దక్షిన తెలంగాణ

గమనం ఏవైపు? (సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయిని రోహిణి జగిత్యాలకు చెందిన వర్ధమాన కవయిత్రి! తన తొలి కవితా సంపుటిగా ‘గమనం ఏ వైపు?’ ప్రకటించారు. జీవన సత్యాలను ప్రతిబింభిస్తూ ఆమె రాసిన ఇందలి కవితలు ఆమె ఉత్తమ వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయి! కవిత్వాంశ పెద్దగా లేక పోయినప్పటికీ..ఆమె లోక పరిశీలనను, సామాజిక దృక్పథాన్ని అభినందించి తీరుతాం..108 మినీ కవితలతో ముస్తాబై వచ్చిన ఈ గ్రంథంలో ‘అతడు’ ‘ఆమె’ శీర్షికలతో ప్రకటించిన భావాలు రమణీయంగా వున్నాయి! ‘అతడు’ ‘ఆమె’ శీర్షికలతో 85వ కవిత నుండి 108 వరకు సాగే కవితల్లో కవయిత్రి వెలుబుచ్చిన ఆలోచనలు జీవన సత్యాలను మోసుకొచ్చాయి.
‘నీ వినయం అభినయం..వీక్షించెను నా నయనం..
నాలో మొదలాయెను ప్రణయం..
నీ కాలి వేలిని తాకిన సమయం..
నీ మదిలో నే రేపిన తీయని గాయం
నా మదిలో రేపెను తెలియని బిడియం
అని ‘అతడు’ అంటే..
అంతరంగంలో నేనున్నాని నీవిచ్చిన అభయం ఆనందంతో ఉప్పొంగిన నా హృదయం..ఆనందంతోనే మరిచెను సమయం. నిను చేరాలనే నా ధ్యేయం.. మురిపించెను ఉదయం.. సాయం సమయం నీ ప్రేమ రమణీయం, కమనీయం, అనిర్వచనీయం అని ‘ఆమె’ సమాధానం చెప్పడం వంటి పంక్తులు కవయిత్రి యొక్క రచనా వైచిత్రిని తెలిపేలా వున్నాయి.
అంతేగాక ప్రేయసీ ప్రియుల అంతరంగాలను అందంగా ఆవిష్కరించడానికి అతడు-ఆమె కవితలు రాయడం అభినందనీయం! ఇంకా ఈ గ్రంథంలో ఇవేకాక.. చల్లని నీరు, అంతా మిథ్య, ఆభరణం, స్వప్నం శీర్షికలతో రాసిన కవితల్లో కవయిత్రి తమ భావుకతను ప్రదర్శించారు. ‘్భయం లేదు’ శీర్షికతో రాసిన కవితలో ‘మేఘం’ - ‘మనిషి’ మధ్య సంభాషణను పొందుపరిచారు.
ముక్తికోసం..గెలుపు, మరువకుమా, అంతా జయమే, పేర్లతో రాసిన కవితలు సూక్తులు, హితోక్తులుగా రూపుదిద్దుకున్నప్పటికీ కవయిత్రి యొక్క సామాజిక చింతన కానవస్తోంది. ‘స్ర్తి వేదన’ కవితలో స్ర్తిని ఉన్నతంగా చిత్రించారు. సాదా సీదా అంశాలను కవత్వీకరించడానికి కవయిత్రి ప్రయత్నించడం ప్రశంసనీయం. కవిత్వం రాయడంలో ఆమె ఇంకా మెలకువల తెలుసుకోవాలి. గాఢమైన కవిత్వాన్ని పండించడానికి అధ్యయనంపై దృష్టి సారించాలి. ఈ దిశలో ఆమె ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
పేజీలు: 72, వెల : 70/-
ప్రతులకు:
బోయిని భూషణ్
6-3-263
పోచమ్మవాడ, జగిత్యాల
సెల్.నం.9652711879

- సాన్వి, సెల్.నం.9440525544