సంపాదకీయం

సయోధ్య స్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య రామజన్మభూమి మందిర ప్రాంగణానికి కొంత దూరంగా మసీదును నిర్మించుకొనడానికి తమకు అభ్యంతరం లేదని షియా కేంద్రీయ వక్‌ఫ్ మండలి వారు స్పష్టం చేయడం సయోధ్య స్వ భావానికి నిదర్శనం. త్రేతాయుగం నాటి రఘురాముడిని ‘మర్యాదా పురుషోత్తముడు...’ అని అభివర్ణించడం ద్వారా షియా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ‘కేంద్రీయ మండలి’ జాతీయతా నిష్ఠను ప్రకటించడం అభినందనీయం. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ‘షియా మండలి’ ఈ సయోధ్యకు అంగీకారం తెలిపింది. ఈ దేశంలో పుట్టి పెరిగిన ఈ దేశ హితం కోసం జీవించిన రఘురాముడు ఈ దేశంలోని ప్రజలందరికీ వందనీయుడు, స్ఫూర్తి ప్రదాయకుడు! ఇస్లాం మతానికి చెందిన షియాలు ఈ వాస్తవానికి అనుగుణంగా ‘రామజన్మభూమి ప్రాంగణం’లో రఘురాముని మందిర నిర్మాణానికి అంగీకరించడం హర్షణీయం! రామజన్మభూమి ప్రాంగణంలో బాబరు అనే మొఘలాయి దురాక్రమణదారుడు ‘మసీదు’ను నిర్మింపచేశాడన్నది దశాబ్దుల వివాదానికి కారణం! ఈ దశాబ్దుల న్యాయ వివాదానికి శతాబ్దుల క్రితం జరిగిన విపరిణామాలు ప్రాతిపదిక! బాబరు మధ్య ఆసియా నుంచి మన దేశంలోకి చొరబడిన నాటికి అంటే క్రీస్తుశకం 1526వ సంవత్సరం నాటికి అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలో మందిరం ఉండేదన్నది ‘మందిర సమర్ధకులు’ చేస్తున్న వాదం! మీర్‌భక్షీ అనే బాబర్ సేనాని ఈ మందిరాన్ని కూలగొట్టి అదే స్థలంలో బాబర్ పేరు తో మరో కట్టడాన్ని ని ర్మించాడన్నది మందిర సమర్ధకుల వాదం! కానీ, ‘రామజన్మభూ మి’గా మందిర సమర్ధకులు అ భివర్ణిస్తున్న ప్రాం తంలో 1526 నాటికి ఎ లాంటి మందిరం లేదని, ఖా ళీగా ఉం డిన స్థ లంలో మీర్‌భక్షీ 1528లో ‘మ సీదు’ను నిర్మించాడన్నది మసీదు సమర్ధకులు ఇన్నాళ్లుగా చేసిన వాదం! ఈ భిన్న విరుద్ధ వాదాల కారణంగానే వివాదం ఏర్పడింది. అయోధ్యలోని ఆ ‘ప్రాంగణం’లో రఘురాముని మందిరం ఉండేదా? ‘మసీదు’ ఉండేదా? అన్నది న్యాయ వివాదం! ప్రస్తుతం ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది! ఈ వివాదంలో ‘మసీదు’ పక్షం వహించిన ‘షియా మండలి‘ ఇప్పుడు మసీదును వివాద ప్రాంగణానికి కొంత దూరంగా ముస్లింలు అధికంగా నివసించే ప్రాం తంలో మసీదు నిర్మించుకొనడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించడంతో వివాదం దాదాపు ముగిసినట్టే. ఎందుకంటే ‘ప్రాంగణం’-రామజన్మభూమి ప్రాంగణం-లో 1992 డిసెంబర్ ఆరవ తేదీ వరకు కొనసాగిన ‘మసీదు’పై షియా మండలికే అధికారం ఉందట!
ఈ వివాదంపై 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు చెప్పిన అలహాబాద్ హైకోర్టు వివాద స్థలాన్ని మూడు ముక్కలు చేసి రెండు ముక్కలను మందిరానికి, ఒక ముక్కను మసీదుకు కేటాయించింది. ఫలితంగా మందిరము, మసీదు పక్కపక్కనే నిర్మాణం అయ్యేందుకు రంగం సిద్ధమైంది. కానీ ఈ తీర్పును ఉభయ పక్షాలు వ్యతిరేకించాయి. అందువల్ల వివాదం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. ఆగస్టు పదకొండవ తేదీన సర్వోన్నత న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అశోక్ భూషణ్, ఎస్.అబ్దుల్ నజీర్ వివాద విచారణను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో షియా మండలి మంగళవారం దాఖలు చేసిన ప్రమాణ పత్రం-అఫిడవిట్-ఇరు వర్గాల మధ్య సయోధ్యకు దోహదం చేయగలదు. ఇలాంటి సయోధ్య ఏర్పడాలన్నదే సర్వోన్నత న్యాయస్థానం గత మార్చి 22న వ్యక్తం చేసిన అభిప్రాయం! పరస్పరం విభేదించుకునే వాదోపవాదాల వల్ల కాక ఉభయ పక్షాలు సంప్రదింపుల ద్వారా సయోధ్య సాధించడానికి కృషి చేయాలని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.కేహార్ స్వయంగా సలహా ఇచ్చి ఉన్నాడు. ఉభయ పక్షాల మధ్య ఇలాంటి రాజీ చర్చలు జరగడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు కూడ ప్రధాన న్యాయమూర్తి ప్రకటించాడు! ప్రధాన న్యాయమూర్తి సలహాను షియా ముస్లింల మండలి పాటించిందని మంగళవారం నాటి ప్రమాణ పత్రం ద్వారా ధ్రువపడింది..
వివాద స్థలం విస్తీర్ణం రెండు ఎకరాల డెబ్బయి ఏడు సెంట్లు. ఈ ఇరుకైన స్థలంలో మందిరము, మసీదు పక్కపక్కన ఉండడం అభిలషణీయం కాదని కూడ షియా మండలి పేర్కొంది. అలా ఒకే చోట రెండింటినీ నిర్మించడం వల్ల ఒకదాని ధ్వనులు మరియొక దాని ధ్వనులతో కలిసి గందరగోళం ఏర్పడగలదన్న షియా మండలి అభిప్రాయం నిరాకరించజాలని వాస్తవం! వివాదాన్ని పరిష్కరించడానికై ఒక మాజీ సర్వోన్నత న్యాయమూర్తి అధ్యక్షతన మధ్యవర్తిత్వ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడ షియా మండలి సూచించింది. ఈ ప్రతిపాదనను మందిరం పక్షం వారు అంగీకరించినట్టయితే వివాదం ముగిసినట్టే! ఎందుకంటే సయోధ్యను వ్యతిరేకిస్తున్న సున్నీ ముస్లిం వక్‌ఫ్ మండలికి ఈ వివాదం తో సంబంధమే లేదన్నది షియాల వాదం. 1992 డిసెంబర్‌లో కూ లిన కట్టడం షియా మండలి పర్యవేక్షణ లో నిదట! అందువల్ల ‘శాం తియుత సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్న మతోన్మాద తీవ్రవాదులైన’ సున్నీ మండలి వారిని ఈ వ్యవహారానికి దూరంగా ఉంచాలన్నది షియా మండలి సర్వోన్నత న్యాయస్థానానికి చేసిన నివేదన...
అందువల్ల సున్నీ మండలి కూడ షియా మండలి వలెనే సయోధ్యకు సిద్ధపడడం మేలు! అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలో జరిగిన తవ్వకాల వల్ల అక్కడ పురాతన దేవాలయం ఉండేదని నిర్ద్వంద్వంగా ధ్రువపడింది. ఈ చారిత్రక వాస్తవాన్ని అంగీకరించకపోవడం సూర్యుని వె లుగును వెలుగు కాదని బుకాయించడంతో సమానం! కూలిపోయిన కట్టడం కింద బయటపడిన ఆలయం ఈ ప్రాంగణం ‘రామజన్మభూమి’ అన్న వాస్తవానికి తిరుగులేని సాక్ష్యం! ఆ పురాతన ఆలయాన్ని బాబర్ ఆదేశాలపై మీర్‌భక్షీ కూల్చి వేసి ఉండడం ఆశ్చర్యం కాదు. విదేశాల నుంచి మన దేశంలోకి చొరబడిన జిహాదీలు దేవాలయాలను ధ్వంసం చేయడం, గోహత్య చేయడం, అబలలపై అత్యాచారాలు జరపడం, స్వదేశీయులను హత్య చేయడం, బలవంతంగా మతం మార్చడం శతాబ్దుల చరిత్ర! అందువల్ల విదేశాల నుంచి వచ్చి పడిన జిహాదీ స్వభావుడైన మొఘలాయి బాబర్ రామజన్మభూమి మందిరాన్ని ధ్వంసం చేసి ఉంటాడన్నది నిర్వివాదం! ఏమయినప్పటికీ రాముడికీ, బాబర్‌కూ మధ్య వివాదం ఏర్పడినట్టయితే ఈ దేశ ప్రజలు స్వజాతి వీరుడైన రాముడి వైపు నిలబడడం న్యాయం. బాబర్ విదేశీయుడు! ఈ దేశంలోకి చొరబడిన దురాక్రమణదారుడు.