రాజమండ్రి

వారాంగన వేదన (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెలతల ‘మూల్గుల ఉఱుములు’
చెలగెడి ‘నిట్టూర్పు పిడుగు’, చెలువల

మనమున
‘కలచుచు కాల్చెడి కాలము’
వెలయును వెలయాండ్ర ఘోర

వేశ్యమునందున!

అలజడులందడి వలచట
విలవిలలాడెడి తఱి విలపించెడి కన్నుల్
నల్లనల్లని కంధరముల
వలె తోచుచు కురియజేయువంతల వానల్!

తమదగు భయకంపనమున
తమ తాపాగ్నులయందున, తమ

శోకములో
ప్రమదలు చలి, యెండ, వాన
లమరెడి కాలములు కనెదరను

దినమచటన!

చివికిన చినుగుల వలువలు
చవిలేని చలిది అశనము, చాలని నీళ్లున
పవళింప కుక్కి మంచము
నవలల దుస్థితిని తెలుపు నలుగురికచటన!
పగిలిన సూడిగ తునుకల
నగుపించు వగచు వనిత ముఖాకృత

శతముల్!
పొగలెడి పొలతుల ఏడ్పుల
నెగమును యెదలివియజేయు ఎద్దడులెల్లన!

ఒకనాడొక నరకాసురు
డొక దినమొక కీచకుడును, నొక

రావణుడున
ప్రకటితమై ఒక పడతిని
వికటముగా చెఱచి కడకు పీన్గుగ మార్చున్!

తనివి తనువుకేగానీ
మనసుకునట విలువలేదు! మానిని

యెదలో
ధ్వనియించెడి ఆర్తరవము
వినువారలు కంటబడరు వేశమునందున!

రేపటి చింతన శూన్యము!
మాపటి భుక్తిని బడసెడి మార్గము కొఱకే
‘రూపాజీవ’ తపించును!
ఆ పడతికి భవితపైన ఆశలు చచ్చున్!

పోకిరి కోర్కెల ఆకలి
సోకిన విటగణము చెలగి సురతము కోరన
ఆకలి మంటల దూకలి
పోకార్చగ మగువ వారి పొంతన చేరున!

అవసరములు అబలలవయి
అవకాశము మిండగాండ్ల దగునచ్చోటన
యువతి, అశక్తిని పురుషులు
అవలీలగ వాడుకొనెద రానందముకై!
- ఎరుకలపూడి గోపీనాథరావు
కోటిపల్లి, గంగవరం మండలం
తూ.గో.జిల్లా
సెల్: 9848293119

మృత్యుపరిష్వంగం
మైకం
పొరలు క్రమ్ముతుంటే
దేహం
గాల్లో తేలుతుంటే
ఊహల్లో దోబూచులాడే
స్వర్గం చేతికందుతుంది
ఆ మత్తు కోసం
వెతుకులాట
దేవులాట
మత్తే సర్వం మత్తే లోకం
కొకైనో బ్రౌనుసుగరో
గంజాయో ఏదైతేనేం
ఒక మాత్ర
వైకుంఠయాత్ర
నడిచే బొమ్మలేకాదు
తెరపై బొమ్మలు కూడా
ఆ మత్తు వైపుకే
ఆ నిషా ప్రపంచంలోకే
మత్తులో
జాతి నిర్వీర్యమైపోతుంటే
ఆ మత్తులో
జీవితాలు కొట్టుకుపోతుంటే
కష్టార్జితం తుడిచి పెట్టుకుపోతుంటే
మత్తు నవ్వుతోంది
మత్తుమత్తుగా
మత్తు తూగుతోంది
చిత్తుచిత్తుగా
మత్తుపోవాలి
వివేకం మొలకెత్తాలి
మత్తుజీవులారా
మేలుకోండి
మత్తు బానిసత్వం నుండి
మృత్యుపరిష్వంగం నుండి
- మంకు శ్రీను, కొప్పర్రు, ప.గో.జిల్లా, సెల్:

8985990215

అలంకారం
కొండల గుండెలపై
పడుతున్న వాన
నిరుపేద నిబ్బరాన్ని
నిలదీస్తున్నట్టుంది
మబ్బులతో ముసురు పట్టిన ఆకాశం
పెద్దదిక్కును కోల్పోయిన
ఇల్లులా ఉంది
ఒడ్డును ఒరిసి పారుతున్న వాగు
కపట ప్రేమకు మోసపోయిన
కలకంఠి కన్నీటిలా ఉంది
పెనుగాలికి జడలు విప్పిన
మర్రిచెట్టు
దిక్కు లేని వృద్ధురాలి
గోడులా ఉంది
భారీ వర్షానికి తడిసి పాడైన తోట
విభేదాలతో కొట్టుకుంటున్న
వీధిలా ఉంది
మనోహరమైన పోలికకు
ఉపమానం ఒక అలంకారం
అందులో ఉంది జీవితం
జీవితమంటే మనోహరమే కాదు
మనసును మెలిపెట్టే
బాధల సమాహారం కూడా
అద్భుతమైన ప్రకృతికి
ఆనందించడమే కాదు
సాటివారి బాధలో
సానుభూతి చూపేందుకు
ఉపమానం ఉపయోగం
నిండయిన మనసుకు
అదే నిజమైన అలంకారం
- శివలెంక ప్రసాదరావు, సెల్ : 9492 740147

రక్షాబంధనం
పెనవేసిన పేగు బంధములో
విడదీయరాని రక్తసంబంధములో
ఒకే కొమ్మ రెమ్మలం
ఒకే రెమ్మ పువ్వులం
పువ్వుల పొదలో ఒదిగిన గువ్వలం
గలగల ఎగిరే అల్లరి మువ్వలం
మువ్వల సవ్వడిలో
అడుగుల నడకలం
నడకల పయనంలో
కష్టసుఖాల కన్నీటి చుక్కలం
జాలువారే కన్నీటి చుక్కలలో
ఆనంద బాష్పాలం
ఆనంద బాష్పాల ఆప్యాయతలో
చిరునవ్వులం
చిరునవ్వుల చెలిమికి
చిరకాలం స్నేహితులం
కలిమిలేముల కష్టసుఖాలకు
కలకాలం వారసులం
కలకాలం నిలవాలి
అన్నాచెల్లెళ్ల అనురాగం
అమ్మ మనస్సులాగా సాగాలీ
అక్కాతమ్ముళ్ల మమకారం
అందుకు సాక్షిగా అందిన ఫలం
ఇద్దరి మధ్యన అనుబంధం
మణికట్టున వెలసిన
ఈ రక్షాబంధనం
- హస్తి మోహన్‌రాజు
చరవాణి : 8008511316

మెదడే ఓ కార్ఖానా
మానవ మెదడే ఓ కార్ఖానా
విద్యకి ఆలోచనలు
వ్యాపారానికి తెలివితేటలు
వృత్తికి మెళకువలు
సాహిత్యానికి ఊహలు
సంగీతానికి స్వరాలు
చిత్రలేఖనానికి నైపుణ్యం
నటనకు మెరుగులు
నాట్యానికి లయలు
న్యాయవాదులకి నేర్పరితనం
డాక్టర్లకి దైవత్వం
నేతలకి వాగ్దానాలు
యువతకి మేధస్సు
స్ర్తిలకి కళలు
రైతన్నకి శక్తియుక్తులు
ఉపాధ్యాయులకి ఓర్పు
- జిఎస్‌కె సాయిబాబా,
సెల్ : 92481 73116.