ఫోకస్

డిటెన్షన్ మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాల స్థాయిలో ‘డిటెన్షన్’ విధానం ఉండాలి. ఈ విధానంవల్ల ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, విద్యార్థుల్లో చదువుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఒక ఏడాది చదువు పూర్తయిన తర్వాత ఎలాంటి పరీక్ష లేకుండా, తదుపరి తరగతికి ప్రమోట్ చేయడంవల్ల విద్యార్థుల్లో అనాసక్తి పెరుగుతుంది. చదవుపట్ల వ్యామోహం ఉండదు. చదవాలన్న తపన ఏ కోశానా ఉండదు. ఏడాది కాలం చదివిన తర్వాత విద్యార్థులు ఏం చదివారు, ఎలా చదివారు, ఎలా అర్థం చేసుకున్నారు? అని తెలుసుకోవాలంటే పరీక్షలు నిర్వహించాల్సిందే. నిర్ణీత స్థాయి మేరకు మార్కులను నిర్ణయించి, అన్ని మార్కులు వస్తేనే పాసయిట్టు నిర్ణయించాలి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత విద్యారంగంలో మార్పులు, చేర్పులు తీసుకువచ్చేందుకు అనేక కమిషన్లు, కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో కొఠారి కమిషన్ (1964-66) ముఖ్యమైంది. అలాగే రాధాకృష్ణన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవలే నియామకం అయిన ఎస్‌ఆర్ సుబ్రమణియన్ కమిటీ కూడా అనేక సిపార్సులు చేసింది.
విద్యారంగానికి మొత్తం జిడిపిలో ఆరుశాతం నిధులు వినియోగించాలని, 5, 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫెయిల్ అయినవారిని ‘డిటెన్షన్’ చేసి అదే క్లాసులో ఉంచాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అత్యంత ముఖ్యమైందే కాకుండా అమలు చేయాల్సిన అంశం కూడా. వాస్తవంగా పాఠశాల స్థాయిలో ప్రతి ఏటా ప్రతి క్లాసుకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులనే ప్రమోట్ చేయాలి. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, ఉత్తీర్ణతకు మార్కులు నిర్ణయించకుండా ఉండటంవల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా నశిస్తాయి. పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణత సాధించని వారిని డిటెన్షన్ చేయడంవల్ల జాతికి ఏమైనా నష్టం జరుగుతుందా... లేదు కదా! ఉజ్జ్వలమైన భారతావని సాధించాలంటే మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేసుకోవాలి. పిల్లల్లో ఉన్న మేధస్సుకు పదును పెట్టి, వారిలో దాగివున్న విజ్ఞానాన్ని దేశానికి వినియోగపడేలా చూడాలి. అంతే కాని పరీక్షలు నిర్వహించకుండా, ప్రమోట్ చేస్తూపోతే పిల్లల్లో నిద్రాణమై ఉన్న మేధస్సు అలాగే ఉండిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో ప్రముఖ శాస్తవ్రేత్తలుగా పేరుగాంచిన వారంతా తమ విద్యార్థి దశలో పరీక్షలను ఎదుర్కొని మంచిమార్కులతో పాసైనవారేనన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. భారతదేశాన్ని ఉన్నతస్థితికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో విద్యారంగంలో మంచి సంస్కరణలు తీసుకురావలసి ఉంది. దేశానికి ద్రోహం చేసేవారే డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తారని భావిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తు, దేశ బంగారు భవిష్యత్తు కోసం పాఠశాల స్థాయిలో డిటెన్షన్ విధానం ఉండాల్సిందే.

-్ధరంకామ్ళేకార్ నర్సోజి, విద్యారంగ నిపుణుడు