విజయవాడ

మిత్రుడిగా సలహా..! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వుందిరా’ అన్నాడు పరాశర్.
‘నీదగ్గరున్న మూడు గ్యాస్ సిలెండర్లలో ఒక్కటి ఒక్కవారం అడ్డం వేసుకుంటా ఇమ్మంటే పక్కవాడికి కూడా ఇవ్వవు. ఆడపిల్లకు ఆస్తి హక్కు అంటూ బావమరిది మీద దావా వేసి అరకోటి ఆస్తి నొక్కేశావు. అయినా బ్రాహ్మడు ఎన్నికల్లో నిలబడి నెగ్గలేడురా!’ అన్నాడు శర్మ.
‘మన భరద్వాజ్ గారు నెగ్గలేదా?’ ఉడుక్కున్నాడు పరాశర్.
‘ఏ పార్టీనూ నీకు టిక్కెట్ ఇవ్వదు. కొనాలంటే కొత్త పార్టీ వారు ఇరవై లక్షలకు అమ్ముకున్నట్లు చెప్పుకుంటున్నారు’ చెప్పాడు శర్మ.
‘మరి పాత పార్టీ?’ అడిగాడు పరాశర్.
‘సీనియర్లు అందరుండగా నీకు టిక్కెట్ ఇవ్వటం కుదరదు. డాక్టర్ భరద్వాజ్ గారు పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించారు. అందుకే అతని వ్యక్తిగత విషయాల గురించి జనాలు పట్టించుకోలేదు’ వివరించాడు శర్మ.
‘ఏం ఘనకార్యాలు చేశాడేమిటి?’ ఉడుక్కున్నాడు పరాశర్.
‘్భపతి గారికి ఫ్యామిలీ డాక్టర్‌గా వుండి ఆయనను పైకి పంపాడు. వాళ్లావిడతో సహా ఆస్తి రాయించుకొని కల్యాణ చక్రవర్తి థియేటర్ అంత హాస్పిటల్ కట్టాడు. అందులోనే ఆవిడను పేషెంట్‌గా చేర్చి దున్నల్లాంటి ఇద్దరు కాంపౌండర్లను కాపలాగా పెట్టాడు. వాళ్లబ్బాయి అమెరికా నుంచి భారత్‌కు రాకుండా అడిగినంత డబ్బు పంపిస్తున్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నెగ్గి ఆనక అధికార పార్టీకి అమ్ముడుబోయాడు. ఎన్ని కోట్లు గడిస్తే ఏముంది? హాస్పిటల్‌లో రెండు నెలలుగా ఒక గృహిణికి లేనిపోని టెస్టులన్నీ చేసి లక్షల్లో డబ్బు నొక్కేశాడని ఓ కాంట్రాక్టర్ ఆగ్రహించాడు. తన ఇంటికి రమ్మని ఆహ్వానించి ఆయన కారును ఒక లారీతో ఢీకొట్టించాడట. ఇలా కసి తీర్చుకున్నాడని జనం చాటుగా చెప్పుకుంటున్నారు. దుర్యోధనుడు మంచి పరిపాలనాదక్షుడే. కానీ, చేసిన వెధవ పనులకు శిక్షగా బంధుమిత్రులను, తమ్ముళ్లందరినీ పోగొట్టుకొని చివరికి తానూ హతమయ్యాడు. భగవంతుడు మన పాపపుణ్యాల చిట్టా రాస్తాడని, పాపాలకి తగిన శిక్షలు వేస్తాడని తెలియక పాపం.. పాడు పనులన్నీ చేశాడు. మిత్రుడిగా నీకో సలహా. ఈ కుళ్లు రాజకీయాలు నీకొద్దు!’ వివరంగా హితవు చెప్పాడు శర్మ.

- యడవల్లి విశ్వనాథ్, గుంటూరు.