ఫోకస్

డ్రగ్స్.. సమాజానికి పీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదక ద్రవ్యాల (డ్రగ్స్) ఎగుమతి లేదా రవాణాచేసే వారిపై కఠిన శిక్షలు వేసే దేశాలు ఎన్నో ఉన్నాయి. మాదక ద్రవ్యాలను ఉత్పత్తి లేదా ఎగుమతి చేసేవారికి మరణ శిక్షలను అరబ్ దేశాలు అమలుచేస్తున్నాయి. సింగపూర్ వంటి అత్యాధునిక దేశాల్లో సైతం మాదకద్రవ్యాల ఎగుమతిదారులపై కఠిన శిక్షలు అమలులో ఉన్నాయి. అంతేకాదు మాదక ద్రవ్యాలను వినియోగించే వారిపైనా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. దానికి కారణం మాదక ద్రవ్యాలు మానవ శరీరానికి అత్యంత హానికలిగించే పదార్థాలు కావడమే. వీటిని ప్రపంచం అంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తున్నారు. మాదక ద్రవ్యాలను వాడడం ఒక ప్రమాదకరమైన వ్యసనం. ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం చాలా తీవ్రమైంది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకంటే చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అంటే దాదాపు 18.5 లక్షల మంది ఇలా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. మాదక ద్రవ్యాల్లో అనేక రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్‌ఎస్‌డి మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మాదక ద్రవ్యాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో ఒక పంటగా గంజాయి రూపంలో అందుబాటులో ఉండనే ఉంది. కాని వాటి అమ్మకాలు మాత్రం నల్లబజారులో మాత్రమే జరుగుతున్నాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సాంకేతిక పేర్లతో చలామణి చేస్తుంటారు. ఇలా అక్రమ వ్యాపారాలు దొంగరవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయిలను గడిస్తుంటే యువత వాటిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తోంది. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైతే తర్వాత వారు సంపాదించిందంతా దీనికే వెచ్చించిన సందర్భాలే కాదు, బానిసలైనవారు ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికైనా వెరవడం లేదని గత చరిత్ర చెబుతూనే ఉంది. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్సెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు , వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా శిక్షార్హులవుతారు. ఇలాంటి వ్యవసనపరుల్ని మళ్లీ మామూలు మనుషులుగా మార్చడం చాలా కష్టమైన పనే. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చు. ఇంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపించే డ్రగ్స్ వ్యవహారం తెలంగాణలో బట్టబయలు కావడంతో అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి ఈ అంశం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, ఆంధ్రాలోనూ, తమిళనాడు, ఒరిస్సాసహా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో డ్రగ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇందుకు బాధ్యులుగా భావించిన వారిని జూలై 19వ తేదీ నుండి అబ్కారీ శాఖ అధికారులు విచారించారు. ఈ కేసుతో సినిమా వారికి, ఐటి సిబ్బందికి, చివరికి దీనికి బానిసైన వారిలో పాఠశాలల విద్యార్థులు సైతం ఉండటంతో తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం దీనిని సవాలుగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు కంచికి చేరినట్టేనా.. దీనిని ఇంతటితో వదిలేయాల్సిందేనా.. సమాజం స్పందించాల్సిన పనే్లదా? ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.