రివ్యూ

మిణుకు.. మిణుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** నక్షత్రం
తారాగణం: సందీప్‌కిషన్, సాయిధరమ్‌తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్‌రాజ్, తనీష్, శివాజీరాజా, శ్రీయ సంగీతం: భీమ్స్
సంగీతం: శ్రీకాంత్ నారోజ్
నిర్మాతలు: కె శ్రీనివాసులు, ఎస్ వేణుగోపాల్, సజ్జు
దర్శకత్వం: కృష్ణవంశీ
నేటి తరానికి ప్రతినిధులైన యువకులు చుట్టూ వున్న వ్యామోహాలలో పడి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. ఇది చదువులేని వారి పిల్లలు చేస్తున్నారు అంటే తప్పు. సంఘంలో గొప్ప స్థానాలలో ఉంటూ వారి వారి విధులు సక్రమంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, తమ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు. చివరికి చేతినిండా డబ్బు, మందీ మార్బలం ఉండడంతో సంఘానికి చీడపురుగుల్లా మారుతున్నారు హైసొసైటీలో వున్న ధనవంతుల పిల్లలు. దీనే్న కొంచెం అటు ఇటుగా మార్చి నక్షత్రం అంటూ దర్శకుడు కృష్ణవంశీ వచ్చారు. పై కథనానికి పోలీసు ఆఫీసర్ అవ్వాలన్న ఓ యువకుడి జీవితాశయాన్ని జతచేసి కథ నడిపించే ప్రయత్నం చేశారు.
రామారావు (సందీప్‌కిషన్)కి తరతరాలుగా వచ్చిన ఆస్థి పోలీస్ విధులు నిర్వహించిన తాత, తండ్రుల మంచితనమే. ఎప్పటికైనా తానూ పోలీసు అధికారి కావాలని ప్రయత్నిస్తున్నా ఇంగ్లీష్ రాకపోవడంతో ఎప్పటికప్పుడు అవకాశాన్ని పోగొట్టుకుంటూంటాడు. అతని మరదలు జమున (రెజీనా) ఓ చిన్న సైజు యాంకర్, నటి. ఓ వైపు పోలీసు అధికారి కావాలన్న రామారావు కోరికను బయటపెట్టే సన్నివేశాలు, పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వున్న అనేక చట్టాలను గురించి అవగాహన వున్నట్లుగా రూపొందించారు. మరికొన్ని జమున షూటింగ్స్ స్పాట్‌లో జరుగుతున్న ముచ్చట్లను తొలిభాగమంతా నింపే ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసు అధికారి ప్రకాష్‌రాజ్ తనయుడు తనీష్ విలనిజాన్ని పరిచయం చేశారు. రెండవ సగంలోకి వచ్చేసరికి మరొక కథ సాయిధరమ్‌తేజ్, ప్రగ్యా జైస్వాల్‌ల వీరోచిత పోరాటాలు, పోలీసు అధికారులుగా వాళ్లిద్దరు చేసే విన్యాసాలు చూపారు. చివరికి ఇన్ని పాత్రలు పోలీసు అధికారి తనయుడి విలనిజానికి బలైపోయినవే. అతనికి తోడుగా డ్రగ్స్ సరఫరా చేసే ఓ ముఠా లాంటి వ్యవహారాలు కూడా చిత్రీకరించారు. ఇన్ని ఇబ్బందుల నడుమ పోలీసు అవ్వాలనుకున్న రామారావు సర్ట్ఫికెట్లను తగులబెట్టేస్తాడు తనీష్. అయినాకానీ మొక్కవోని ధైర్యంతో ప్రతి పౌరుడు డ్రెస్ లేని పోలీస్ అని రామారావు పోలీసు అధికారి విధులను నిర్వహిస్తూనే వుంటాడు. ఈ నేపథ్యంలో తనీష్ చేసే అకృత్యాలన్నీ బయటపడతాయి. చివరికి ఏం జరిగిందనేదే ముగింపు. సినిమా మొదటినుంచి ఓవైపు రామారావు సన్నివేశాలు, మరోవైపు జమున షూటింగ్ గోల, వైవా హర్ష డాన్స్ డైరెక్టర్‌గా చేసే యాగీ సన్నివేశాలు బోరుకొట్టిస్తాయి. కథ చిన్నదైపోవడంతో ముందుగా చూపించే సన్నివేశాలన్నీ లాగ్‌డ్‌గా సాగాయి. హీరో ఎంట్రెన్స్‌లో ఓ మాంచి అదిరిపోయే పాట వచ్చినట్లుగా హీరోయిన్ ఎంట్రెన్స్‌ని మస్త్ మస్త్ అందాలతో వైవిధ్యంగా చిత్రీకరించారు. స్క్రీన్‌ప్లేలో ప్రతి సన్నివేశం కూల్‌గా లేకుండా పరిగెత్తినట్లుగా ఎవరో వెంటపడినట్లుగా సాగిపోతుంటాయి. అక్కడక్కడా టీవీ కార్యక్రమాలు, మావూరి వంట, ఫేస్‌బుక్‌లో షేర్లు, లైక్‌ల పిచ్చి లాంటి వాటిపై సెటైర్లు కూడా వేశారు. అలెగ్జాండర్ (సాయిధరమ్‌తేజ్) బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోతే, అతని నేమ్‌బ్యాడ్జ్ ఎలా రామారావు షర్ట్‌పై చేరింది అనేదానికి పూర్తి క్లారిటీ లేదు. కథలో చాలా లొసుగులు కనబడతాయి. సాధ్యాసాధ్యాలు ఏదీ ఆలోచించలేదు. తనకు తోచినట్లుగా కథను నడుపుకుంటూ వెళ్లాడు. ఖడ్గం చిత్రంలో పోలీస్ కథనం ఓవైపు, సినిమా కథనం మరోవైపు, ఉగ్రవాదులు, మానవబాంబులు లాంటి అంశాలు ఉన్నట్లుగానే ఈ చిత్రంలో కూడా ఉంటాయి. కాకపోతే ఖడ్గంలో పోలీసు అధికారిగా చేసిన శ్రీకాంత్ గంభీరంగా నటిస్తే, ఇక్కడ రామారావు పాత్రను చాలా ఈజీ గోయింగ్ వ్యక్తిగా తీర్చిదిద్దారు. దీంతో హీరోపై ఒక అంచనాకి రాలేం. మొదటి భాగంలో హీరో రామారావు అయితే, రెండో భాగంలో హీరో అలెగ్జాండర్. విలన్ కూడా బలమైనవాడు కాకపోవడంతో ఇద్దరి హీరోల హీరోయిజం వెలవెలబోయింది. చివరికి పెద్ద విలన్‌ను ప్రగ్యా జైస్వాల్ అందమొందిస్తే, చిన్న విలన్‌ను ప్రకాష్‌రాజ్ అంతమొందించాడు. ఇక్కడ హీరో డమీలాగా మారిపోయాడు. దీంతో ప్రధానమైన కథ కనిపించదు. విలన్‌ను కిడ్నాప్ చేసి మూటకట్టి ఇంట్లో దాచిపెట్టిన హీరో, హీరోయిన్‌తో పాటేసుకోవడం వైవిధ్యంగా ఉంటుంది. ఇది ఎడిటింగ్ లోపం. సినిమా అంతా కంగారు కంగారుగా సాగిపోతుంటే, కెమెరా పనితనం కూడా మొత్తం ఫ్లాష్ లైట్లు వెలిగినట్లు వెలిగిపోయింది. గ్రాఫిక్స్ వెలుగులు బాగా ఎక్కువయ్యాయి. ‘దీని ఒళ్ళు చూస్తే పల్లిపట్టిరో, కళ్లు చూస్తే సారాబట్టీరో, అమ్మమ్మో పిల్లగాడ- 420గాడా’ లాంటి పాటలు గందరగోళంగా సాగి ఇబ్బంది పెట్టేస్తాయి. పెదవికి నువ్వంటే ప్రాణం పాట సాహిత్య పరంగా ఫర్వాలేదనిపించినా బాణీపరంగా ఆకట్టుకోదు. గాయని పాటకు న్యాయం కూడా చేయలేదు. మాటలు సోసోగా సాగిపోతాయి కానీ ఎక్కడా మెరుపులు వినిపించవు. నటీనటుల పరంగా గుర్తుపెట్టుకునేలా చేసింది తనీష్, ప్రగ్యా జైశ్వాల్ మాత్రమే. మిగతా అందరూ సోసోగా, ఓవర్‌గా చేశారు. దర్శకత్వ పరంగా శ్రీఆంజనేయం తరువాత, ఖడ్గం సినిమా తరువాత ఓ వైపు ఆంజనేయస్వామిని, మరోవైపు ఖడ్గంలో కథనాన్ని అటు ఇటు మార్చి తీసే ప్రయత్నం జరిగింది. అయితే కృష్ణవంశీ నుంచి ఆశించే సినిమా మాత్రం కాదు. ఇలాంటి సినిమాలు తీయడానికి చాలామంది వున్నారు. కానీ కృష్ణవంశీ మార్క్ తీయడానికి ఆయన మాత్రమే ఉన్నాడు.

-శేఖర్