ఫోకస్

ఎవరినీ వదలం.. ఎవరిపైనా కక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ మహమ్మారి బారిన ఎవరూ పడకూడదు అని మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోంది అంతేతప్ప ఈ కేసులో ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదు. డ్రగ్స్ గురించి తెలియగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చాలా సీరియస్‌గా స్పందించారు. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయ... ఎలా వస్తున్నాయ.... ఎవరెవరు దీనికి బానిసలయ్యారు... అనే దానిపై విచారణ జరుగుతోంది. వీటిని అరికట్టాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపైనా మా శాఖలో విస్తృతమైన చర్చలు జరగడంతో పాటు చర్యలకు ఉపక్రమిస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. విచారణలో భాగంగా కొంతమందిని ‘సిట్’ అధికారులు విచారిస్తున్నారు. అంతేగాని సినిమా వారిపై కక్ష కట్టారు అనే ప్రచారం నిజం కాదు. సినిమా వారినే కాదు విద్యా సంస్థలు, హోటల్స్‌కు చెందినవారిని కూడా విచారించారు. ఐటి కంపెనీల్లో పనిచేసే కొద్ది మందికి కూడా అలవాటు ఉందని వారినీ విచారించారు. అయితే సినిమా వారికి ఉండే గ్లామర్‌వల్ల వారిని మాత్రమే టార్గెట్ చేశారు అనే అభిప్రాయం ఏర్పడింది. విచారణకు సినిమా వాళ్లు కూడా సహకరిస్తున్నారు. సినిమావాళ్లు కూడా సమాజంలో ఒక భాగమే, డ్రగ్స్ లేకుండా ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని వారు కూడా కోరుకుంటారు. సినిమా వారిపై కక్ష సాధింపుగా విచారణ జరుపుతున్నారు అనే ప్రచారాన్ని నమ్మ వద్దు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ అంశంపై వివరణ ఇచ్చారు. డ్రగ్స్ తీసుకున్నవారు బాధితులే తప్ప నిందితులు కాదు అని చెప్పారు. డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని మాన్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో డ్రగ్స్ అనేది ఎక్కడా కనిపించకూడదు. ఆరోగ్యకరమైన సమాజంకోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అహరహం కృషి చేస్తున్నారు. ఈ కృషికి అందరూ సహకరించాలి. గుడంబాను, రౌడీయజాన్ని నిర్మూలించిన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ను సైతం లేకుండా చేయడంలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.

- నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ హోం శాఖ మంత్రి