జాతీయ వార్తలు

బిజెపికి స్వర్ణయుగాన్ని అందించిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 4: భారతదేశంలో బిజెపికి ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్వర్ణయుగానే్న అందించారని భారత్-అమెరికా మేధావులు పేర్కొన్నారు. ముఖ్యంగా బిహార్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూప్రసాద్ యాదవ్‌తో నితీష్‌కుమార్ తెగతెంపులు చేసుకోవడంతో బిహార్‌లో అధికారాన్ని పంచుకునే అవకాశం బిజెపికి దక్కిందన్నారు. నెహ్రూ, గాంధీ అనువంశీకుల పాలనలోనే దశాబ్దాలపాటు సాగిన సువిశాల భారతావనిలో ఈ తాజా పరిణామం బిజెపికి ఒక కీలక మలుపు అని కార్నిజ్ ఎండోమెంట్ సంస్థలో దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు మిలన్ వైష్ణవ్ అన్నారు. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపిదే కీలక స్థానమవుతుందని, అప్పట్లోగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, లేనిచోట్ల దాన్ని సాధించుకునేందుకు శరవేగంతో బిజెపి సాగుతోందని ఓ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బిజెపి బలం పెరగడం, విధానపరమైన సుస్థిరత సందేశాలు అందించడం, రాజకీయంగా సంఘటితం కావడం ఎలావున్నా అదే క్రమంలో ప్రజాస్వామ్య విలువలకు చెందిన కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ కూడా తన వ్యాపార అనుకూల విధానాలతోనూ, జాతీయ దృక్పథంతోనూ యువతకు ఉత్తేజాన్ని కలిగించే వైఖరితోనూ నరేంద్ర మోదీ బిజెపిని చారిత్రక విజయాల దిశగా తీసుకెళ్లారని తెలిపారు. ఈ పరిస్థితులన్నీ బిజెపికి గతంలో ఎన్నడూలేనంత విస్తృత స్థాయిలో రాజకీయంగానూ, ఇతరత్రానూ అవకాశాలు అందించాయన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లోనూ మెజారిటీ సాధించడం వల్ల శాసనపరమైన అవరోధాలన్నింటినీ బిజెపి తేలిగ్గానే అధిగమించగలుగుతుందని అన్నారు. పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నా అధికారం పూర్తిస్థాయిలో కేంద్రీకృతం కావడమన్నది ఎలాంటి విపరిణామాలకైనా దారితీసే అవకాశముందన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదంటూ ఆయన హెచ్చరిక స్వరాన్ని అందించారు.