ఫోకస్

పేదలకు భారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకురానున్న సంస్కరణల్లో భాగంగా గతంలో కాలం చెల్లిన డిటెన్షన్ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చే ఆలోచన సర్వత్రా ఆందోళన కలిగించనుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అతి సామాన్య, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు తీరని అన్యాయం జరగటమే కాకుండా డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతుంది. పూర్వకాలంలో 5వ తరగతి నుంచి ఏ తరగతిలో తక్కువ మార్కులతో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. 2010లో జాతీయస్థాయిలో జాతీయ విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ డిటెన్షన్ విధానం రద్దయింది. దీన్ని దేశవ్యాప్తంగా విద్యావేత్తలందరూ హర్షించారు. అయితే తిరిగి కేంద్ర ప్రభుత్వం ఈ డిటెన్షన్ విధానాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేయటం చాలా ఆందోళనకరం. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం లేకపోయినప్పటికీ ఉన్నత చదువులు చదువుకోవటానికి ముందుకు రాకుండా పలువురు డ్రాపౌట్స్ కావటం, స్కూళ్లు మూతబడటం జరుగుతున్నది. ఈ విధానం కార్పొరేట్ స్కూళ్లకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్లు ఏ తరగతిలో ఫెయిలయినప్పటికి కూడా ఆపై తరగతుల్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. మరికొన్ని స్కూళ్లు అయితే ఏకంగా 5 నుంచి 7వ తరగతి, ఆపై 10వ తరగతి సిలబస్‌లు కూడా చదివిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిటెన్షన్ విధానాన్ని పార్లమెంటులో సవరణ చట్టం ద్వారా తీసుకువచ్చే ప్రయత్నాన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు ఇంటర్‌మీడియట్ పరీక్షల్లో కూడా పలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులకు అత్యధిక ర్యాంకుల కోసం పరీక్షా కేంద్రాల ఏర్పాటు నుంచి కూడా ఎన్ని కసరత్తులు చేస్తున్నాయో తెలియంది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ విధానాన్ని విద్యావేత్తలందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కెఎస్ లక్ష్మణరావు, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ