జాతీయ వార్తలు

మరణాల నమోదుకు ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: మరణాలను నమోదు చేసేందుకు అక్టోబర్ 1నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను సమర్పించాలని కేంద్రం ప్రకటించింది. గుర్తింపులో మోసాలను నిరోధించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. జమ్మూ- కాశ్మీరు, అసోం, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని, ఈ మూడు రాష్ట్రాలకు మరో తేదీని విడిగా ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. ‘మరణాలను నమోదు చేసేందుకు మృతుల ఆధార్ తప్పనిసరి. అక్టోబర్ 1నుంచి అమలులోకి వస్తుంది’ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. మరణాన్ని నమోదు చేసేందుకు మృతుని కుటుంబ సభ్యులు లేదా బంధువులు సమర్పించే వివరాలు కచ్చితమైనవో, కావో తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీంతో మృతుని గుర్తింపులో మోసాలకు తావులేకుండా చూసేందుకు వీలవుతుందని హోం శాఖ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం తెలిపింది.