స్వీటీకి భారీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో అందాల భామ అనుష్కకు స్టార్ క్రేజ్ ఉంది. గ్లామర్ హీరోయిన్‌గా ఓవైపు అందాలు ఆరబోస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతో సత్తా చూపుతోంది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క, ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహోలో నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సాహోలో తాను నటించడం లేదంటూ అనుష్క స్పష్టం చేసింది. అందుకు కారణం -అంతకుముందే ఒప్పుకున్న రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు అనుష్క రంగం సిద్ధం చేసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించే ఉయ్యాలవాడ చిత్రంలో అనుష్క నటిస్తుందంటూ వార్తలు రావడం తెలిసిందే. దాంతోపాటు మరో సినిమాలో ఐటమ్‌సాంగ్ చేస్తుందంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని, ఈపాట కోసం స్వీటీకి భారీ రెమ్యూనరేషనే అందబోతోందని తెలుస్తోంది. బాహుబలితో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేసింది కనుక, అనుష్కను సాంగ్‌కు తీసుకున్నా, సినిమాకు తీసుకున్నా భారీగా చెల్లించుకోక తప్పదని అంటున్నారు. అయితే అనుష్క చేయబోయే ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికావాల్సి ఉంది.