ఫోకస్

ఒత్తిడి పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిటెన్షన్ విధానాన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులపై వత్తిడి పెరుగుతుంది. కేంద్రం 5, 8 తరగతుల్లో డిటెన్షన్‌ను ప్రవేశపెడుతామని ప్రకటించింది. 25 రాష్ట్రాల విద్యామంత్రులు సమ్మతి తెలియచేసినట్లు కేంద్రం పేర్కొంది. పైగా మొదటిసారి ఫెయిలైతే, మే నెలలో మళ్లీ పరీక్ష పెడుతామని పేర్కొంది. డిటెన్షన్‌వల్ల విద్యార్థులు మానసిక వత్తిడి గురై చదువంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఇంతకంటే దివాళాకోరు విధానం మరొకటి ఉండదు. దేశంలో విద్య ఇంకా అన్ని వర్గాలకు అందుబాటులోకి రాలేదు. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన విద్యార్థులకు చదువు అందని ద్రాక్ష లాంటిదే. పైగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. కానె్వంట్ విద్య పెరిగింది. బండెడు పుస్తకాలతో విద్యార్థులు పగలు, రాత్రి రుబ్బుతున్నారు. కొంతమంది చిన్నారులు వత్తిడి భరించలేక మానసికంగా నలిగిపోతున్నారు. సైక్రియాట్రిస్టుల వద్దకు పిల్లలను తల్లితండ్రులు తీసుకెళుతున్నారు. కౌనె్సలింగ్ ఇప్పిస్తున్నారు. ఇదంతా ఉన్నత ఆదాయం ఉన్న తల్లితండ్రులు చేయగలుగుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిటెన్షన్ వల్ల విద్యార్థుల్లో భయానక వాతావరణం నెలకొంటుంది. ట్యూషన్లు పెరుగుతాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రైవేట్ రంగం ఇంకా విస్తరిస్తుంది. ఇప్పటికే విద్యార్థుల్లో చదువు భయం పెరిగి క్రీడలకు దూరమవుతున్నారు. మానసిక ఉల్లాసం లేదు. కళల గురించి ఊసేలేదు. విద్యార్థుల్లో సృజనాత్మక లోపించింది. చదువును హాయిగా స్వేచ్ఛగా చదువుకోవాల్సిన పిల్లలు తీవ్రమైన ఆందోళనకు గురై పుస్తకమంటే భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఒకటవ తరగతి నుంచే ఐఐటి, మెడిసెన్ లాంగ్ టర్మ్ కోచింగ్‌లు ఇస్తున్నారు. తల్లితండ్రుల నుంచి విపరీతమైన ఫీజులను కానె్వంట్ యాజమాన్యాలు లాగుతున్నాయి. ఈ దేశంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రాథమిక, ప్రాథమికోనత్న పాఠశాలల్లో డిటెన్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టరాదని కోరుతున్నాను.

-ఎస్ సలాం, అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం