కర్నూల్

మంత్రాలయంలో వైభవంగా ఉత్తరారాధన మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం: తుంగాతీరవాస శ్రీరామ భక్తా నమోరాఘవేంద్రా.. జయహో శ్రీ రాఘవేంద్రా.. అంటూ శతకోటి భక్తజన నీరాజనాల మధ్య శ్రీ రాఘవరాయల ప్రతిరూపమైన శ్రీ ప్రహ్లాదరాయల మహారథోత్సవం వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. 346వ సప్తరాత్రోత్సవాలు సందర్భంగా ఏడురోజులు పాటు జరుగు ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గరువారం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉత్తరారాధన వేడుకలు మహోత్సవం వేడుకలు రమణీయంగా నిర్వహించారు. వసంతోత్సవం పురస్కరించుకుని రంగులను జల్లుకుంటూ ఆనందకేళిలో శ్రీ ప్రహ్లాదరాయలకు ప్రత్యేక అలంకరణ చేసి మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం శ్రీమఠంలో పీఠాధిపతి శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి మహామంగళ హారతి ఇచ్చారు. ఉత్సవ మూర్తి శ్రీప్రహ్లాదరాయలను మహారథోత్సవంపై అధిష్టించి ప్రత్యేక హారతి ఇచ్చారు. అనంతరం అశే భక్తుల భజనలు, కీర్తనలు, కోలాటాలు, నృత్యాలు, విన్యాసాలు, కళాకారుల సంగీతనలు, మృదంగాలు, మేళతాళాలు, మంగళ వాయిధ్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా పురవీధుల్లో ఊరేగించారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టిడిపి నియోజక వర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి మహారథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి విద్వాన్ రాజా ఎస్ గిరియాచార్యులు, ఎకె సుయమీంద్రాచార్, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక అధికారి శ్రీపతాచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ఇంజినీర్ సురేష్ కోణాపూర్, ద్వారపాలక అనంతాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందు మాదవాచార్, కుర్డి జయతీర్థాచార్, తదితర ప్రముఖులు, పండితులు, విధ్వాంసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పంద్రాగస్టున జెండా ఎగరేసేది కెఇనే..
* ప్రభుత్వం తాజా ఉత్తర్వు..
ఆంధ్రభూమిబ్యూరో
కర్నూలు: ఆగస్టు 15వ తేదీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి కర్నూలులో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని గురువారం ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఆయా జిల్లాల్లోని సీనియర్ మంత్రులు పంద్రాగస్టున జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. తాజాగా ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని జీఓ జారీ చేయడంతో కర్నూలులో ఆ గౌరవం ఇన్‌చార్జి మంత్రి అయిన కాలవ శ్రీనివాసులుకు దక్కింది. అయితే ప్రభుత్వంలోనే సీనియర్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్న కెఇ కృష్ణమూర్తికి ఆ గౌరవాన్ని దూరం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కెఇ కృష్ణమూర్తి ఏ జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిగా లేకపోవడంతో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా కర్నూలులో ఇన్‌చార్జి మంత్రి స్థానంలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి జెండాను ఆవిష్కరిస్తారని ఆదేశాల్లో పేర్కొంది.
ప్రచారంలో ఏమాత్రం తగ్గని ఆవేశం..
* మొన్న కాల్చమన్నాడు.. * నేడు ఉరి తీయమన్నాడు.. * మళ్లీ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి జనాన్ని చూస్తే ఆవేశానికి గురవుతారని మరోమారు రుజువైంది. ఆ పార్టీకి మంచి పట్టు ఉన్న నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన రోడ్ షోకు వచ్చిన ప్రజలను చూసి జగన్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నంద్యాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో హామీలు నెరవేర్చని చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా ఫర్వాలేదని పేర్కొన్న జగన్ గురువారం కాస్త మార్చి ఉరి తీసినా ఫర్వాలేదంటూ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఆచితూచి మాట్లాడిన జగన్ రెండవ రోజు గోస్పాడు మండలంలో పలు దఫాలు ఆవేశానికి లోనయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబును ‘అబద్దాల కోరు, మోసాల గని’ అని ఆరోపించిన జగన్ సాయంత్రం దీబగుంట్లలో బాణీ మార్చారు. మూడేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అబద్దాలతో కాలం గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉరి తీసినా ఫర్వాలేదని పేర్కొనడం గమనార్హం. నంద్యాల సభలో కాల్చివేసినా పర్వాలేదన్న మాటలపై ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చిన జగన్ ఆ అంశం సద్దుమణగక ముందే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టిడిపి శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది.
ఐదేళ్లలో మఠాన్ని అధునాతనంగా తీర్చుదిద్దుతా..
* పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు
మంత్రాలయం: మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠాన్ని అయిదు సంవత్సరాల్లో అధునాతన రీతిలో తీర్చి దిద్దుతానని మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు అన్నారు. 346వ సప్తరాత్రోత్సవాల సందర్భంగా గురువారం ఉత్తరారాధన వేడుకుల్లో మహారథోత్సవం పురస్కరించుకుని పీఠాధిపతి ప్రసింగించారు. భక్తుల సహకారంతోనే ఇంతవరకు మఠం అభివృద్ధి చేయగలిగామని, వారికి శ్రీ రాఘవేంద్రస్వామి కృపాకటాక్షాలు ఎల్లపుడూ ఉంటాయన్నారు. మంత్రాలయ క్షేత్రం దినదినాభి వృద్ధి చెందుతూ దేశ విదేశాల్లో ప్రసిద్ధి గాంచిందన్నారు. చెంతనే ఉన్న తుంగభద్ర నదిలో నీరు లేకున్నా, నీటి కష్టాలను సైతం లెక్క చేయకుండా భక్తులు తండోపదండాలుగా తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొనటం జరిగిందన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులకు కష్టాలు దరి చేరవని తెలిపారు.
వైఎస్‌ఆర్ హయాంలో రెండు పంటలకు సాగునీరు
* చంద్రబాబు పాలనలో ఒక్క పంటకు కూడా నీరులేదు
* వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
నంద్యాల రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రెండు పంటలకు సాగునీరు ఇచ్చిన ఘనత తన తండ్రికే దక్కిందని, ప్రస్తుతం చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు కూడా నీరిచ్చే పరిస్థితిలో లేరని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల మండలంలోని చాబోలు, టెక్కె, గోస్పాడు మండలంలోని సాంబవరం, దీబగుంట్ల, నాగులవరం, నెహ్రూనగర్, జిల్లెల్ల గ్రామాల్లో సాయంత్రం వరకు ఉప ఎన్నిక ప్రచారంలో జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రలోభాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. సిఎం మోసాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ధర్మం, న్యాయానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీలో ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అక్కా చెల్లెళ్ళను, రైతులను, నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్టుమిషన్లను, ట్రాక్టర్లను ఆశచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. 8 సంవత్సరాల క్రితం రాజశేఖర్‌రెడ్డి మృతి చెందినా కూడా ఆయన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. అలాంటి దేవుళ్ళ కోసం అందుబాటులో ఉండి వారి కోసం కృషి చేస్తానన్నారు. జగన్ మోసం చేయడని ప్రతిపని చెప్పి చేస్తాడని, విశ్వసనీయతోనే ముందుకు వెళ్తునానన్నారు. అధికారం కోసం దిగజారిపోయి మోసాలు చేస్తున్న ప్రభుత్వం దారుణంగా పరిపాలన చేస్తుందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాక చిన్నపాటి నాయకులను కూడా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చోటా నాయకులను బెదిరిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించక నట్టేట ముంచుతున్న ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. అసమర్థ టిడిపి పాలనకు ప్రజలు నంద్యాల ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. వైఎస్‌ఆర్ ప్లీనరీలో నవరత్నాల పథకాలు ప్రతిపాదించడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి పథకాలు అందజేస్తామని అన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఆలోచించి వైఎస్‌ఆర్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఈయన వెంట నంద్యాల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ ఎంపిపి రాజశేఖర్‌రెడ్డి, గోస్పాడు ఎంపిపి నాగేశ్వరమ్మ, డాక్టర్ రాకేశ్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, చాబోలు నాయకులు సొసైటీ చైర్మన్ గుర్రప్ప, సర్పంచ్ బాలహుశేని, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు హత్యకు జగన్ కుట్ర!
* అదనపు భద్రత కల్పించాలి.. * మంత్రి అఖిలప్రియ..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యకు వైకాపా అధినేత జగన్ కుట్ర పన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. మంత్రి అఖిల గురువారం ఆంధ్రభూమి ప్రతినిధితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జీవించి ఉన్నంత కాలం తనకు ముఖ్యమంత్రి పదవి దక్కదన్న నిర్ణయానికి వచ్చిన వైకాపా అధినేత జగన్ ఎలాగైనా పీఠమెక్కాలన్న దురుద్దేశ్యంతో చంద్రబాబు హత్యకు పథకం రచిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నంద్యాల బహిరంగ సభలో కాల్చి చంపినా ఫర్వాలేదని మాట్లాడిన ఆయనను ఎన్నికల కమిషన్ వివరణ కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతుండగానే మళ్లీ దీబగుంట్లలో ఉరి వేయాలంటూ మాట్లాడటం చూస్తుంటే జగన్ పదవి కోసం ఉన్మాదిగా మారాడని తెలుస్తుందన్నారు. తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని భావిస్తున్న జగన్ ప్రశాంతమైన నంద్యాలలో చిచ్చు రేపుతున్నారని అఖిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో విజయం దక్కదని తేలిపోవడంతో అశాంతిని ప్రేరేపించడానికి జగన్ ఇక్కడే తిష్ట వేశారని అభిప్రాయపడ్డారు. జగన్ మాటల తీరుపై మరోమారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తీరు కారణంగా శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి అఖిలప్రియ వెల్లడించారు.
టిడిపి, వైకాపా దొందూ దొందే..
* కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి.. * పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
నంద్యాల రూరల్: టిడిపి, వైకాపాలు దొందూ దొందేనని, ప్రజలకు మాయమాటలు చెప్పి ఓటర్లను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేస్తే ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రెండు పార్టీలకు నంద్యా ల నియోజకవర్గ ప్రజలు గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆళ్ళగడ్డ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చాకలిపుల్లయ్య, శీలం ఓబులేసు, దాసరి చింతలయ్యలు అన్నారు. గురువారం గోస్పాడు మండలం నుంచి యాళ్లూ రు వరకు ర్యాలీగా పాదయాత్ర చేశా రు. నంద్యాల నియోజకవర్గ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌ను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి, కోట్ల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్హులైన పేదలందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. టిడిపి ప్రభుత్వంలో పేదలకు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసే కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. క్విట్ నంద్యాల.. క్విట్ ఎపి అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పించాలని ముందుండి పోరాటం చేసిందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే టిడిపి, వైకాపాలతో ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ప్రత్యేక హోదా... రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు. అదే విధంగా నంద్యాల మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌ను గెలిపించాలని అనంతపురంకు చెందిన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో దాదాగాంధీ, ప్రతాపరెడ్డి, పవన్, సందీప్, రామాంజనేయులు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఉపఎన్నిక పోలింగ్‌పై రాజకీయ పార్టీలకు అవగాహన
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు:నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ప్రక్రియలో ఇవిఎంలతో పాటు వివిపిఎటిపై కూడా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవన్‌లో గురువారం ఈవిఎంల మొదటి ర్యాండమజేషన్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల వ్య య పరిశీలకులు మాకాంబికేయన్, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఉపఎన్నిక పోలింగ్‌లో మొదటిసారిగా ఈవిఎంలతో పాటు సిస్టంలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి పై తొలుత రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో అభ్యర్థికి ఓటు వేయాల్సిన బటన్ నొక్కితే అందుకు సంబంధించి చిహ్నం బాక్స్‌లో పడిపోతుందన్నారు. ఒకవేళ ఓటరు అవగాహనారాహిత్యం తో ఒక దానికి బదులు మరొక బటన్ నొక్కితే సంబంధిత ఓటరు నుంచి ఫారం-17లో ఫిర్యాదు తీసుకుని పరిశీలించి ఓటింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే ఎన్నికల నిబంధన ప్రకారం మొదట వేసింది కరెక్ట్ అయినట్లు తేలితే సంబంధిత ఓటరుపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. రెండవ దఫా ఈవిఎంల ర్యాండమజేషన్ ఈ నెల 12వ తేదీ నం ద్యాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, సంబంధిత గుర్తులతో సహా అవగాహ న కల్పిస్తామన్నారు. జెసి ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి ప్రజలకు ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే ఏర్పా టు చేసిన 5 మోడల్ పోలింగ్ కేంద్రా ల్లో కూఆ ఈవిఎంల ద్వారా ఓటింగ్ వేసే విధానంపై అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులైన ఓటర్లు ఒకదానికి బదులు మరొక దానికి ఓటు వేసి పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కల్గించకుండా సంబంధిత ఏర్పాట్లు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి తోట కృష్ణారెడ్డి కలెక్టర్‌కు నివేదించారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, టిడిపి ప్రతినిధి నాగేశ్వరయాదవ్, సిపిఎం, బిఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల బంద్ విజయవంతం
* అర్ధనగ్నంగా విద్యార్థుల నిరసన ర్యాలీ
కర్నూలుసిటీ:రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. తొలుత ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యూ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములుగౌడ్, రంగన్న, రాజేష్, ఓంకార్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు అర్ధనగ్నంగా స్థానిక సిపిఐ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందటమే కాకుండా రోజుకొక కొత్త సమస్యను సృష్టించడంలో ముందుందన్నారు. గత మూడేళ్లుగా స్కాలర్‌షిప్ పెండింగ్‌లో ఉంచుతూ అరకొర నిధులు విడుదల చేయడంతో నిరుపేదల ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ముఖ్యంగా ఉన్న యూనివర్శిటీలను అభివృద్ధి చేయకుండా విదేశీ వర్శిటీలను దేశంలోకి ఆహ్వానించడం బాధాకరమన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ చట్టం-2017ను తీసుకొచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి తెరలేపిందని, దీంతో ఫీజుల దోపిడీకి మార్గం సులువైందని మండిపడ్డారు. ఎత్తివేసిన డిటెన్షన్ విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసే అవకాశం ఉందని, కావున వెంటనే డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా సంక్షేమ వసతి గృహాల్లో మెస్ చార్జీలు పెంచకుండా విద్యార్థుల కడుపు మాడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం విద్యా సమస్యలపై స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యూ నాయకులు సోమన్న, ప్రతాప్, భరత్, పుల్లయ్య, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్రలో భారీ మొసలి లభ్యం
సి.బెళగల్ : మండల పరిధిలోని సంగాల గ్రామం సమీపంలో గురువారం తుంగభద్ర నది ఒడ్డున స్థానికులకు భారీ మొసలి కంటపడింది. మొసలిని చూసిన గ్రామస్థులు ఒడ్డుకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మొసలిని వారికి అప్పగించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తుంగభద్ర నదిలో నీరు అడుగంటిపోవడంతో నీటి మడుగుల్లో ఉన్న మొసళ్లు బయటకు వస్తున్నాయన్నారు.
ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్ద ఊట నీటితో ట్రయల్ రన్
నందికొట్కూరు:పగిడ్యాల మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామ సమీపంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద గురువారం అధికారులు ఊట నీటితో ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రాజెక్టులో నీరు లేనప్పటికీ పంపులను పరిశీలించేందుకు ఎత్తిపోతల వద్ద నిల్వ ఉన్న ఊట నీటిని రెండు పంపుల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీరు అందించేందుకు 12 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో 2 పంపులకు మోటార్లను అమర్చి ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్న్‌న్రు హంద్రీనీవా ఎస్‌ఇ నారాయణస్వామి, డిఈ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలాఖరు లోగా హంద్రీనీవాకు కేటాయించిన 12 పంపుల్లో 6 పంపులకు మోటార్లు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 810 అడుగులకు చేరుకోగానే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు, కెసి కాలువకు కృష్ణా జలాలు విడుదల చేస్తామని తెలిపారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
* 12న రౌండ్‌టేబుల్ సమావేశం:ఏపిఎల్‌ఎ
కర్నూలు ఓల్డ్‌సిటీ:శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపి న్యాయవాదుల సంఘం(ఏపిఎల్‌ఎ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఓంకార్, రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘కర్నూలులో హైకోర్టు ఏర్పాటు’ను కోరుతూ ఈ నెల 12వ తేదీ నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను గురువారం ఏపిఎల్‌ఎ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న యునైటెడ్ క్లబ్ ఆడిటోరియంలోని సమావేశ మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, కార్మికులు. వ్యాపారులు, విద్యార్థులు, యువత పాల్గొంటారని తెలిపారు. కావున బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు ఆ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానకార్డులు అందజేశారు.