క్రీడాభూమి

ఒలింపిక్స్‌లో ఆడడంపై బోర్డు ఎజిఎంలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టనున్న క్రికెట్‌లో భారత్ పోటీపడే విషయంపై బిసిసిఐ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో నిర్ణయం తీసుకుంటారని బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొంటే, బిసిసిఐపైన కూడా జాతీయ క్రీడా సమాఖ్యగా ముద్రపడుతుంది. అంటే, ఒలింపిక్స్ సూత్రాలను అనుసరించి క్రికెటర్లు కూడా తాము ఎప్పుడు, ఎక్కడ ఉంటామనే విషయాన్ని ముందుగానే ప్రకటించాలి. ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) చేసిన ఈ ప్రతిపాదనను దాదాపుగా క్రికెట్ ఆడే అన్ని దేశాలు అంగీకరించగా, భారత ఆటగాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు. క్రికెటర్ల అభిప్రాయాలను గౌరవిస్తూ ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలా? లేక క్రికెట్ క్రీడాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆ మెగా టోర్నీలో ఆడాలా? అన్నది ఎస్‌జిఎంలో సభ్య సంఘాలన్నీ చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయని సిఒఎ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. బోర్డుతో జరిపిన సమావేశంలో ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపింది. అదే విధంగా పురుషులు, మహిళల విభాగాల్లో జాతీయ క్రికెట్ సెలక్టర్లకు తలా 15 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. లోధా కమిటీ చేసిన సూచనలను, ప్రత్యేకించి అంతర్జాతీయ టోర్నీలు, ఐపిఎల్‌కు మధ్య కనీసం 15 రోజుల విరామం ఉండేలా చూసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా నిర్ధారించడంతో సస్పెన్షన్‌కు గురైన పేసర్ శ్రీకాంత్‌పై కేసును ఇటీవలే కేరళ కోర్టు కొట్టేసింది. దీనితో అతనిని దేశవాళీ పోటీల్లో ఆడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కేరళ క్రికెట్ సంఘం చేసిన విజ్ఞప్తిని కూడా పరిశీలించామని సిఒఎ పేర్కొంది. ఈ విషయాన్ని బోర్డులోని లీగల్ సెల్ అధ్యయనం చేస్తున్నదని తెలిపింది. మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్‌కు చెల్లించాల్సిన బకాయిలపై ఎజిఎం చర్చిస్తుందని సిఒఎ చెప్పింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అజరుద్దీన్‌పై బిసిసిఐ జీవితకాల సస్పెన్షన్ వేటు విధించింది. అయితే, అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అజర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు నిరూపించే సాక్షాధారాలు ఏవీ లేవని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ఆధారంగా తనపై ఇప్పుడు కేసు లేదని, బకాయిలు చెల్లించాలని అజర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయం ఎజిఎంలో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని సిఒఎ వివరించింది.
ప్రకటనపై సంతకాలు తప్పనిసరి
బిసిసిఐ కామెంటేటర్ల ప్యానెల్‌లో ఉన్న సునీల్ గవాస్కర్‌సహా పలు హోదాల్లో ఉన్నవారంతా తమకు పరస్పర ప్రయోజనాలేవీ లేవన్న ప్రకటనపై సంతకాలు చేయాల్సి ఉంటుందని సిఒఎ తేల్చిచెప్పింది. గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్, హర్ష భోగ్లే ప్రస్తుతం బిసిసిఐ కామెంటేటర్ల ప్యానెల్‌లో ఉన్నారు. సుప్రీం కోర్టు తీరును అనుసరించి వీరంతా తమకు బోర్డులో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఇతరత్రా ప్రయోజనాలు లేవని ప్రకటించాల్సి ఉంటుంది.