ఫోకస్

మూలాలు గుర్తించి మట్టుపెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారక ద్రవ్యాలు మద్యం కంటే మహమ్మారి. ప్రపంచాన్ని తొలిచేస్తున్న వీటి వినియోగం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నది. ప్రగతి శరవేగంగా పరుగులు తీస్తున్న శతాబ్దంలో ఉన్నాం. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. కాలు కదపకుండా సౌకర్యాలను గుమ్మంలోకి వచ్చేలా అభివృద్ధి సాధించాం. ఒకప్పుడు గాలికన్నా మనస్సు వేగవంతమైనదని అనుకున్నాం. అయితే మనస్సుకు ఉన్న ఆ వేగం ఇప్పుడు ఏమైంది. మనస్సు ఎందుకు మత్తుబారిపోతుంది. చదువులు ఆపై ఉద్యోగాల్లో రాణించాల్సిన యువత మత్తుబాట పడుతున్నారు. ఈ మత్తు అన్ని రంగాలు, అన్ని వయస్సుల వారినుంచి క్రమేణ విద్యాలయాలు కూడా వేదికగా మారుతుండటం బాధాకరం. వాస్తవానికి ఈ మారక ద్రవ్యాలు మరణాల రేటును పెంచుతున్నాయి. మైకంలో మజాను రుచి చూడాలనే ఆరాటం కొందరిని తప్పుదోవ పట్టిస్తూ ఉన్మాదులను, అసాంఘిక శక్తులుగానూ చేస్తున్నాయి. అసలు తొలినుంచి గంజాయి అక్రమ రవాణాకు విశాఖ ఏజన్సీ ప్రాంతాలు మూల కేంద్రంగా పని చేస్తున్నాయి. అక్కడినుండి తెలంగాణ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇలా దేశమంతటా అక్రమ రవాణా జరుగుతున్నది. మొదటి ఈ మూలాలను గుర్తించి ఉక్కుపాదం మోపాల్సి ఉంది. ఇందుకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. 60, 70 దశకాల్లో మాత్రలు, ఇంజక్షన్ రూపాల్లో చాలా అరుదుగా దొరికే ఈ మందులు ప్రస్తుతం రకరకాల ఆకృతులను మార్చుకున్నాయి. మత్తు మందుల రవాణా, పంపిణీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్గాలను గుర్తించి సమూలంగా అణచివేయడంతోపాటు డ్రగ్స్ వాడకంవల్ల కలిగే దుష్ఫలితాలను ప్రచారం చేయాలి. విద్యాసంస్థల్లో నైతిక విలువలకు పెద్దపీట వేయాల్సి ఉంది.

- మహేష్ భగవత్, ఐపిఎస్ ఐజి ఆఫ్ పోలీస్, రాచకొండ పోలీస్ కమిషనరేట్