ఆటాపోటీ

రీ ఫైట్ అదిరింది (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యుఎఫ్‌సి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లైట్ హెవీవెయిట్ చాంపియన్ జాన్ జోన్స్‌కు తన చిరకాల ప్రత్యర్థి డానియల్ కార్మియర్‌పై చిర్రెత్తుకొచ్చింది. సుమారు రెండేళ్ల క్రితం తన చేతిలో ఓడిన కార్మియర్ రీ ఫైట్ కోసం పదేపదే డిమాండ్ చేయడం అతడిని కోపంలో ముంచేసింది. సవాలును స్వీకరించి, అనాహెమ్‌లో జరిగిన రీ ఫైట్‌లో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. మూడో రౌండ్‌లో జోన్స్ విసిరిన బలమైన పంచ్ తలకు బలంగా తగలడంతో కార్మియర్ కుప్పకూలాడు. మరోసారి రీ ఫైట్‌ను అడిగే సాహసం చేయడేమో!

కష్టమే.. కానీ..
* లండన్‌కు చెందిన 19 ఏళ్ల బెన్ కానే్వకు పర్వతారోహణ అంటే ఇష్టం. బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తయిన బెన్ నెవిస్ శిఖరాన్ని ఎక్కేశాడు. ఈ పర్వతం ఎత్తు 1,345 మీటర్లు కాబట్టి, కానే్వను ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం లేదని అనుకుంటే పొరపాటే. ఇంతకంటే ఘనాపాటి పర్వతాలు ఉన్నాయి. ఠీవిగా, నిటారుగా నిలిచే కొండలు, పర్వతాలు కూడా ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. వాటితో పోలిస్తే సాదాసీదాగా కనిపించే బెన్ నెవిస్‌ను అధిరోహించడం సులభం కావచ్చు. కానీ, కానే్వ ఆ పర్వతాన్ని మామూలుగా ఎక్కలేదు. ఐదు అంగుళాల ఎత్తు ఉన్న హై హీల్స్ చెప్పులేసుకొని అధిరోహించాడు. ఇప్పుడు చెప్పండి.. ఇది ఘనకార్యమేనా? కాదా?

లేడీ బాహుబలి!
* బ్రిటన్ మార్షల్ ఆర్ట్స్ జూడోకాన్ లీసా డెన్నిస్‌ను లేడీ బాహుబలిగా చెప్పుకోవచ్చు. ఒక నిమిషంలో 923 పెంకులను పగలగొట్టి గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించడం ఆమె ప్రతిభకు తార్కాణం. ఒకదానిపై మరొకటిగా పేర్చిన పదేసి పెంకుల కుప్పలను ఆమె మెరుపు వేగంతో పగలగొట్టేసింది. ఒకసారి రెండు చేతులతో రెండు కుప్పలను బ్రేక్ చేయడంతో అరుదైన రికార్డు లీసా ఖాతాలో చేరింది.

స్పెషల్ ఫీట్
* జాంగ్ షువాంగ్ 50 మీటర్ల దూరాన్ని 26.09 సెకన్లలో పూర్తి చేసి, గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అంత సమయం ఇస్తే 50 మీటర్లేమిటి, 100 మీటర్ల దూరాన్ని కూడా పూర్తి చేయవచ్చని అనుకోవద్దు. ఎందుకంటే అతను కాళ్లతోకాదు.. చేతుల మీద నడుస్తూ ఈ ఫీట్‌ను సాధించాడు. ఆ సమయంలో అతను రెండు కాళ్లతో ఫుట్‌బాల్‌ను ఒడిసి పట్టుకొని, అది కిందపడకుండా జాగ్రత్త పడుతూ 50 మీటర్ల దూరానికి చేతులపై వెళ్లాడు కాబట్టే, అరుదైన రికార్డు నమోదైంది.

- సత్య