క్రీడాభూమి

శ్రీకాంత్ నుంచి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాలని ఎదురు చూస్తున్న తనకు భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌తో పాటు లీ చోంగ్ వెయి, లిన్ దాన్ లాంటి లెజెండరీ ఆటగాళ్ల నుంచి విషమ పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని ఒలింపిక్ కాంస్య పతక విజేత విక్టర్ అక్సెల్‌సెన్ (డెన్మార్క్) అభిప్రాయపడ్డాడు. ‘గ్లాస్గోలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించాలని ఎదురు చూస్తున్న నాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. ప్రత్యేకించి ఆంధ్రావాలా కిదాంబి శ్రీకాంత్ గత కొంత కాలం నుంచి ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే లిన్ దాన్, చెన్ లాంగ్, లీ చోంగ్ వెయి లాంటి క్రీడాకారులు కూడా చక్కగా రాణిస్తున్నారు. దీంతో పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీ తీవ్రస్థాయిలో ఉండబోతుంది. ఈ విభాగంలో బాగా ఆడగలిగే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వీరిలో అంతిమంగా కొంత మంది మాత్రమే రాణించగలుగుతారు’ అని అక్సెల్‌సెన్ పేర్కొన్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్న అక్సెల్‌సెన్‌కు, శ్రీకాంత్‌కు మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకూ పరస్పరం నాలుగు మ్యాచ్‌లలో తలపడిన వీరు చెరో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచారు. ఇటీవలి కాలం వరకు మడమ గాయంతో ఇబ్బందులు పడిన అక్సెల్‌సెన్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాను పతకం సాధించాలంటే తన నైపుణ్యానే్న నమ్ముకోవాల్సిన అవసరం ఉందని అతను స్పష్టం చేశాడు.

చిత్రం.. విక్టర్ అక్సెల్‌సెన్ (డెన్మార్క్)