అంతర్జాతీయం

సింధూ జలాల ఒప్పందంపై వచ్చే నెల భారత్, పాక్ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 2: సింధూ నదీ జలాల పంపిణీకి సంబంధించిన అంశాలపై భారత్, పాకిస్తాన్‌లు వచ్చే నెల వాషింగ్టన్‌లో మరోదఫా చర్చలు జరపనున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. సింధూ నదీ జలాల ఒప్పందానికి సంబంధించి తన వైఖరిని తెలియజేస్తూ ప్రపంచ బ్యాంక్ సుదీర్ఘమైన ఒక వాస్తవ సమాచార పత్రాన్ని సైతం విడుదల చేసింది. 1960 నాటి సింధూ నదీ జలాల ఒప్పందంపై ఈ వారం భారత్, పాక్‌లు తమ చర్చలను ముగిసించిన తర్వాత ప్రపంచ బ్యాంక్ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ చర్చలు సుహృద్భావం, సహకార స్ఫూర్తితో జరిగినట్లు ప్రపంచ బ్యాంక్ ఆ ప్రకటనలో తెలిపింది. చర్చలను కొనసాగించడానికి సెప్టెంబర్‌లోవాషింగ్టన్ డిసిలో తిరిగి సమావేశం కావడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపింది. అయితే అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.
కాగా, జమ్మూ, కాశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగ, రట్లే జలవిద్యుత్ కేంద్రాలపై పాక్ అభ్యంతరం చెబుతున్నట్లు మంగళవారం విడుదల చేసిన వాస్తవ అంశాల పత్రంలో ప్రపంచ బ్యాంక్ తెలిపింది. జీలం, చీనాబ్ నదుల ఉప నదులపై నిర్మిస్తున్న ఈ రెండు విద్యుత్ ప్రాజెక్టుల టెక్నికల్ డిజైన్ అంశాలు ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఈ రెండు దేశాల మధ్య విభేదాలున్నట్లు ఆ పత్రం పేర్కొంది. అయితే ఒప్పందం ప్రకారం కొన్ని పరిమితులకు లోబడి భారత్ ఈ రెండు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతి ఇచ్చినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించడం కోసం ఒక మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాలని పాక్ కోరుతుండగా, పాక్ లేవనెత్తినవి కేవలం సాంకేతికపరమైన అంశాలని, అందువల్ల వాటిని పరిశీలించడం కోసం ఒక తటస్థ నిపుణుడిని నియమించాలని భారత్ కోరుతోందని ప్రపంచ బ్యాంక్ ఆ ప్రకటనలో తెలిపింది.