ఫోకస్

తల్లిదండ్రులూ అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు సమాజాన్ని మత్తు పదార్థాల అంశం కుదిపివేస్తున్నది. ఇదే అన్ని అనర్థాలకు కారణమవుతున్నది. ఒకవైపు మద్యం మరోవైపు మత్తు పదార్థాల (డ్రగ్స్)తో నవతరం, యువతరం పెడదోవ పడుతున్నది. దీంతో అన్ని వర్గాల ప్రజలూ ఆందోళన చెందుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల కంటే ఎక్కువగా బాగా సంపద ఉన్న ఉన్నత వర్గాల కుటుంబాలే మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారన్న భ్రమ కొందరిలో ఉంది. డ్రగ్స్ కొంత ఖరీదైనవి కాబట్టి వారికి అందుబాటులోకి వస్తే వస్తుండవచ్చు కాదనను.. కానీ మత్తు పదార్థాల అలవాటు, వాటికి బానిస కావడం అనేది వ్యక్తి నడవడికపై ఆధారపడి ఉంటుంది. మత్తు పదార్థాలకు బానిస కావడానికి కుటుంబ పెద్దలపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత వర్గాలు కొంత ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటే, పేద, మధ్య తరగతి కుటుంబీకుల్లో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయితే వారి స్తోమతను బట్టి ఖరీదు చేస్తుంటారు. సంపద కలవారు ఖరీదైన డ్రగ్స్ వినియోగిస్తే, పేద, మధ్య తరగతికి చెందినవారు గడుంబా, గంజాయి, గుట్కా, భంగ్ వంటివి వాడుతారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి పేద, మధ్య, ఉన్నత అనే బేధం ఉండదు. కులం, మతం, వయస్సు తేడాలు ఉండవు.
డ్రగ్స్ వినియోగం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొన్ని దేశాలు కఠినంగా అరికడుతుంటే, మరికొన్ని దేశాలు చూసి చూడనట్లు వదిలి వేస్తున్నాయి. తెలంగాణలో చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు డ్రగ్స్ వినియోగించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, ‘సిట్’ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేయడం మంచిదే కానీ ఒక్క చిత్ర పరిశ్రమనే లక్ష్యంగా చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం హీరోయిజం చూపించకుండా నిజాయితీగా అరికట్టేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలి. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ప్రభుత్వంతోనే సాధ్యంకాదు. సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు సంపాదనలో బిజీగా ఉండి, పిల్లలను పట్టించుకోకుండా వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. పిల్లలకోసమే కదా సంపాదన అనే వాదిస్తారు. నిజమే, కానీ వారి ఆలనా-పాలనాతోపాటు వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రతిరోజూ తప్పని సరిగా పిల్లలకు సమయం కేటాయించాలి. వారి స్నేహితుల గురించి ‘ఆరా’ తీయాలి. పిల్లలు సన్మార్గంలో నడుస్తున్నారా లేదా అనే కోణంలో పరిశీలన చేయాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చిన్నతనంనుంచే అంటే పాఠశాల స్థాయినుంచే పాఠ్యాంశం చేసి బోధించాలి. మంచి నడవడిక, సత్ప్రవర్తన వంటి పద్ధతులు, అలవాట్ల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది.

- కె.ఆర్. సురేశ్ రెడ్డి అసెంబ్లీ మాజీ స్పీకర్, టి.కాంగ్రెస్ సీనియర్ నేత