జాతీయ వార్తలు

కిశోర్.. నిన్ను మరువగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాండ్వా(ఎంపి), ఆగస్టు 4: గాతారహే మేరాదిల్ అంటూ వందలాది పాటలతో భారతీయ జన హృదిని అలరించిన ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ 88వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఆయన జన్మస్థలపై ఖాండ్వా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, చిత్ర నిర్మాతగా కూడా రాణించిన కిశోర్ కుమార్ 1929 ఆగస్టు 4న ఇక్కడ జన్మించారు. ఈ పట్టణంలోని కిశోర్ కుమార్ సంస్మరణ కేంద్రం వద్ద ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పించారు. కిశోర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన జిలేబిని అందరికీ పంచుతూ జయంతి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నారు. మేయర్ సుభాష్ కొఠారీ, స్థానిక ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ, కలెక్టర్ అభిషేక్‌సింగ్, ఎస్‌పి నవీన్ బాసిన్ తదితరులు కిశోర్ సంస్మరణ కేంద్రాన్ని సందర్శించారు. కిశోర్ కుమార్‌తో తన బాల్యాన్ని ఖాండ్వాలోనే గడిపారు. అనంతరమే ముంబయి వెళ్లి నటుడిగా, గాయకుడిగా స్థిరపడ్డారు. దేవానంద్ నుంచి రాజేష్‌ఖన్నా, అమితాబ్ తదితర నాటి మేటి నటులందరికీ కిశోర్ తన అద్భుత గళాన్ని అందించారు. కిశోర్ కుమార్ ఎప్పుడూ తన జన్మస్థలాన్ని మరిచిపోలేదని ‘పాలలో ముంచిన జిలేబీ తిందామా? ఖాండ్వా వెళ్దామా తరచూ అనేవారని’ ఈ సందర్భంగా ఆయన అభిమాని ఒకరు గుర్తుచేసుకున్నారు. ముంబయి బజార్ ప్రాంతంలోని కిశోర్‌కుమార్ వారసత్వ ఇంటిని సంస్మరణ కేంద్రంగా మార్చాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కిశోర్ జయంతి సందర్భంగా భూపాల్‌లో ఓ సంగీత కచేరి బృందం ఆయనకు నివాళిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సాధనా సర్గం, సునీల్ శుక్రావారే సహా అనేక మంది గాయనీ గాయకులు కిశోర్ పాటలను పాడి నాటి మాధుర్య శకాన్ని జనం కళ్లకు కట్టారు.