ఉత్తర తెలంగాణ

జీవితానుభవాల సమాహారం సూక్తి పద్యాలు (సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ జీవిత అనుభవాలను ఏర్చి, కూర్చి

సూక్తి సుమాల సమాహారంగా మలిచి..కవి

శతకశ్రీ అమ్మన చంద్రారెడ్డి గారు ‘సూక్తి

పద్యాలు’ పేరుతో పద్య కావ్యాన్ని

వెలువరించారు. సామాజిక చైతన్యమే

ధ్యేయంగా, సమాజంలోని రుగ్మతలను

రూపుమాపేందుకు కవి ప్రయత్నం చేశారు.

ఇందలి 101 పద్యాల్లో వివిధ అంశాలను ఒకటి

దానికి మరోకటి సంబంధం లేకుండా చక్కగా

ఆవిష్కరించారు. సమాజంలోని అక్రమాలపై

కవి తమ అక్షరాయుధాన్ని

ప్రయోగించేందుకు పద్య ప్రక్రియను

ఎంచుకోవడం అభినందనీయం! సమాజ

ఉద్ధరణే పరమావధిగా సాగిన ఇందలి రచన

కవియొక్క సామాజిక చింతన

ప్రతిబింబించేలా వుంది. తేటగీతిలో

రాయబడిన ఇందలి పద్యాల్లో కవి యొక్క

ఉత్తమ వ్యక్తిత్వం, లోక పరిశీలన

కానవస్తోంది.
పలుకు పలుకున సుధా

దారలొలికిస్తూ..ఇతరులకు సహాయం

అందించేందుకు ముందుకు రావాలని కవి

తమ పద్యాల ద్వారా పిలుపునిచ్చారు.

సోమరితనం దరి చేరనీయక.. శీల సంపద,

శౌర్యం ఆభరణాలుగా మలచుకుని జీవనం

కొనసాగించాలని హితవు పలికారు. జనుల

మధ్య మాట్లాడేటప్పుడు నాలుకను

అదుపులో పెట్టుకోవాలని, సదా మనసులో

శాంతినే గోరుతూ మసలుకోవాలని కోరారు.

పండితుల సహచర్యంతో.. విద్యత్తును

సమకూర్చుకోవాలని, సజ్జనుల చెంత

కూర్చొని సద్గుణాలు అలవర్చుకోవాలని కవి

తమ పద్యాల ద్వారా సూచించారు. శ్రమను

నమ్మి జీవించే శ్రామికుడు నెచట

వున్నప్పటికీ బ్రతుకును ఇంపుగా

కొనసాగించగలడని ఇంకో పద్యంలో తేల్చి

చెప్పారు. గతం నుండే మనం పాఠాలు

నేర్వాలని చెబుతూ.. గతము నుండియే

నేర్వుము హితమునంత.. భవితయంతయు

నిర్మింప ప్రతిభతోడ.. యూహా లోకమున్

విహరింపనోర్మిలేక..మంచి గాదెపుడు నరయ

మహిని నిజము! అంటూ ఓ పద్యం రాశారు..
నిత్య సాధనతో నైపుణ్యం సాధించాలని,

మితమైన ఆహారం మనకు హితమని,

చిరునవ్వే మన మోముకు సుందర

ఆభరణమని, అహంకారమసలే దరి

చేరనీయరాదని, శాంత స్వభావంతో

ముందుకు సాగి అందరికి చేరువవ్వాలని

వివిధ పద్యాల ద్వారా ప్రబోధించిన కవి

చంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు

తెలుపుదాం.. అయితే ఈ గ్రంథానికి

నిర్ణయించిన వెల కొంచెం ఎక్కువేనిన

పాఠకులు భావించే అవకాశముంది

పేజీలు: 28, వెల: 50/-
ప్రతులకు: అమ్మన చంద్రారెడ్డి
17-1 86/3బి
సాయిప్రియ రెసిడెన్సీ
శివాజీనగర్, సిద్ధిపేట
సెల్.నం.9948936083.

- సాన్వి, సెల్.నం.9440525544