చిత్తూరు

భక్తకోటితో నిండిన శ్రీకాళహస్తీశ్వరాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని హిందూ ఆలయాలన్నీ మూతబడ్డాయి. అయితే రాహు-కేతు క్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వరాలయం మాత్రం భక్తులతో కళకళలాడింది. గ్రహణం అయినప్పటికీ శ్రీకాళహస్తీశ్వరాలయం మూత పడలేదు. రాహు-కేతువులు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు స్వామిలో ఐక్యం అయి ఉండటంతో గ్రహణాలు ఈ క్షేత్రానికి పనిచేయవని పెద్దలు చెబుతారు. అందువల్లే సూర్య, చంద్ర గ్రహణాల సందర్భంగా ఆలయం మూత పడదు. అంతేకాకుండా ప్రత్యేక అభిషేకాలు జరగడం ఇక్కడి విశిష్టత. అదేవిధంగా సోమవారం అరుదుగా వచ్చే చూడామణి చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆయా దేవస్థానాలు ముందుగానే ప్రకటించాయి. దీంతో శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజామునుంచే రద్దీ మొదలైంది. ఇదేవిధంగా రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు వచ్చారు. మరికొందరు అభిషేకాలను చేయించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో రాకపోయినా రద్దీ బాగానే ఉందని, అందరికీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేయించడానికి చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. సాయంత్రానికి 40వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చినట్లు అంచనా. రాత్రి 9.30 గంటల వరకు 50వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రి 10.30 గంటలకు ఆలయాన్ని తెరచి 11 గంటలకు గ్రహణ కాలాభిషేకాన్ని పూజారులు నిర్వహించారు. గ్రహణం వల్ల ఏ ప్రాంత ప్రజలకు కీడు జరగకుండా అభిషేకాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి, అమ్మవార్లను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి సతీసమేతంగా వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా ట్రిబ్యునల్ న్యాయమూర్తి కూడా రవిబాబు ప్రత్యేక రాహు-కేతు పూజలు చేయించుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
వైభవంగా ఊంజల్‌సేవ
శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల్‌సేవ జరిగింది. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, దీపారాధన, మంత్రపుష్పాలు పూర్తయిన తరువాత అలంకరించిన ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణంలోని మండపాలలో ఎదురెదురుగా ఏర్పాటుచేసి వేద పండితులు ఊంజల్ సేవ నిర్వహించారు. మంగళవాయిద్యాలతో వేదమంత్రాలను పఠించారు. ఆ తరువాత నైవ్యేదం సమర్పించి దీపారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు, ఇఓ భ్రమరాంబ, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీవారి ఆశీస్సులతోనే ఉప రాష్టప్రతిగా ఎన్నికయ్యా: వెంకయ్య
తిరుపతి: సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన తనకు భారతదేశంలోనే అత్యున్నతమైన ఉప రాష్టప్రతిగా ఎన్నికయ్యే అవకాశం శ్రీవారి ఆశీస్సులు వల్లే వచ్చిందని, ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టం అని ఉప రాష్టప్రతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన రాత్రి అక్కడే బసచేసి సోమవారం ఉదయం ఆలయం వద్దకు కుటుంబ సభ్యులతోకలిసి చేరుకున్నారు. ఈసందర్భంగా టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజులు సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా టిటిడి ఇఓ, జెఇఓలు తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. అనంతరం ఆలయం వెలుపల వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో తాను ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరిస్తానని, ఈసందర్భంగా ముందుగా కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తాను చిన్న వయసులో 8వ తరగతి చదువుకొనే రోజులనుంచీ ఇప్పటి వరకు ప్రతి యేడాది తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. శ్రీవారి దర్శనం వలన తనలో మరింత ఉత్సాహం, ధైర్యం, స్వాంతన, స్ఫూర్తి, విశ్వాసం కలుగుతుందని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత తనకు కొత్త వెలుగు కనిపించిందని, ఆ వెలుగును ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు ఉపయోగిస్తానని చెప్పారు. ప్రతి వ్యక్తికి దైవచింతన, భక్తి, ఆరాధన, ఆధ్యాత్మిక భావన ఉంటే మంచి ప్రవర్తన, సద్బుద్ధి లభిస్తాయన్నారు. పండుగలు, పర్వదినాల్లో తిరుమలకు వచ్చి భక్తులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిఎస్‌ఓ ఎ.రవికృష్ణ, ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, రిసెప్షన్ డిప్యూటీ ఇఓ హరీంద్రనాధ్, ఓఎస్‌డి లక్ష్మీనారాయణ, క్యాటరింగ్ ఆఫీసర్ జిఎల్‌ఎన్ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

దొంగ చాటుగా కుల కుంపట్లు రగిలించకండి
* టిడిపి పాలనలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి * బిసి సెల్ విభాగం అధ్యక్షులు షణ్ముగం
చిత్తూరు : ప్రశాంతంగా జీవిస్తున్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి నిర్వీర్యం చేయడంతో పాటు కొంత మంది దొంగచాటుగా కుల కుంపట్లు రగిలిస్తున్నారని, అలాంటి విధానాన్ని విడనాడాలని టిడిపి బిసి సెల్ విభాగం అధ్యక్షులు, చిత్తూరు సహకార టౌన్ బ్యాంకు పాలక మండలి అధ్యక్షులు పి షణ్ముగం హితవు పలికారు. సోమవారం స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో టిడిపి బిసి విభాగం ప్రతినిధులు విలేఖరులతో మాట్లాడారు. షణ్ముగం మాట్లాడుతూ వైకైపాకు చెందిన డేరంగుల ఉదయ్‌కిరణ్, అదే పార్టీకి చెందిన సంతపేట నారాయణలు బిసి సంఘం ప్రతినిధులమంటూ చెప్పుకుంటూ, బిసిలను రెచ్చగొట్టడమే కాకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల చిత్తూరు నగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో సంబంధిత ఇద్దరు నాయకులు బలిజలను బిసిల్లో చేర్చితే ఊరుకోమంటూ చెప్పడం దారుణమన్నారు. అయితే అదే నాయకులు వైకాపా సమావేశాలకు హాజరైన సమయంలో మాత్రం కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాము సైతం బిసి కులానికి చెందిన వారమే అని, అయితే కాపులను బిసి జాబితాలో చేర్చే విషయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమను నొప్పించకుండా ఉండేడేలా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. అందులో భాగంగానే మంజునాధ కమిషన్‌ను వేసి ఇరు వర్గాల అభిప్రాయ సేకరణ చేయడం జరిగిందన్న విషయాన్ని బిసి సంఘం ప్రతినిధులుగా చెప్పుకునే వారు తెలుసుకుంటే మంచిదన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వెనుకబడ్డ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు నిధుల లేమి ఇబ్బందులు పడ్డాయన్నారు. అయితే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సంభందిత శాఖలకు రు 70 కోట్లు చొప్పున నిధులను మంజూరు చేశారన్నారు. ముఖ్యంగా దాదాపు రు బిసి సబ్‌ప్లాన్‌కు ఏకధాటిగా రు 10 వేల కోట్లు మంజూరు చేసిన ఘనత కూడా తమ నేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 670 మంది బిసి విద్యార్థుల విదేశీ చదువులకు సరిపడా నిధులను సైతం విడుదల చేసి చరిత్రలో నిలిచారని ప్రశంసించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలోని బిసిలకు 100 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తానని చెప్పి, అందులో సగ భాగం మాత్రం ఇచ్చిన బిసిలను మోసం చేశారన్న విషయాన్ని విమర్శకులు తెలుసుకొని మసలాలన్నారు. ఇకనైనా వెకాపాలో లోపాయికారంగా కొనసాగుతున్న బిసి సంఘాల నాయకులు తమ తీరును మార్చుకుని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేయాలని సూచించారు.
తప్పును కప్పిపుచ్చుకోవద్దు
నంద్యాల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చేసిన తీవ్ర ఆరోపణలు, హెచ్చరికలను జిల్లా వైకాపా మహిళా విభాగం కప్పిపుచ్చుకోవడం తగదని టిడిపి మహిళా విభాగం ప్రతినిధి ఇందిర, జిల్లా విభాగం ఉపాధ్యక్షురాలు, సంతపేట కార్పొరేటర్ సిఎం విజయ సూచించారు. జిల్లా టిడిపి కార్యాలయంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ సాక్షాత్తూ ముఖ్యమంత్రిని తిడుతూ హెచ్చరించిన విషయాన్ని తట్టుకోలేక తమ పార్టీ శ్రేణులు వైకాపా అధ్యక్షుడు జగన్ దిష్టి బొమ్మలను కాల్చారన్నారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైకాపా జిల్లా మహిళా విభాగం నాయకురాళ్లు జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ తదితరులకు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, ఉపాధ్యక్షులు సెంథిల్‌కుమార్, యువజన విభాగం జిల్లా ప్రతినిధి హరిబాబు, సభ్యులు రుద్రయ్య, చిరంజీవి, పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కుప్పయ్య, టిడిపి బిసి విభాగం నాయకులు ఈశ్వర్ తదిరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు నూతన సర్వభూపాల వాహనం సిద్ధం
తిరుపతి: నూతన సర్వభూపాల వాహన తయారీ పూర్తయిందని, రానున్న బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనాన్ని వినియోగిస్తామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘా ల్ వెల్లడించారు. సోమవారం ఆయన జెఇఓ శ్రీనివాసరాజుతో కలిసి తిరుమల వాహన మండపంలో ఉంచిన సర్వభూపాల వాహనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇఓ కోదండరామారావు, పేష్కార్ రమేష్‌బాబు, ఆలయ ఓఎస్‌డి పాల శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జ్ గురు రాజారావు తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మ గుడిలో వైభవంగా చండీ హోమం
తిరుపతి: తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మగుడిలో సోమవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు చండీ హోమాన్ని ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 12 గంటలకు పూర్ణాహుతితో హోమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ సుబ్రహ్మణ్యం, చైర్మన్ ఆర్‌సి మునికృష్ణ, పాలకమండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం
* నేటికీ గిరిజనులు కనీస అవసరాల కోసం అల్లాడుతున్నారు * జివిఎస్ అధ్యక్షులు వడిత్యా శంకర్‌నాయక్ ఆవేదన
తిరుపతి: ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక మహతి కళాక్షేత్రంలో గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి గిరిజన సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వడిత్యాశంకర్‌నాయక్ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో నేటికీ గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక కూడు, గూడు, గుడ్డ కోసం పరితపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా అవి అమలుకావడం లేదన్నారు. గిరిజనుల కోసం కేటాయించిన నిధులు వారి అభివృద్ధి కోసం కాకుండా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పక్కదారి పట్టించడం ప్రభుత్వాలకు తగదన్నారు. సబ్ ప్లాన్ నిధులను గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించాలని, గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదువుకున్న గిరిజన యువతకు ఉపాధి కల్పించాన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనులను ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నిజమైన గిరిజనులకు అందేలా చర్యలు తీసుకోవాలని, వారి వైద్యం కోసం తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. లంబాడి, సవరా, ఇతర నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.నారాయణమ్మ, ఎస్వీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్, గిరిజన మహిళా నాయకురాళ్లు సోనాభాయి, జివిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె. శంకర్‌నాయక్, రాష్ట్ర నాయకులు బి.సుధాకర్ నాయక్, డి.్భస్కర్‌నాయక్, పి.శంకర్‌నాయక్, భానుప్రకాష్, దుర్గాదేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
* సిఎం ఫ్లెక్సీకి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సుగుణమ్మ
తిరుపతి: తిరుపతిలో రాఖీ పౌర్ణమి వేడుకలను నగరప్రజలు, ప్రముఖులు ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నలకు చెల్లెళ్లు, అక్కలకు తమ్ముళ్లు రాఖీలు కట్టి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాగా సోమవారం తిరుపతి పర్యటనకు వచ్చిన ఉప రాష్టప్రతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటుగా స్విమ్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికాకు చెందిన చార్లస్ రాబర్ట్ అనే మహిళ సైతం రాఖీ కట్టడం ఆకర్షణీయంగా మారింది. ఆయనకు పలువురు మహిళ వైద్యులు, విద్యార్థినులు కూడా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాఖీ కట్టాలని భావించానా ఆ అవకాశం లభించకపోవడంతో తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు నాయుడున్న ఫ్లెక్సీకి రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా తుడా చైర్మన్ నరసింహయాదవ్‌కు కూడా రాఖీ కట్టారు. టిడిపి వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి సైతం రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే సుధహా లిటిల్ సిటిజన్ స్కూల్లో డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలకు రాఖీ పౌర్ణిమ విశిష్టతను, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

వరకట్న వేధింపులకు అబల బలి
కెవిబిపురం: అత్తింటివారి వరకట్న వేధింపులకు ఓ అబల బలైన సంఘటన కెవిబిపురం మండలంలోని పెరుందేశం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెరుందేశం గ్రామానికి చెందిన గోవిందయ్య, రాణిల కుమార్తె సురేఖ (22)ను నెల్లూరులోని బర్మాశాలగుంటకు చెందిన శివకుమార్‌కు 3 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి కానుకగా రూ.60వేల డబ్బు, 15 సవర్ల బంగారు, రూ.2లక్షలు విలువచేసే ఇంటి వస్తువులను కొనిచ్చారు. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో సంవత్సరం వయస్సుగల జెర్సీ అనే పాప పుట్టింది. అనంతరం భర్త శివకుమార్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కావాలని, బైక్ కావాలని సురేఖను వేధించడం మొదలుపెట్టారు. ఆదివారం నుంచి గొడవలు అధికం కావడంతో మనస్థాపానికి గురైన సురేఖ పక్కనే ఉన్న రైల్వేట్రాక్ మీదుగా వెళ్లి ఎదురుగా వస్తున్న రైలు కింద పడి మృత్యువాత పడింది. దీంతో సమాచారం అందుకున్న పెరుందేశం గ్రామస్థులు హుటాహుటిన నెల్లూరు వెళ్లి సురేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పెరుందేశం గ్రామానికి తీసుకొచ్చి సోమవారం దహనం చేశారు. వరకట్న వేధింపులకు గురిచేసి అకాల మరణానికి దారితీసిన ఈ సంఘటనలో భర్త శివకుమార్‌కు, వారి తల్లిదండ్రులకు చట్టపరమైన శిక్షలు వేయాలని సోమవారం సురేఖ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏది ఏమైనప్పటికీ వరకట్న వేధింపులతో అకాల మరణం చెందిన సురేఖ కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాదచాయలు అలముకున్నాయి.

తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్తత
* ఆందోళనకు దిగిన ఆటో కార్మికులు
తిరుపతి: తిరుపతి రేల్వే స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. గతంతో రైల్వేస్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సులను పెట్టడాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిచేసిన విషయం విధితమే. అప్పటి ఎస్పీ విజయలక్ష్మి రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీలను పెట్టకుండా నియంత్రించారు. అయితే రాజకీయ ఒత్తిడితో, ఆందోళనలతో వారికి నిబంధలను పెట్టి ఆటోలకు అనుమతులు ఇచ్చారు. సోమవారం ఉదయం తిరిగి రైల్వేస్టేషన్ వద్ద ఆగివున్న ఆర్టీసీ బస్సును అక్కడ నుంచి తీసివేయాలని ఆటో డ్రైవర్లు కోరడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సుపై దాడి చేశాడు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఆర్టీసీ బస్సులను తెచ్చి రైల్వే స్టేషన్ వద్ద పెడుతున్న కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామంటూ ఆటో డ్రైవర్ సగం గుండు, సగం మీసం తీసుకుని రైల్వే స్టేషన్ ముందు బైఠాయించాడు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే బొజ్జలకి రాఖీ కట్టిన మహిళలు
శ్రీకాళహస్తి: రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జలగోపాలకృష్ణారెడ్డికి పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఆయన స్వగ్రామం ఊరందూరులో బొజ్జలను కలసి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాల సహకార సొసైటీ అధ్యక్షుడు మునిరాజా నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.