జాతీయ వార్తలు

రాహుల్ కారుపై రాళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనేరా, ఆగస్టు 4: గుజరాత్‌లోని ధనేరాలో వరద ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రాహుల్ గాంధీకి ఎటువంటి గాయాలు కాలేదు కానీ ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి.
లాల్ చౌక్‌నుంచి ధనేరా హెలిపాడ్ వద్దకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. రాహుల్ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగిందని, ఓ వ్యక్తి విసిరిన రాయి రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై పడి వెనుక అద్దం దెబ్బతిందని బనస్కాంత ఎస్పీ నీరజ్ తెలిపారు. అంతకు ముందు లాల్ చౌక్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ కొంతమంది నినాదాలు చేస్తూ నల్లజెండాలు ప్రదర్శించడంతో రాహుల్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించుకుని వెళ్లిపోయారు. బిజెపి గూండాలు ఈ దాడిలో పాల్గొన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. ఈ దాడిలో కాన్వాయ్‌లోని పలు వాహనాలు దెబ్బతిన్నాయని, ఓ సెక్యూరిటీ గార్డుకు స్వల్పగాయమైందని ఆయన చెప్పారు. అయితే రాయి విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దాడులకు భయపడను: రాహుల్
నరేంద్ర మోదీజీ.. రాళ్ల దాడులు, నినాదాలు, నల్లజెండాలతో నిరసనలకు భయపడేది లేదని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవచేయడంలో శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తన కారుపై జరిగిన రాళ్ల దాడికి రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో ఈ విధంగా ట్వీట్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించాలని భద్రతా సిబ్బంది కోరినా కాన్వాయ్‌లోని మొదటి కారులోనే రాహుల్ ప్రయాణించారు. ఆ కారుపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సిమెంట్ ఇటుకతో దాడి చేశాడు.