అంతర్జాతీయం

సమరానికి కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 8: భారత్ చైనాల మధ్య రగులుతున్న డొక్లాం ప్రతిష్ఠంభన రోజురోజుకు శ్రుతి మించుతోంది. తాజాగా దీనిపై స్పందించిన చైనా పత్రిక భారత్ - చైనాల మధ్య సైనిక సంఘర్షణలకు కౌంట్‌డౌన్ మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించటం మంచిదంటూ చైనా అధికార పత్రిక చైనా డెయిలీ తన సంపాదకీయంలో హెచ్చరించింది. ఇదేరకంగా పరిస్థితి కొనసాగితే రెండు దేశాల మధ్య సంఘర్షణ అనివార్యమేనని కూడా వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్ వెంటనే డోక్లాం ఉంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా జాగ్రత్త పడాలనీ తెలిపింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దంటూ ఇప్పటికే భారత్‌కు డ్రాగన్ నాయకత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశ మీడియ కూడా అదే స్వరాన్ని వినిపిస్తుంది. పర్వతాన్నైనా కదిలించగలరేమోగానీ పిఎల్‌ఏను కదిలించటం అసాధ్యమంటూ చైనా అధికార ప్రతినిథి వ్యూ కియిన్ ఇటీవల హెచ్చరించారు. ఈనేపథ్యంలో మీడియా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తమయంగా మార్చాయి. బూటాన్ ట్రైజంక్షన్‌లోని డోక్లాం విషయంలో భారత్ చైనాల మధ్య గత రెండు నెలలుగా సంఘర్షణ వాతావరణ నెలకొంది. ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి చైనా ఆర్మీ చేపట్టిన ప్రయత్నాలను భారత్ దళాలు నిరోధించటమే ఇందుకు కారణం.