సాహితి

మారిన కళ్లు - కొత్త వెలుగులు (శ్రీవిరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వివాహం అనేది వ్యక్తిగత సమస్య. ఒక సందిగ్ధం వచ్చినపుడు పరిస్థితులన్నీ సమీకరించుకుని ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలిగాని- ‘తాము ఏమి చేయాలో నిర్ణయించమని ఇతరులను కోరకూడదు’- ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు- అదీ తాను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వదిలిన ప్రేమికురాలు నోటిమీదుగా; ‘కన్నుల వెలుగు’ అనే సుసంపన్నమయిన కథానికలో. ఈ కథానిక రచయిత ఆర్.యస్.సుదర్శన్.
ప్రస్తుతం పరిశీలిస్తున్న కథలో ఒక దంపతులు ముందుగా దర్శనం ఇస్తారు. ఇద్దరికీ పరస్పర ప్రేమాభిమానాలు వున్నట్లుగానే కనిపిస్తున్నా అవి రెండోవారికి అంతగా ప్రదర్శితం కావు. భర్త అనుకున్నదానికంతటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది, వ్యవహరిస్తుంది అతని భార్య. దీపావళికోసం ప్రత్యేకంగా కొనుక్కున్న చీర కట్టుకుని భర్తను మురిపింపకపోగా, అది తన సెలెక్షన్ కాదని తనకు ఎంతమాత్రం నచ్చలేదనీ భర్తకు ముఖంమీదనే చెప్పుతుంది.
ఇపుడు ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయకుమార్ పూర్వం కాలేజీలో లెక్చరర్‌గా వుండేవాడు. ఆ రోజులలో తన శిష్యురాలు అయిన ప్రేమలత అనే అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానయితే ఆ పిల్ల ‘కులం వేరు కావడంతో అతని తండ్రీ అన్నలూ మేనమామలు ఎవరూ అంగీకరించలేదు’. దానితో విరక్తి పొందిన విజయకుమార్ చాలకాలంవరకూ తనకు పెళ్ళే అవసరం లేదని కొన్ని సంవత్సరాలు తాత్సారం చేయగలిగాడు. కాని తల్లి బలవంతంమీద వివాహం చేసుకోక తప్పలేదు. పెళ్లికూతురును వెదికి నిర్ణయించే బాధ్యత కూడా తల్లే తీసుకుంది. భార్య అంటే ఎలా వుండాలో అతనికి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు వున్నాయి. ‘్భర్త మనస్సుకు నిలువుటద్దంలా వుండాలి! భర్త ఊహించే కల్పనకు గోపురాలు కల్పిస్తూ వుండాలి. అలా కాకపోతే కనీసం చూచి ఆనందించే గుణం అయినా ఆమెలో వుండాలి. అవి కూలదోస్తుంటే ఏం చేస్తాడు భర్త? పోనీ తనే ఏదైనా కల్పించి, తన వూహలో భర్తను కలుపుకోవటమే ఆమె వ్యక్తిత్వమా, విశిష్టతా అంటే ధర్మవేణి విషయంలో అదీ నిజం కాదు. నంది అంటే పంది అనడమే ఏకైకక లక్ష్యంగా వుండే వ్యక్తినేం చేసుకోవాలి? ఇదీ అతని వ్యధ.
దీపావళి రాత్రి ధర్మవేణి బాణసంచా కాలుస్తూ ముఖం - ముఖ్యంగా కళ్ళు నిప్పులపాలు చేసుకుంది. కుమార్ ఆమెను ఆసుపత్రికి తీసుకువెడితే- అక్కడ గాయాలు శుభ్రం చేసి చికిత్స చేస్తున్నది డాక్టర్ ప్రేమలత, ఇదివరకు తాను ప్రేమించిన స్టూడెంటే. ఆమె డాక్టరయింది, అమెరికా వెళ్లింది, అక్కడ నైపుణ్యం సంపాదించి కళ్ల వైద్యురాలుగా మళ్లీ ఇక్కడకు వచ్చేసింది. ఎనిమిదేళ్ల విరామంలో జీవితం అంతా మారిపోయినట్లుగా గమనిస్తాడు కుమార్. అతను ప్రేమలతను చూడగానే గుర్తుపట్టాడు కాని, ఆమె గుర్తుపట్టినా వెంటనే బయటపడకుండా చికిత్స చేయడంలోనే నిమగ్నురాలయింది. ప్రాథమిక చికిత్సతో ధర్మవేణికి కంటిచూపు రాలేదు. ఆమెకు మరింకో ఆపరేషన్ జరిపి, కార్నియా మార్చవలసిన సందర్భం సూచితం అవుతుంది. డాక్టర్ ప్రేమలతే రుూ ఆపరేషన్ విశాఖపట్నంలో డాక్టర్ పరమేశ్వరరావుగారి చేత చేయించమని తగు సలహా ఇస్తుంది. ఈ విరామంలో డాక్టర్ ప్రేమలతను ఇంటివద్ద కలుసుకోవడం, వెనుకటి పరిచయాన్ని తిరగతోడడం చేయగలుగుతాడు విజయకుమార్. ఆమెను వివాహం చేసుకుంటానని కూడా మళ్లీ ప్రతిపాదన చేస్తాడు- హిందూ ధర్మశాస్త్రాలు- లా సూత్రాల ప్రకారం అది అసాధ్యం అని ఇద్దరికీ తెలిసినా. ప్రేమలత అతనికి ఈ సందర్భంలో ఎంతో సంయమనంతో సమాధానపరుస్తుంది.
‘నువ్వు నాదానివి కాదా?’ అని సూటిగా అడుగుతాడు. అప్పుడు ఆమె ‘అవునూ - కాదూ. నేను మీదానే్న అనుకో? ఇప్పుడు లాభమేమిటి? నాకు ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే- మీకు ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా జీవితాన్ని అర్థం చేసుకోకుండా అమాయకంగా ఎలా వుండిపోయారా అని! ఇరవై ఏళ్ల వయసులో మాట్లాడిన మాటలే, ముప్ఫై వచ్చినా ఎలా మాట్లాడుతున్నారు?’ అంటుంది. అతను సంఘానికి లొంగిపోయి, అప్పటి రోజులలో తనను వివాహం చేసుకోకపోవడం మటుకే కాకుండా, ఆమే సంఘానికి లొంగి తన నుంచి దూరం అయిపోయిందని ఆరోపణ చేయడంలో వున్న బేసబబు అతనికి అర్థం అయ్యేట్టు చేస్తుంది.
విశాఖపట్నంలో రెండో ఆపరేషన్ ప్రేమలత చేతులమీదుగానే జరిగిపోతుంది. ఆమె మంచితనాన్ని ముద్దుపెట్టుకుంటానని ప్రాధేయపడి, వియకుమార్ ఆమె పెదవులనే ఏకంగా ముద్దుపెట్టుకుంటాడు. ‘ఆమె అతణ్ణి దూరంగా తోసివేసింది’ అనడంలో రచయిత అమలిన శృంగార రసం చూపుతాడు. ప్రేమంటే ఏమిటో అనికి హృదయగతంగా అర్థం అయ్యేట్లు చేయడమే గాక, ధర్మవేణిలో కూడా అతని పట్ల ‘ప్రేమోదయం’ అయ్యేట్లు ప్రసంగిస్తుంది ప్రేమలత. ‘మనుషులు ఎంత దూరంలో ఉన్నా మనసులకు దూరమంటూ లేదు’ అని ప్రేమసూత్రం ప్రవచిస్తుంది.
ధర్మవేణికి కొత్త కళ్లతోపాటు కొత్త ప్రేమ వెలుగులు వికాసాలు సమకూరుస్తుంది ప్రేమలత. ఆమెను చూడగలగటానికి అయినా తనకు దృష్టి రావాలని కోరుకుంటుంది ఆమె. ‘ఈ ప్రపంచమంతా నాదేనని ఆడుతూ పాడుతూ గడిపాను. నాలోని ప్రత్యేకతని చూపుకోవటానికి మీరు అవునన్నది కాదని ఎన్నోమార్లు మీకు కోపం తెప్పించాను. కాని మీరు లేకపోతే జీవితం లేదని చెప్పటానికే భగవంతుడు నాకీ శిక్ష వేశాడనిపిస్తుంది.. ఇప్పుడు మీరు నా కన్నులకు వెలుగు కదా జీవితాంతమూ’ అంటుంది ఆమె ఆపరేషన్ ముందు రోజు.
ఆపరేషన్ అయిన తర్వాత ఆమెకు ‘ప్రపంచం మళ్లీ కొత్తగా దృశ్యం అయింది. కొత్త రూపుతో ప్రేమను గుర్తించింది ఆమె!’
భార్యాభర్తల మధ్య వుండవలసిన సంబంధం మటుకే కాక, జీవిత రహస్యాలను బయలుపరచే రుూ కథానిక, ఆత్మాశ్రయాన్ని ఆదర్శ పథాన్ని నూతన రీతిలో ప్రదర్శిస్తుంది.

- శ్రీవిరించి, 9444963584