ఖమ్మం

ఖమ్మం కేంద్రంగా గంజాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: డ్రగ్స్... ఈ పదం తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ప్రతినోట నానుతున్నది. హైదరాబాద్‌లో ఈ పదం సంచలనం కలిగిస్తుంటే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో గంజాయి అనే పదం అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. మత్తుమందులకు అలవాటు పడిన అనేక మంది దీనికోసం అత్యధికంగా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలో డ్రగ్స్, ఖమ్మం స్థాయిలో గంజాయి గుప్పుమంటోంది. చిన్న చిన్న సిగరేట్ దుకాణాల నుంచి కొన్ని విద్యాలయాల సమీపంలో కూడా దీని వాసన తెలుస్తోంది. రైళ్ళు, బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంకు గంజాయిని తరలిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం ఎదురుచూశాయి. ప్రశాంత నగరంగా పేరొందిన ఖమ్మంలో గంజాయి పట్టుబడుతుండటం చూసి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో మూడుసార్లు, బస్టాండ్‌లో ఒకసారి, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమార్లు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న గంజాయి ప్రత్యేక అడ్డాల ద్వారా వినియోగదారులకు చేరుతోంది. ఖమ్మం బైపాస్‌రోడ్డు సమీపంలోని ఓ నిర్జన ప్రదేశంలో లారీలు ఎక్కువగా ఆగుతుండగా అక్కడే దీని అడ్డాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం నగరానికి బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక విద్యనభ్యసించేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా దీనిపై మోజు చూపిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గంజాయిని అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినప్పటికీ గంజాయి మాఫియా దానిని తిప్పికొట్టేలా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. సాయంత్రం సమయంలో ఖమ్మం నగరానికి సమీపంలోని ప్రాంతాల్లో లారీలను నిలిపి అక్కడే విక్రయిస్తున్నారు. ఉదయం సమయంలో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. మరి కొంతమంది రైలు ఎక్కి గంజాయి అమ్మేవారి నుంచి తీసుకొని తరువాత స్టేషన్లో దిగి తిరిగి మరో ట్రైన్లో ఖమ్మంకు వస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు కేంద్రాల్లో కూడా దీని వినియోగం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో పోలీసుల కన్నుకప్పి దీనిని వినియోగదారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం నిషేదించిన గుట్కా ప్యాకెట్లను కూడా విరివిగా అమ్ముతున్నారు. పోలీసుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నదని, అందుకే స్పందించడంలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పైస్థాయి అధికారులు దీనిని నిరోధించేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది అమ్మకందారులతో లాలూచీ పడుతుండటం వల్లే విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇన్‌ఛార్జిల పాలనలో కుంటుపడుతున్న విద్యా వ్యవస్థ
* కొత్త మండలాల దరిచేరని ఎంఈవో పోస్టులు
* మధ్యాహ్న భోజన పర్యవేక్షణకు ఇబ్బందులు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఇన్‌ఛార్జిల పాలనలోనే కొనసాగుతున్నాయి.ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ముందుకు సాగటంలేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా విద్య పరంగా విడిపోని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 17 మండలాల్లో మండల విద్యాశాఖాధికారులు పూర్తి స్థాయిలో లేకపోవటం వలన ఇన్‌ఛార్జిల పాలన సాగుతోంది. పలు మండలాల్లో విద్యార్ధులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు పంపిణీ జరుగలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1297 ప్రభుత్వ పాఠశాలలుండగా, 1,07,159 మంది విద్యార్ధులు విద్యనభ్యశిస్తున్నారు. పాఠశాలల్లో విద్యాబోధనకు 3864 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా నేటికీ పాఠ్య పుస్తకాలు అందకపోటంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోతుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులే మండల విద్యాశాఖ అధికారులుగా అదనపు బాధ్యతలు స్వీకరించటం వలన ఉపాధ్యాయుల హాజరుశాతం తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇన్‌ఛార్జి ఎంఈవోలకు పూర్తి స్థాయి అధికారాలు లేకపోవటంతో పర్యవేక్షణ భారంగా మారుతోంది. దీంతో మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల పనితీరు అస్తవ్యస్తంగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు రాయటం, చదవటం, గణిత భావనను మెరుగు పరచేందుకు ఉపాధ్యాయులకు లక్షలాది రూపాయిలు వెచ్చించి శిక్షణా తరగుతులు నిర్వహించినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి లేకుండా పోతుంది. ఆగస్టు 1 నుంచి 60 రోజుల పాటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. విద్యార్ధులను రెండు విభాగాలుగా విభజించి రాయడం, చదవటం, గణిత భావన అంశాలపై తర్ఫీదు నివ్వటం, వెనుకబడిన విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఈ పథకంపై పర్యవేక్షణ కరువవటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచేందుకు పూర్తి స్థాయి మండల విద్యాశాఖాధికారుల పోస్టులను భర్తీ చేయాలని విద్యావంతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నేరెళ్ళ సంఘటనలో కెటిఆర్ ప్రకటనపై కెసిఆర్ సమాధానం చెప్పాలి
ఖమ్మం(కల్చరల్): నేరెళ్ళ సంఘటనపై ఆలస్యంగానైనా పరామర్శించిన మంత్రి కెటిఆర్ పోలీసులు తొందరపడ్డారని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన దానిపై కెసిఆర్ సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. శుక్రవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటి సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇదే నేరెళ్ళ ఘటనపై ముందుగా స్పందించిన కెసిఆర్ పోలీసుల తప్పేమీలేదని, నేరం చేసిన రౌడీలను ముద్దుపెట్టుకుంటారా ? నేరగాళ్ళు, గుండాలను సమర్ధిస్తారా ? అని ప్రతిపక్షాలపై అవాకులు, చావాకులు పేలిన ముఖ్యమంత్రి తన కొడుకు చేసిన ప్రకటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటిదాక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు చేసినఆందోళన సరైందని కెటిఆర్ ప్రకటన రుజువుచేసిందన్నారు. స్ధాయి మరిచి నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు, ముఖ్యంగా బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎస్‌ఐని సస్పెండ్ చేసి, చేసిన పాపం నుండి ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. దీని వెనుక ఉన్న ఇసుక మాఫియాను వారిని కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేం టూరిస్టులం కాదని, బహూదూరపు టూరిస్టుల్లా ఆలస్యంగా వచ్చింది కెటిఆర్ నని చమత్కరించారు. నేరెళ్ళ ఘటన కెటిఆర్ ప్రోత్సాహంతోనే జరిగిందన్నారు. ప్రజల ప్రాణాల కంటే వారిని చంపిన లారీలే కెటిఆర్, కెసిఆర్‌లకు ముఖ్యమా అని ప్రశ్నించారు. నేరెళ్ళ ఘటనకు బాధ్యత వహించి కెటిఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ రైతుల రుణాలన్నీ మాఫీచేయాలని, రైతుల పంటల పెట్టుబడి ఖర్చులపై 50 శాతం కలిపి ధరను కల్పించాలని కేంద్ర కమిటి ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, నున్నా నాగేశ్వరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్ పాల్గాన్నారు.
వ్యవసాయ మార్కెట్‌లో నూతన విధానాలకు శ్రీకారం
* గేటు ఎంట్రీ నుండే నిఘా
* కులవృత్తులను కాపాడేందుకు కృషి
* మార్కెట్ చైర్మన్ కృష్ణ
ఖమ్మం(గాంధీచౌక్): ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నూతన విధానాలకు శ్రీకారం చుట్టనున్నట్లు, మార్కెట్‌కు వచ్చిన పంటలపై గేటు ఎంట్రీ నుండే పూర్తి స్థాయిలో నిఘా పెట్టనున్నట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయమార్కెట్ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయమార్కెట్‌లో పూర్తి స్థాయిలో అమలు చేయనున్న ఆన్‌లైన్ విధానంతో పాటు మార్కెట్‌లో పనిచేస్తున్న గుమస్తాలు, స్వీపర్లు, కమీషన్ ఏజెంట్‌లతో పాటు అన్ని రకాల సిబ్బందికి ఐడి కార్డు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం మార్కెట్ దడవాయిలు వరంగల్ మార్కెట్‌లో నేర్చుకున్న ఆన్‌లైన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్లూటూత్ ద్వారా కాంటాలను అనుసంధానం చేసి కాంటా విషయంలో ఖచ్చితమైన వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మార్కెట్‌లోని పత్తి మార్కెట్‌యార్డును సిసిఐకు అప్పగించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 15వతేది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐను పటిష్టంగా అమలుచేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం నగరంలోని అన్ని రైతు బజార్లలలో వౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఆర్డీఒ కార్యాలయం పక్కన గల రైతు బజారుకు కేటాయించిన స్థలం ఇరుకుగా ఉండటం వల్ల దీని కోసం ఆర్డీఒ కార్యాలయ స్థలంలోని 8 అడుగుల స్థలాన్ని రైతు బజారుకు కేటాయించినట్లు ఉత్తర్వులందాయన్నారు. అలాగే మార్క్‌ఫైడ్‌కు ఇచ్చిన స్థలాలలో షెడ్‌ల నిర్మాణానికై స్థల చదును కోసం త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్కెట్‌లోని ట్రాలీ ఆటోలకు కూడా ఆన్‌లైన్ విధానాన్ని త్వరలో కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బిసిల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్రంలోని అనేక చైర్మన్ పదవులకు బిసిలను కేటాయించిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కిందాన్నారు. బిసిల కోసం పాటు పడుతున్న ప్రభుత్వంపై తెలంగాణ ప్రజా, సామాజిక, సంఘాల ఐక్య వేదిక (టిమాస్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని దొరలపాలన అని విమర్శించటం తగదన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడేందుకు కెసిఆర్ ప్రభుత్వం ఆయా వృత్తిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్నారని వెల్లడించారు.
సమస్యల వలయంలో గురుకుల విద్యాలయాలు
ఖమ్మం(కల్చరల్): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయని, సమస్యలను పరిష్కరించి అందరికి సమాన విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. ముందుగా వందలాది మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్‌లో ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ధనిక, పేద, కుల, మత, వర్గ బేధాలు నేకుండా అందరికి కెజి టు పిజి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న ప్రభుత్వం కేవలం 500 గురుకులాల ద్వారా లక్షన్నర మంది విద్యార్ధులకు పధకాన్ని అమలు చేసి మిగిలిన 60 లక్షల మందిని గాలికి వదిలేశారని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్ధులు నానా అవస్ధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పద్ధతిన భోజనవసతి కల్పించడం వలన విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలౌతుంటే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఇంటి భోజనాన్ని మరిసిస్తుందని తప్పుడు ప్రచారం చేసుకోవడం మానుకోవాలన్నారు. తక్షణమే గురుకుల, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి ఎ శరత్ మాట్లాడుతూ జిల్లాలో గురుకులాలు అనేక సమస్యల నడుమ కొనసాగుతున్నాయని, అటవీ ప్రాంతాల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎం సురేష్, నాయకులు ఆజాద్, మహిరున్నీసాబేగం, వర్ధన్, వెంకటేష్, మణికంఠ, మస్తాన్, తిరుపతిరావు, రమ, చందు, సురేష్, వినయ్, కిరణ్, అనిల్, అజయ్, చారి, కోటి తదితరులు పాల్గొన్నారు.

2005 అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలి
ఖమ్మం(జమ్మిబండ): గత ప్రభుత్వాల కంటే తెలంగాణలోప్రస్తుతం గిరిజన హక్కులు కాలరాయబడుతున్నాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పోడు భూముల్లో 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పట్టాలు ఇచ్చి, బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా మహాసభ స్ధానిక గిరిప్రసాద్ భవన్‌లో బాణోత్ బచ్చారావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిధిగా కూనంనేని పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా 35 లక్షలుండగా, జిల్లాలో వారి సంఖ్య 2 లక్షలకుపైగా ఉన్నారని తెలిపారు. గిరిజనుల్లో అనేక తెగలు, ఉప తెగలు ఉన్నాయని వారు వేరు వేరు జీవనశైలిని అనుసరిస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ ఎంతో వెనుకబాటుకు గురౌతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే గిరిజనులు తలరాతలు మారుతాయని ఆశించిన వారికి అడుగడున అన్యాయానికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పోడు భూములను సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమితో పాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్ళను మంజూరు చేయాలని కోరారు. 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాతీయిలుగా గుర్తించి వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గిరిజన కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్‌వౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎస్‌కె జానిమియా, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి అజ్మీర రామ్మూర్తినాయక్, నాయకులు బానోత్ భరత్‌నాయక్, బోడా వీరన్న పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలతోనే సాధ్యం
* ఛైల్డ్ రైట్స్ కమీషన్ సభ్యురాలు, ప్రొఫెసర్ శాంతాసిన్హా
కొత్తగూడెం: నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, విద్యార్ధుల పట్ల ఆప్యాయతలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటాయిని పద్మశ్రీ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, జాతీయ ఛైల్డ్ రైట్స్ కమీషన్ సభ్యురాలు ప్రొఫెసర్ శాంతాసిన్హా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఆమె శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకటరావును అభినందించారు. విద్యపై మక్కువ ఉన్న వ్యక్తి వెంకటరావు అని కొనియాడారు. ఆంగ్ల మాధ్యమ పాఠశాలను నెలకొల్పడం ఒక చారిత్రకమైన ఆలోచన అని అన్నారు. ప్రభుత్వం మనకు చెల్లించే జీతాలు విద్యార్ధుల గురించేనని ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధుల జీవితాలకు బంగారు బాటలు వేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు తమ పిల్లలను పంపుతున్నారని, దాని వలన ఆర్ధికపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ప్రవేటు పాఠశాలల కంటే ఎంత మాత్రం ప్రభుత్వ పాఠశాలలు తీసిపోవని, ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. కెజి నుంచి ఇంటర్ వరకు విద్యార్ధులు చదువుకునేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జిల్లా విద్యాశాఖాధికారి హయగ్రీవాచార్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ పులి గీత పాల్గొన్నారు.

రోడ్ల విస్తరణతో సత్తుపల్లి నియోజకవర్గ ఉనికికి ముప్పు తేవద్దు
*టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్
సత్తుపల్లి: రోడ్ల విస్తరణతో సత్తుపల్లి నియోజకవర్గ ఉనికికి ప్రమాదం కలిగించవద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి సూర్యాపేట నుండి అశ్వారావుపేట వరకు జరుగు విస్తరణలో సత్తుపల్లితో పాటు పెనుబల్లి, కల్లూరు, తల్లాడ పట్టణాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ప్రజల వినతులకు అనుగుణంగా బైపాస్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. ఈ విస్తరణలో భూములు కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణంలో విచారణ టాస్క్ఫోర్స్ పోలీసుల ద్వారా కాకుండా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించి అసలు దొంగలను పట్టుకోవాలన్నారు. తెలంగాణలో పరిపాలన మొత్తం హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో జరుగుతుందని, 500రోజులుగా కెసిఆర్ సచివాలయానికి రాని కారణంగా ప్రజలు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారని విమర్శించారు. కోటి ఎకరాలకు నీరిస్తామని కోటి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టులన్ని 90శాతం కాంగ్రెస్ పాలనలో పూర్తవగా కెసిఆర్ ఆ ప్రాజెక్టులకు రంగులు అద్ది ఇది నా ఘనతే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సీనియర్ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, గంగిశెట్టి ప్రసాద్, గాదె చెన్నకేశవరావు, గాయం రాంబాబు, ఇడుపులపాటి వరపర్ల అనిల్, దామాల సురేష్,దయ్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.