జాతీయ వార్తలు

తెలుగు తేజానికి పెద్దరికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశ 15వ ఉప రాష్టప్రతిగా తెలుగు తేజం వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. అందరూ ఊహించినట్టే బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం భారీ మెజారిటీతో ఉప రాష్టప్రతి పదవికి ఎన్నికయ్యారు. గాంధీ మనుమడు, విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ శంషేర్ షరీఫ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే వెంకయ్య విజయం సాధించినట్టు ప్రకటించారు. అనంతరం ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్టప్రతి పదవికి ఎన్నికైనట్టు ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. వెంకయ్య ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెంకయ్య ఎన్నికైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 30, అబ్దుల్ కలాం రోడ్డులోని వెంకయ్య నివాసానికి వచ్చి ఉప రాష్టప్రతి పదవికి ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సహా పలువురు కేంద్ర మంత్రులు కొత్త ఉప రాష్టప్రతిని అభినందించారు. వెంకయ్య తన సమీప ప్రతిపక్షం అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని 272 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. ఉభయ సభల్లో మొత్తం 785 మంది ఎంపీలకు 771 మంది అంటే 98.4 శాతం ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలైన 771 ఓట్లలో వివిధ కారణాల మూలంగా 11 ఓట్లు చెల్లకుండా పోయాయి. పోలైన ఓట్లలో వెంకయ్యకు 516 లభిస్తే, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు పోలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన మొత్తం 14మంది వివిధ కారణాల మూలంగా ఓటు వేయలేకపోయారు. ప్రతిపక్షానికి చెందిన దాదాపు 30మంది ఎంపీలు వెంకయ్యకు అనుకూలంగా ఓటు వేసినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ సహా ఎన్‌సిపి, జెడి(యు), బిజెడి తదితర పార్టీల ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్టు అంచనా వేస్తున్నారు. బిజెపికి చెందిన కేంద్ర మంత్రి విజయ్‌గోయల్, సవర్‌లాల్ జాట్, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు, ముస్లిం లీగ్‌కు చెందిన ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, ఎన్సీపీకి చెందిన ఒకరు, పిఎంకె నాయకుడు అన్బుమణి రాందాస్, ఇద్దరు స్వతంత్రులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. క్రీడల మంత్రి విజయ్ గోయల్ అనారోగ్యం కారణంగా ఓటు వేయలేకపోయారు. ఇండియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు సాయంత్రం ఐదు గంటలు దాటిన తరువాత పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కాలాతీతం కారణంగా ఓటు వేసేందుకు వారిని అనుమతించలేదు. ఉప రాష్టప్రతిని ఎన్నుకునేందుకు ఓటింగ్ శనివారం ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో వెంకయ్య ఘన విజయం సాధించారు. ఉప రాష్టప్రతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు ఆవరణలోని 62 నంబర్ గదిలో పోలింగ్ ప్రారంభంకాగానే మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి మాదిరిగానే మొదటి ఓటు వేశారు. రాష్టప్రతి ఎన్నికలోనూ ఆయన మొదటి ఓటు వేయటం తెలిసిందే. నరేంద్ర మోదీ ఓటు వేసిన అనంతరం ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆధిత్యనాథ్ ఓటు వేయటం గమనార్హం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాజ్యసభలో పార్టీ విప్ ఎంఏ ఖాన్‌తో వచ్చి ఓటు వేశారు. తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర కాంగ్రెస్ నేతలు ఓట్లు వేశారు. బిజెపి ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నామినేటెడ్ సభ్యులు, ప్రముఖ సినీనటి రేఖ, ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఓటింగ్‌కు రావడం అందరినీ ఆకర్షించింది. రేఖ ఎప్పటి మాదిరిగానే చీరలో హుందాగా కనిపించారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు అనారోగ్యంతో బాధ పడుతున్నా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకోవటం గమనార్హం. ఇదిలావుంటే మెజారిటీ ఎంపీలు ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దాదాపు 90 శాతం ఓట్లు పోలయ్యయి. ఉప రాష్టప్రతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారనేది అందరికీ తెలిసిందే. 18 ప్రతిపక్ష పార్టీలతోపాటు ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజెడి, బిహార్ సిఎం నితీష్‌కుమార్ నేతృత్వంలోని జెడి(యు) ఎంపీలు గోపాలకృష్ణ గాంధీకి ఓటు వేశారు. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు అన్నాడిఎంకె, వైకాపా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని బలపర్చటం తెలిసిందే.