అంతర్జాతీయం

బరితెగిస్తే భరతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాష్టింగ్టన్, ఆగస్టు 9: ఉత్తర కొరియా హెచ్చరికలపై అమెరికా నిప్పులు చెరిగింది. అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరాలపై దాడులు చేస్తామంటూ ఉత్తర కొరియా హెచ్చరించిన నేపథ్యంలో ఏకంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. అదే జరిగితే తమ ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఇక ఎంతమాత్రం అమెరికాకు హెచ్చరికలు చేయడం ఉత్తర కొరియా మానుకోవడం మంచిదని, మళ్లీ ఇలాంటివి జరిగితే ఇంతవరకూ ప్రపంచం చూడని రీతిలో ఉత్తర కొరియాకు బుద్ధి చెబుతామని ట్రంప్ హెచ్చరించారు. ‘మామూలు మాటలకంటే కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. అది ఎంతమాత్రం మంచిది కాదు’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. క్షిపణుల్లో అమర్చి ప్రయోగించేందుకు వీలుండే అతి సూక్ష్మ అణ్వాయుధాలను ఉత్తర కొరియా సిద్ధం చేస్తోందని మీడియా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మరోపక్క ఉత్తర కొరియా మరింత రెచ్చిపోయేలా వ్యవహరించకుండా దాన్ని ధ్వైపాక్షికంగా చర్చల్లోకి తేవడమే ఉత్తమమని అమెరికా డెమొక్రాట్ పార్టీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో అధ్యక్షుడు ట్రంప్ రాజనీతిజ్ఞలైన బిల్ పెర్రీ, శ్యామ్‌నన్, జార్జిషెల్జ్ మాటలు వినాలని సూచించారు. ఐక్య రాజ్య సమితి ఇప్పటికే విధించిన ఆర్థిక ఆంక్షలను ఆయుధంగా చేసుకుని ఉత్తర కొరియాతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించాలని సిలికాన్ వ్యాలీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇండో అమెరికన్ రో ఖన్నా సూచించారు. ఉత్తర కొరియాను ఏకాకిని చేసినా, అది అణ్వాయుధాలను తయారు చేసుకోవడం మాత్రం ఆగలేదని, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ట్రంప్ మాటలు ఆ దేశాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయని సెనెటర్ డియానీ ఫీన్‌స్టిన్ అన్నారు.