మిర్చిమసాలా

అమ్మో.. డ్రోన్ల నిఘా! (మిర్చి మసాలా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపిలో గత కృష్ణా పుష్కరాల సందర్భంగా శాంతిభద్రతల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలు తొలిసారిగా రంగప్రవేశం చేశాయి. ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను డ్రోన్‌లతో పర్యవేక్షిస్తుండగా, 3లక్షల గృహ ని ర్మాణం పనులపై కూడా డ్రోన్‌లతో నిఘా పెడతారట! అక్రమ భవన నిర్మాణాలకు ఆలవాలమైన విజయవాడలో ప్రస్తుతం డ్రోన్ల పర్యవేక్షణ హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ కట్టడాల విషయంలో కొందరు ప్రజాప్రతినిధులు, దళారులు మామూళ్లు దండుకుంటున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతివీధిలో నిఘా పెడతారట! దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
- నిమ్మరాజు చలపతిరావు
నిజాయితీని ఆదరిస్తారా?
రాజకీయాల్లో నిజాయితీ, నైతిక విలువలు నేతి బీరకాయ చందమే. నంద్యాల ఉపఎన్నికలో టిడిపి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరి, వైకాపా అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నారు. చాలామంది రాజకీయ నేతలు ఇపుడు పదవులకు రాజీనామా చేయకుండా ‘గోడ’ దూకుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ శాసనసభల్లో చాలామంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయకుండా అధికార పార్టీలో చేరడం, ఆ వ్యవహారమంతా ఇంకా కోర్టుల విచారణలో ఉన్న సంగతి విదితమే. ప్రజలు ఆదరించినా లేకపోయినా, ఓటింగ్ ఎలా ఉన్నా, అప్పుడప్పుడు రాజకీయాల్లో నిజాయితీ పాటిస్తే మంచి పేరు మాత్రం ఉండిపోతుంది.
- శైలేంద్ర
పూరీ ‘డ్రగ్స్ ప్యాకేజీ’!
డ్రగ్స్ కేసులో ఎక్సైజు ఎన్‌ఫోర్స్‌మెం ట్ శాఖ నుంచి నోటీసులు అందుకున్న వా రిలో చాలామంది సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ యూ నిట్‌కు చెందిన వ్య క్తులే. వీరికి డ్రగ్స్ సప్లయర్ కెల్విన్‌తో సం బంధం ఉన్నట్టు ఎక్సై జు శాఖ కాల్ డాటా బయటపెట్టిం ది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమాల్లో పని చేసే వారికి రెమ్యునరేషన్‌తో పాటు డ్రగ్స్‌ను ‘ప్యాకేజి’గా పెట్టారెమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణలో వరినాట్లు, కోతలు, కలుపుతీత పనుల్లో పాల్గొనే వ్యవసాయ కూలీలకు డబ్బుతో పాటు కల్లు సీసాలు ఇవ్వడం అనవాయితీ. ఇదే విధానాన్ని పూరీ తన యూనిట్‌లోని ఆర్టిస్టులు, టెక్నిషియన్లకు అమలు చేసి డ్రగ్స్ కూడా ఇచ్చారట!
- వెల్జాల చంద్రశేఖర్
బాబు వలలో పవన్
భయంకరమైన విలన్ చిన్న పురుగును చూసి భయపడిన సన్నివేశం ‘క్షణ క్షణం’ సినిమాలో అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఎంతటి నరరూప రాక్షసుడికైనా ఏ దో ఒక భీతి ఉం టుంది. శ్రీకాకుళం జి ల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకుందామని వెళ్లిన జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌కు పదవితో చం ద్రబాబు నోరుకుట్టేశా రు. తనతో వాదులాడే సమయం వచ్చేసరికి -‘మీరు బాగా పనిచేస్తున్నారు. జీవన్‌దాన్ అం బాసిడర్ మీరే... మరింత కృషి చేయండి... ప్రభుత్వం మీతో ఉం టుంది...చైతన్య పరిచే బాధ్యత మీదే’ అని అనేసరికి పవన్‌కల్యాణ్‌కు మాట పెగల్లేదు. చంద్రబాబు మాటకు జవదాటలేకపోయారు. ఎవరి బలహీనతను ఎవరు సొమ్ముచేసుకున్నారు.. చూద్దాం కాలమే చెబుతుంది...
- బివి ప్రసాద్