డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలా అనుకునేకంటే ఒక్కసారి కలిసి అంతా క్లియర్ చేసుకోవచ్చుగా?’’ అంది సావిత్రి.
‘‘చేసుకుని?’’ ఎదురు ప్రశ్నించాను.
ఆవిడ సమాధానం ఇవ్వలేనట్లే చూచింది.
‘‘కొన్ని సమస్యలకు పరిష్కారం, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు’’ అన్నాను. ఇది కూడా ఆ కోవలోకే చెందింది అన్నాను.
సావిత్రికేం మాట్లాడాలో తెలియలేదు. ఏదైనా మాట్లాడేలోపలే డోర్ బెల్ మోగింది. మూర్తిగారయి వుంటారు.
మళ్లీ ఆ రాత్రి నా మనసు గతంలో చొచ్చుకుపోయింది. ఎంతో ప్రయత్నంమీద, ఎన్నోసార్లు నన్ను నేను కోప్పడి నా మనసును సమాధానపరచుకుని ఏ లోటూ బయటకు కనపడకుండా గడుపుతాను. కానీ ఏదో ఒక మాట, ఎవరో చూపాలనుకునే సానుభూతి, ఒకప్రశంస, కొత్త కామెంట్ నా మనసును వెనక్కు తీసుకువెడుతుంది.
మూర్తిగారు మామూలుగా భార్య ముందు తన భావం వెలిబుచ్చి ఉండరు. సావిత్రి కేవలం నాకు ఒక పొగడ్తగా చెప్పాలనిపించి ఉండచ్చు.
వాళ్ళిద్దరూ ఆ మాటలు ఎప్పుడో మరిచిపోయి కూడా ఉండచ్చు.
కానీ నా మనసు మీద ఆ ప్రభావం చాలాసేపు ఉంటుంది. నిద్ర రాని కళ్ళు శూన్యంలోకి చూస్తూనే ఉంటాయి. ఆఖరిసారిగా ఎయిర్‌పోర్ట్‌లో నా కళ్ళల్లోకి చూసిన రఘు చూపు కనిపిస్తూనే ఉంటుంది.
చిత్రం! తరువాత, తరువాత రఘు ఫొటోస్ చాలాసార్లు న్యూస్‌పేపర్స్‌లోనూ, మ్యాగజైన్స్‌లోనూ చూశాను. కానీ నాకు ఎప్పుడయినా మనసులోకి రఘు ఆలోచన వస్తే మాత్రం నేను ప్రత్యక్షంగా కలసిన వ్యక్తి మాత్రమే!
ఇనే్నళ్ల తరువాత మనసు ఇలా స్పందిస్తూ ఉంటే నా మనసులో ఇంకా అతనిమీద ఏమైనా భావన మిగిలి ఉందా అని ప్రశ్నించుకోబోయాను.
‘‘లేదు! ఎటువంటి భావనా లేదు. ఒకప్పుడు ప్రేమ ఉందనుకున్నాను. తరువాత కోపం ఉందనుకున్నాను. తరువాత ఆశాభంగం, నిరాశ.
ఇప్పుడు అవేవీ లేవు. ఇది కేవలం బలంగా దెబ్బ తగిలిన గాయపు మచ్చ. దెబ్బ తగిలిన చోట గాయం మానిపోయాక సున్నితంగా మారి, ఎప్పుడు ముట్టుకున్నా సెన్సిటివ్‌గా అన్పిస్తుంది. ఇది కేవలం అలాటిదే! బాధ మిగిల్చిన మచ్చ.
తెల్లవారింది..
అన్నీ సర్దుకుని టాక్సీకోసం ఎదురుచూస్తున్నాం. వౌళి నా సూటుకేసు తెచ్చి తలుపు దగ్గర ఉంచాడు.
పెళ్లి సామానంతా ఖర్చయితే హాయిగా, లైట్‌గా తిరుగు ప్రయాణం చేస్తానననుకున్నాను. మీరు మళ్లీ నా పెట్టెలు యథాస్థితికి తెచ్చేశారు అన్నాను సావిత్రితో. ఆవిడ పొటో ఆల్బమ్స్, ఇంట్లో అందరికీ బట్టలు, బహుమతులు చాలా తీసుకువచ్చింది.
‘ఊప్స్!’ అంటూ చటుక్కున లేచింది వౌళి పక్కన కూర్చున్న తేజ. అందరూ ఏమిటా అన్నట్లు తేజా వంకే చూచారు.
మాట్లాడకుండా గబగబా లోపలకు వెళ్లి చక్కని రంగు కాగితంలో చుట్టిన ఓ చిన్న పెట్టె తెచ్చి నాకు ఇచ్చింది.అత్తయ్యా! ఇది ‘గోయింగ్ అవే గిఫ్ట్ ఫర్ యు’ అంటూ నా చేతిలో పెట్టింది.
అందుకుంటూ ‘మళ్లీనా? ఇప్పటివరకూ గిప్ట్స్ ఇస్తూనే’ ఉన్నారు అంటూ వౌళి వంక చూచాను.
తనకేం తెలియదన్నట్లు భుజాలు కదిలించాడు వౌళి.సావిత్రి, మూర్తిగారు, ఇద్దరూ కుతూహలంగా చూచారు.
‘‘ విప్పి చూడమంటావా?’’ అన్నాను.
‘‘విప్పి చూడండి. మీరు ఊహించలేరు’’ అంది తేజా.వౌళికి కాస్త పౌరుషం అనిపించింది.
‘‘ఏదీ నన్ను చూడనీ’’ అంటూ నా చేతిలోంచి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూచి ‘వాచ్’ అయి ఉంటుంది అన్నాడు.
‘‘నేను చెప్పాను కదా! ఊహించలేరని’’ అంది.
వౌళి చేతిలోంచి బాక్స్ తీసుకుని పైన రంగుల కాగితం విప్పి పెట్టె మూత తెరిచాను. లోపల ఓ కాఫీ మగ్ ఉంది. ఎక్కడ పగులుతుందో అన్నట్లు చాలా జాగత్తగా పైకి తీశాను.
దాన్ని చేతిలో పట్టుకు చూస్తున్న నా కళ్ళు విస్పారితమయ్యాయి ఆశ్చర్యంతో.
తెల్లటి పెద్ద సైజు కాఫీ మగ్. దానిమీద ఒక చక్కని ఫొటో. చేతిలో కప్‌తో వౌళి కాఫీ తాగుతున్న ఫొటో. దాని వంకే చూస్తూ ఉండిపోయాను.
‘‘ప్రతిరోజూ మీ మార్నింగ్ కాఫీ వౌళితో కూర్చుని తాగుతారు కదా! రేపు ఇండియా వెళ్లిపోయాక ఈ మగ్‌లో తాగండి. మీరు మీ వౌళిని మిస్ కాకుండా మీతోపాటు వౌళి కూడా ఉంటాడు అంది ఎంత చక్కని ఆలోచన! అభినందిస్తున్నట్లు తేజ వంక చూచాను. ‘యు ఆల్ రైట్’ నేను ఊహించగలిగేదాన్ని కాదు. థాంక్ యు అన్నాను.
వౌళి వంక చూచాను. వాడి కళ్ళల్లో కూడా తన భార్యమీద అడ్మిరేషన్ తొంగి చూస్తోంది. సావిత్రి, మూర్తిగారు కూతురి వంక చాలా సంతోషంగా చూచారు. తన వంకే చూస్తున్న వౌళిని చూస్తూ వెనకగా పట్టుకున్న రెండో చేతిలో ఉన్న మరో బాక్స్ తీసి వౌళికి ఇచ్చింది.
‘‘ఇది నీకు. మీ అమ్మ వెళ్లిపోతోందని ‘బుజ్జి బెంగపడకుండా’ అంది బుజ్జి అన్న పదాన్ని నొక్కిపలుకుతూ! ఎప్పుడో ఒకసారి మా అమ్మమ్మ నన్ను బుజ్జి అని పిలుస్తుందని చెప్పాడట వౌళి. అప్పటినంచి తేజ ఆట పట్టిస్తూనే ఉంటుంది ఆరు అడుగుల బుజ్జి అని.
నవ్వుతూ అందుకుని విప్పి చూచాడు. మళ్లీ మరో మగ్. అయితే ఈసారి కాఫీ తాగుతున్న నా ఫొటో. ఎప్పుడు ఈ ఫొటోస్ తీసిందో కూడా మా ఇద్దరికీ తెలియదు. అందుకే అంటారేమో! బహుమతికి ముఖ్యం విలువ కాదు దాని వెనుక ఉన్న ఆలోచన అని. థాంక్ యు హనీ అన్నాడు వౌళి ఆ మగ్‌నే పరీక్షిస్తూనే.
క్రిందనుండి టాక్సీ వచ్చినట్లు మెసేజ్ వచ్చింది. మూర్తిగారు, సావిత్రి సామానుతో టాక్సీ దగ్గరకు వెళ్లారు. తేజ హ్యండ్ బాగ్ తెచ్చుకోవడానికి లోపలకు వెళ్లింది. తన వెనుకే వౌళి కూడా వెళ్లాడు.
నేను చివరిసారిగా ఏమైనా మర్చిపోయానేమో అని చూసుకుంటున్నాను.
లోపలనుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘్థంక్ యు తేజా!’ అన్నాడు వౌళి చాలా నెమ్మదిగా ఫర్ మేకింగ్ మై మామ్ సో హాపీ!
‘‘యు డోంట్ నీడ్ టు థాంక్ మి ఫర్ దిస్.. యు సిల్లీ!’’ అంది తేజ!
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి