రివ్యూ

కథే.. భయపడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * ఇదేం దెయ్యం
తారాగణం: శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే, రచ్చ రవి, కిరాక్ ఆర్.పి., జీవా, గౌతంరాజు, అప్పారావు తదితరులు
కెమెరా: కృష్ణప్రసాద్
సంగీతం: బాలు స్వామి
నిర్మాత: సరిత
దర్శకత్వం: వి రవివర్మ
హారర్ జోనర్‌కు భాషతో పనిలేదు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ కనెక్ట్ అయిపోతారు. యూత్‌కు సరిపోయే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, కాస్తంత కామెడీతో సినిమా చేస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద హిట్టే. ఇప్పటికే తెలుగులో అనేక హారర్ చిత్రాలు వచ్చాయి. అవన్నీ కూడా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి. తాజాగా మరో హారర్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ఇదేం దెయ్యం’. రవివర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఇదేం దెయ్యం’- ముగ్గురు అమ్మాయిలతో అనేది ఉపశీర్షిక. శ్రీనాథ్ మాగంటి, సాక్షి కక్కర్‌లతోపాటు నూతన తారలను పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రంలో ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? దెయ్యాలుగా ఎవరు, ఎలా భయపెట్టారు? ఇంతకీ దెయ్యం కథ ఏమిటి? ముగ్గురు యువకుల జీవితాలు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాయి అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రాజేష్ (శ్రీనాథ్ మాగంటి), గిటార్ గిరి (రచ్చ రవి), ఆదికేశవరెడ్డి (కిరాక్ ఆర్పీ) ఈ ముగ్గురు స్నేహితులు. ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ కోరిక నెరవేరకపోవడంతో ఓ స్వామీజీ (జీవా) దగ్గరికి వెళతారు. సమస్యను తెలుసుకున్న స్వామీజీ, మీరు ఊరికి దూరంగా ఉన్న బంగ్లాలో 30 రోజులపాటు ఉండాలని, అప్పుడే మీ సమస్య తీరుతుందని చెప్పి వాళ్లని అక్కడికి తన మాయతో పంపిస్తాడు. వాళ్ళతోపాటు మరో ముగ్గురు అమ్మాయిలు శిరీష (సాక్షి కక్కర్), మానస (రచన), ప్రత్యూష (రుచి)లు ఉండడం చూసి.. ఈ ముగ్గురు ఆ ముగ్గురు అమ్మాయిలను ప్రేమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ ఇంట్లో ఇంకా ఏదో ఉందన్న అనుమానం కలుగుతుంది. ముగ్గురు అబ్బాయిలను భయపెట్టడమే కాదు, కొడుతుంటుంది. ఈ విషయాన్ని ఆ అమ్మాయిలకు చెప్పాలని వెళితే.. వాళ్ళు ముగ్గురే ఈ దెయ్యాలని కనుక్కుంటారు. తరువాత వీరి పరిస్థితి ఏమిటి? అసలు వాళ్ళు దెయ్యాలుగా ఎందుకు మారారు? ఆ దెయ్యాల బారినుండి ఈ ముగ్గురు యువకులు తప్పించుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం చిత్రం చూడాల్సిందే.
ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన శ్రీనాథ్ మాగంటి తన పాత్రలో బాగా నటించాడు. భయపడే సన్నివేవాల్లో చక్కగా చేశారు. ఇక ముగ్గురు హీరోయిన్లు సాక్షి, రచన, రుచిలు తమ పాత్రల్లో మంచి నటన కనబరుస్తూనే అటు గ్లామర్‌గా అందాలు ఆరబోశారు. గ్లామర్ ప్రదర్శనలో చూపించిన శ్రద్ధ యాక్టింగ్‌లో చూపించలేదన్నది చెప్పకనే చెప్పే మాట. సీనియర్ నటులు జీవా, గౌతంరాజు, జబర్దస్త్ అప్పారావు నటించే ఆస్కారమే లేదు.
హరర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా సాంకేతికవర్గంలో -బాలు స్వామి సంగీతం జస్ట్ ఓకె. నేపథ్య సంగీతం దారుణం. అలాగే కృష్ణ ప్రసాద్ కెమెరా పనితనం అస్సలు బాగలేదు. సినిమాలో కెమెరా వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎడిటింగ్ వెరీ పూర్. ప్రొడక్షన్ వేల్యూస్ నాసిరకం. పాటలన్నీ ఒక గదిలో లాగించేశారంటే, విషయం అర్థం అవుతుంది. ఇక దర్శకుడు రవివర్మ ఈ సినిమాలో ఏ యాంగిల్‌తోనూ మెప్పించలేకపోయాడు. చెప్పాలనుకున్న పాయింట్‌లో క్లారిటీ మిస్సయ్యాడు. అసలు చిత్రీకరణలో కెమెరా యాంగిల్స్ గాని, ఫ్రేమ్స్ గాని, లైటింగ్ అరేంజిమెంట్స్ అన్ని విషయాల్లో చాలా తప్పులే కనిపించి బోర్ ఫీలవుతాం. కామెడీ విషయంలో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో నవ్వించే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ రచ్చ రవి, కిరాక్ ఆర్పీల కామెడీ బాగుంది. హీరోయిన్లు సాక్షి, రచన, రుచిలు నటనకంటే గ్లామర్ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు.

-త్రివేది