జాతీయ వార్తలు

ట్రాక్టర్ల స్పేర్స్‌పై జిఎస్టీ తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కొన్ని రకాల ట్రాక్టర్ విడిభాగాలపై పన్ను రేటును 28 శాతంనుంచి 18 శాతానికి గత్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ శనివారం నిర్ణయం తీసుకుంది. అలాగే టెక్స్‌టైల్‌కు సంబంధించిన అన్ని రకాల జాబ్ వర్క్‌లపై పన్నును కూడా 18 శాతంనుంచి 5 శాతానికి తగ్గించింది. అదే విధంగా 20 అంగుళాల దాకాస్క్రీన్ ఉండే కంప్యూటర్ మానిటర్లపై పన్నును సైతం 18శాతంనుంచి 12 శాతానికి తగ్గించింది. మట్టితో తయారు చేసే విగ్రహాలపై పన్నును సైతం 28 శాతంనుంచి 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చీపుళ్లపై గతంలో నిర్ణయించిన 5 శాతం పన్నును పూర్తిగా రద్దు చేశారు. అలాగే అగర్‌బత్తీలు, చీర ఫాల్స్‌పై పన్నును సైతం 12 శాతంనుంచి 5 శాతానికి తగ్గించినట్లు సమావేశంలో పాల్గొన్న బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కూడా అయిన సుశీల్ మోదీ తెలిపారు. అలాగే జిఎస్‌టి అమలును పర్యవేక్షించడం కోసం, అక్రమాలను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా కౌన్సిల్ సమావేశంలోనిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జిఎస్‌టి కౌన్సిల్ శనివారం ఇక్కడ సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
50 వేల రూపాయలకు పైబడిన విలువ కలిగిన అమ్మకం కోసం పది కిలోమీటర్లకు మించి తరలించాల్సిన అన్ని సరకులకు ఇ-వే బిల్లును తప్పనిసరి చేయాలని జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయించింది.
ఇ-వే బిల్లు అమలు తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అరుణ్ జైట్లీ చెప్పారు. కాగా,అక్టోబర్ 1నుంచి ఈ వే బిల్లు విధానం అమలులోకి తేవాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మినహాయించిన సరకులకు ఇది వర్తించదు. ఇలా జారీ చేసే బిల్లులు వంద కిలోమీటర్ల దూరం సరకు తరలింపు కోసం ఒక రోజుకు వర్తిస్తాయి. తదుపరి రోజులకు అదే దామాషా వర్తిస్తుంది. కాగా, నిర్మాణ రంగానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్‌లపై పన్నును 18 శాతంనుంచి 12 శాతానికి తగ్గించినట్లు ఆయన చెప్పారు.
కాగా, ఇప్పటివరకు 71 లక్షలకు పైగా కేంద్ర, రాష్ట్ర పన్ను చెల్లింపుదారులు వస్తు సేవల పన్నుకు మారారని, రిజిస్ట్రేషన్‌ను కూడా పూర్తి చేసుకున్నారని జైట్లీ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మరో 15.67 లక్షళ దరఖాస్తులు అందాయని ఆయన చెప్పారు. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కింద తగ్గిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని జైట్లీ వ్యాపారవర్గాలకు విజ్ఞప్తి చేశారు. అలా చేయని పక్షంలో లాభాల పేరుతో దోచుకోవడాన్ని అరికట్టడం కోసం తీసుకు వచ్చిన ఈ విధానం నీరుగారిపోతుందని ఆయన చెప్పారు. కాగా, జిఎస్‌టి కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరుగుతుందని జైట్లీ తెలిపారు. జిఎస్టీ కింద పన్ను చర్యలను తప్పించుకోవడం కోసం అధిక శాతం రైసు మిల్లర్లు తమ బ్రాండ్లను డీ రిజిస్ట్రేషన్ చేస్తున్న అంశాన్ని ఈ సమావేశంలో చర్చకు చేపడతారు.
చిత్రం.. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ