ఫోకస్

లభ్యతను పూర్తిగా అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ అలవాటు ఒక మహమ్మారి. ఇది సామాజిక సమస్య. సమాజాన్ని, దేశాన్ని బలహీన పరిచేందుకు ఇంతకు మించిన అస్త్రం మరొకటి లేదు. మత్తుమందులకు విద్యార్థులు, యువత బానిసలైతే దేశం బలహీన పడుతుంది. స్వామి వివేకానంద అభిప్రాయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ‘‘యువత బలంగా ఉంటే దేశం బలంగాంటుంది, యువత బలహీనపడితే దేశం బలహీనపడుతుంది’’ అన్న వివేకానంద సూక్తి నాటికీ, నేటికీ, రేపటికి కూడా వర్తిస్తుంది. నేటి బాలలే రేపటిపౌరులు అన్న నానుడిని పరిశీలిస్తే, నేటి విద్యార్థులు, యువత క్రమశిక్షణగా ఉంటే భవిష్యత్తులో దేశం బలంగా మారుతుంది. నేటి యువత మత్తుమందుకు, డ్రగ్స్‌కు అలవాటైతే, వారు శారీరకంగా బలహీనపడతారు, ఏ పనీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరతారు. అలాంటి వారివల్ల దేశం నిర్వీర్యం అవుతుంది. అంటే భావిభారత పౌరుల నడవడిక బాగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులు, విద్యాసంస్థలపై ఉంటుందనడంలో సందేహం లేదు. డ్రగ్స్ విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయని స్పష్టమైంది. దీని దిగుమతిని పూర్తిగా అరికట్టాలి. మార్కెట్లో డ్రగ్స్ క్రయవిక్రయాలు జరగకుండా చూడాలి. భారతరాజ్యాంగంలో ఉపోద్ఘాతం లేదా ప్రవేశిక (ప్రియాంబుల్) ను పరిశీలిద్దాం.. ‘‘్భరతదేశ పౌరులమైన మనం, భారత రాజ్యాంగాన్ని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకుని, సార్వభౌమ, సామాజిక, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా కొనసాగేందుకు కృషిచేద్దాం’’ అందరికీ సమాన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తిగత గౌరవం అందించేందుకు భారతరాజ్యాంగం హక్కులను కల్పించింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలను కూడా కట్టబెట్టింది. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఇందుకు క్రమశిక్షణ ఎంతో అవసరం. ప్రతి వ్యక్తి నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. దేశ రక్షణలో భారతీయ సైన్యం ఎలా కృషిచేస్తుందో, దేశ అంతరంగిక శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంటుంది. డ్రగ్స్ ఉత్పత్తి, అమ్మకం, వాడకాన్ని మన చట్టం నిషేధించింది. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందే. పోలీసు విభాగానికి చెందిన విచారణ సంస్థలు సమర్థతగా వ్యవహరిస్తే, కోర్టులు నిందితులకు శిక్ష విధిస్తాయి. నేరస్థులకు శిక్షపడితే తప్ప వారిలో భయం ఏర్పడదు. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండే క్రమశిక్షణ నేర్పాలి. చదువుతోపాటు ఉత్తమమైన భావిభారత పౌరులుగా రూపుదిద్దేందుకు వారి ఆలోచనలకు పదునుపెట్టాలి. విద్యాసంస్థలు కూడా విద్యార్థుల్లో సంస్కారం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా బంగారు భారతదేశాన్ని, శక్తివంతమైన దేశాన్ని రూపొందించుకోగలం.

-జి.విజయ్‌కుమార్ అడ్వకేట్