సాహితి

పాఠకుల్లారా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వరకూ చేరాలని
అక్షర ప్రయాణం చేస్తుంటాను

పేజీల తరువాత పేజీలు
రాస్తూ, కొట్టివేస్తూ
మళ్లీ రాస్తూ, చించేస్తూ
నన్ను మీరు చించేయరన్న ఆశతోనే

ఒక్కోమారు మిమ్మల్ని రాస్తూ
నన్ను నేను రాసుకుంటున్నాను
నన్ను నేను రాసుకుంటూ
మిమ్మల్నీ రాస్తున్నాను

నన్ను నేను చెప్పుకుంటూ పోతున్నా
మిమ్మల్ని చదవాలన్న ప్రయత్నమే ఎప్పుడూ

నాలో నేను దాక్కోవాలనుకున్నా
అక్షరాలుగా బయటపడుతుంటాను

మీ దృష్టిలో పడాలని
ఎన్నాళ్లైనా ఎనె్నన్ని చోట్లయినా
అక్షరాలు అక్షరాలుగానే పడుంటాను

- ముకుంద రామారావు