ్ల క్రితంనుంచి పోల్చి చూస్తే డ్రగ్స్ వాడకందార్లు విపరీతంగా పెరిగిపోయారు. డ్రగ్స్ ప్రభావం పెద్ద పెద్ద వ్యాపారుపైనే కాకుండా సినీ రంగం, ఐటి రంగం, విద్యాసంస్థలకు కూడా పాకింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తప్ప.. ఇతర మాదకద్రవ్యాలు లభించేవి కావు. ఐటి పరిశ్రమ ఎప్పుడైతే పుంజుకుందో విదేశీయుల రాక పెరిగిపోయింది. ముఖ్యంగా నైజీరియన్లతో డ్రగ్స్ దందా విస్తరించింది. ఐటి రంగం లక్ష్యంగా దందా సాగుతోందని చెప్పవచ్చు. ఐటి సంస్థలు పెరుగుతున్నా కొద్దీ.. మాదకద్రవ్యాల మాఫియా కూడా పెరిగిపోయింది. నగరంలో కల్చర్‌తోపాటు పబ్‌ల స్థాపన కూడా పెరిగిపోయింది. పబ్‌ల్లో హుక్కా, గంజాయి మాత్రమే లభ్యమవుతుండగా, ప్రస్తుతం కొకైన్ నుంచి ఎస్‌ఎల్‌డి, ఎస్‌ఎల్‌డిఎంల స్థాయివరకూ విస్తరించింది. ఇటీవల ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు జరిపిన సోదాల్లో డ్రగ్స్ దందా భారీగా కొనసాగుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ పరిగణిస్తోంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రయత్నిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం తనిఖీలు ముమ్మరం చేసింది. మాదకద్రవ్యాల నివారణకు పలు చర్యలు చేపట్టాం. విద్యార్థులకు కౌనె్సలింగ్ ఇవ్వడం, డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

-సందీప్ శాండిల్య పోలీస్ కమిషనర్, సైబరాబాద్