ఫోకస్

విధానంలో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మన దేశంలో గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఎంతో వెనుకబడి ఉన్నారు. అలాంటిచోట్ల అక్షరాస్యతను పెంచాలన్నా, చదువుపై వారిలో మక్కువ పెంచాలన్న డిటెన్షన్ విధానం అవసరమే. అమెరికా లాంటి దేశాల్లో విద్యార్థులకు పుస్తకాలు సరఫరా, ఫీజు రాయితీ, రవాణా వంటి వాటిని అక్కడ ప్రభుత్వమే భరిస్తోంది. మన దేశంలో అనుసరిస్తున్న విద్యా విధానం వల్ల అవకాశం ఉన్నవాళ్లు చదువుకోగలుగుతున్నారు. లేనివాళ్లకు విద్య అందకుండా పోతోంది. అందరికీ విద్యను అందించాలంటే ప్రభుత్వం ఏడో తరగతి వరకు తప్పనసరిగా పాస్ వంటి విధానం లేకపోతే డ్రాపవుట్స్ పెరిగే ప్రమాదం ఉంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసేలా వారిని ప్రోత్సహించాలి. నేడు గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే అలవాటు లేకపోవడంవల్ల అక్కడ డ్రాపవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. కనీసం లెవెల్ ‘సి’ నాలెడ్జ్ వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే విద్యార్థులు డీమోరలైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఏడో తరగతికి వచ్చేసరికి విద్యార్థికి కొంత మేరకు కనీస అవగాహన కలుగుతుంది. ఆ తరువాత తరగతులకు పరీక్షలు నిర్వహించి పాస్ మార్కు ఇతర ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాలకు ఒక 5 శాతం తగ్గిస్తే వారికి ప్రోత్సాహానిచ్చినట్టవుతుంది. దానివల్ల వారు కూడా చదువుకోడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలలో జనరల్ కేటగిరీకి, ఎస్సీ కేటగిరికి ఏ విధమైన వ్యత్యాసం చూపుతున్నారో అటువంటి విధానం గిరిజన ప్రాంత విద్యార్థులకు, వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు కల్పిస్తే బాగుంటుంది. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్తున్నారు. కాగా, ఇందుకోసం కేవలం సెంట్రల్ యూనివర్శిటీలకు వందల కోట్లు నిధులు మంజూరు చేసి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కేంద్రం నిధులు కేటాయించడం లేదు. దీనివల్ల మేక్ ఇన్ ఇండియాను సాధించలేము. ఆ కల సాకారం కావాలంటే కేంద్రం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ప్రాథమిక పాఠశాలలను, కళాశాలలను, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు వైస్ ఛాన్సలర్, సెంచూరియన్ వర్శిటీ