అదిలాబాద్

ఉపాధి అక్రమాలపై ఇక పక్కా నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు రంగం సిద్దం చేస్తోంది. ఏళ్ళ తరబడిగా దుమ్ముపట్టిన దస్త్రాలను దులిపి అక్రమాలను వెలికితీసేందుకు ప్రతి జిల్లాకు అంబుడ్స్‌మన్ కమిటీలను నియమించనుంది. జిల్లాల్లోని ఉపాధి హామీ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని వెలికితీసేందుకే విచారణలో భాగంగా అంబుడ్స్‌మన్ కమిటీలు చర్యలు చేపట్టనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనుల రికార్డులు, నిధుల చెల్లింపులో కోట్లాది రూపాయల అక్రమాలు వెలుగుచూశాయి. క్షేత్రస్థాయిలో ఫిల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్‌ను మొదలుకొని పైస్థాయి అధికారి వరకు ఉపాధి హామీ కూలీల డబ్బులు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తుండగా సుమారు వంద కోట్లు పక్కదారి పట్టిన వ్యవహారంపై న్యాయ నిపుణులతో కూడిన విచారణ కమిటీ బృందాలు జిల్లాలో పర్యటించనున్నాయి. అక్రమార్కులను వెలికితీయడమే గాక అవినీతికి చెక్‌పెడుతూ మరోవైపు పారదర్శకంగా ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. 2006 నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను పరిశీలించనున్నారు. ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సుమారు రూ.350 కోట్లతో అభివృద్ది పనులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే సామాజిక తనిఖీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై నివేదికలు సిద్దం చేశారు. ఈ ప్రక్రియలో ఎంపిడీవోలు, ఏపివోలు, ఏ ఈలు, టిఏ,ఎఫ్‌ఏ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, శ్రమ శక్తి సంఘాలు, మద్య దళారులు, మేట్లు కూడా భాగస్వాములు కానున్నారు. పలుమార్లు నోటీసులతో సరిపెట్టి వారికి మెమోలు జారీ చేస్తున్నా అవినీతి సొమ్మును రికవరీ చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఆధిపత్యం, పైరవీల కారణంగా అక్రమార్కులు విధుల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 25 మంది సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్గొన్నట్లు తేలగా వారిపై చర్యలు తీసుకొని పై అధికారులు డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి విధుల్లో చేర్చుకోవడం వివాదస్పదంగా మారింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. అదే విధంగా కంప్యూటర్ సహాయకులపై కూడా పలు అభియోగాలు వస్తుండడం గమనార్హం. ఉపాధి హామీలో అక్రమాలను నిరోదించేందుకు కూలీల ఖాతాలను ఆదార్‌తో ఆనుసంధానం చేసి నేరుగా కూలీ డబ్బులు బ్యాంకుల ద్వారా అందించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 85 శాతం ప్రక్రియ పూర్తికాగా ఆదిలాబాద్ జిల్లాలో 92 శాతం కసరత్తు పూర్తిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 246 గ్రామపంచాయతీల్లో లక్షా 55వేల 943 జాబ్‌కార్డులు ఉండగా 3లక్షల 33వేల 110 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు. అయితే అవినీతి అక్రమాలు భారీ ఎత్తున వెలుగుచూస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించేందుకు బ్యాంకుల ద్వారా ఖాతాలను అనుసంధానం చేసి నేరుగా డబ్బులు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఖాతాలు లేని వారికి జీరో బ్యాలెన్స్‌పై అకౌంట్లు తెరిచేలా ప్రణాళికలు సిద్దం చేశారు. అయితే అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు అంబుడ్స్‌మన్ కమిటీలు నాలుగు జిల్లాల్లో త్వరలోనే పర్యటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిలో గుబులు రేకెత్తిస్తోంది. అవినీతి సొమ్మును రికవరీ చేసేలా కూడా ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది.

వైభవంగా లక్ష్మీగణపతి హోమం
నిర్మల్: పట్టణ శివారులోని గండిరామన్న క్షేత్రంలోని విఘ్నేశ్వర ఆలయం ప్రాంగణంలో శుక్రవారం లక్ష్మిగణపతిహోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయిదీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో సమితి అధ్యక్షులు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, రమేష్, రవీంధర్, సాయినాథ్‌లతోపాటు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సంకటహర చతుర్ధశిని పురస్కరించుకుని ఈ హోమాన్ని నిర్వహించామన్నారు. ప్రతీనెల సంకటహర చతుర్ధశిన గణపతి హోమాన్ని నిర్వహించడం వల్ల సర్వపాపాలు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. ఆలయ పూజారులు అనురాగ్‌శర్మ, త్రిపాఠి, సందీప్‌లు ఈ హోమాన్ని నిర్వహించారు.
శివాజీ చిత్రపటానికి క్షీరాభిషేకం
కౌటాల: ఇటీవల హైదరాబాద్‌లో రామంత్‌పూర్ చౌరస్తాలో శివాజీ విగ్రహానికిచెప్పుల దండ వేసి అవమాన పరిచిన ఘటనపై ఆరెసంక్షేమ సంఘం తమ నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం ఆరె సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మండల పరిషత్ ఉపాధ్యక్షులు డుబ్బుల వెంకయ్య ఆధ్వర్యంలో చింతలమానేపల్లి మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌లో శివాజీ చిత్ర పటానికి క్షిరాభిషేకం నిర్వహించారు. ఈసందర్బంగా డుబ్బుల వెంకయ్య మాట్లాడుతూ హిందూ జాతి గర్వించే గొప్ప వ్యక్తులలో శివాజీ మహారాజు ఒక్కరని ఆయనకు ఇట్టి అవమానం జరగడం దురదృష్టకరమన్నారు. బాధ్యులను ప్రభుత్వం గుర్తించి కటినంగా శిక్షించాలని భవిష్యత్‌లో ఇలాంటిసంఘటనలు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలమానేపల్లి మండల అధ్యక్షులు భీంకారి నారాయణ, కర్జెల్లి సర్పంచ్ రాజన్న, యువజన నాయకులు నవీన్, శ్రీమన్నారాయణ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
చౌక ధరల బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా
కౌటాల: సిర్పూర్‌టిలో పౌరసరఫరాల శాఖ గిడ్డంగి నుంచి చింతలమానేపల్లి మండలం రవీంద్ర నగర్ బాబాపూర్ గ్రామాలకు ప్రజలకు అందించే చౌక ధరల బియ్యాన్ని తరలిస్తున్న భారీ శుక్రవారం ప్రమాదవశాత్తు రవీంద్ర నగర్ గ్రామంలో బోల్తా పడింది. ఏపి 15 ఎక్స్ 5499 నెంబర్ గలలారీ రవీంద్రనగర్ 1 గ్రామంలో గల అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలోని వేగ నిరోధకం వద్దకువచ్చిన తరుణంలో ఒక్క సారిగా బ్రేకులు వేయగా స్టీరింగ్ జామ్ కావడంతో అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా కొట్టిందని డ్రైవర్ నాగరాజు పేర్కొన్నారు. కాగా సుమారు 40టన్నుల బియ్యం ఒక్క సారిగా కింద పడి పోవడంతో పలు బస్తాల నుంచి బియ్యం నేలపాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్ ప్రకాశ్, ఆర్‌ఐ రమేష్ నాయక్, సమాచారం అందించగా ఆయన వీఆర్‌ఓతో కలిసి సంఘటనస్థలానికి చేరుకోని బియ్యం తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు.
విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి
తిర్యాణి: విశ్వ బ్రహాణుల కులస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగాతోడ్పాటును అందించి ఆదుకోవాలని విశ్వ బ్రహ్మాణ సంఘం తిర్యాణి మండల విశ్వ బ్రహ్మాణుల సంఘం నాయకులు నూతి చంద్రవౌలి, బాపులు పేర్కొన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ విశ్వ బ్రహ్మాణులకు చేతి నిండా పని దొరకక ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని ముట్ల పంపిణితో పాటు పావులా వడ్డీకి రుణాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, వెంకటేశం, తిరుపతి, తదితరులు ఉన్నారు.

వరుణ దేవుని కరుణకోసం యాగం
* కౌటాల కంకాలమ్మ ఆలయంలో నిర్వహణ
* వివిధ గ్రామాల నుంచి హాజరైన రైతులు, భక్తులు
కౌటాల: గత కొన్ని రోజులుగా వరుణున్ని కరుణ లేక తీవ్ర వర్షభావ పరిస్థితులు ఎదుర్కోంటున్న రైతులకు ఊరట కలిగేలా వర్షాలు కురవాలని శుక్రవారం కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ, ఆలయంలో వరుణయాగం నిర్వహించారు. కౌటాల మండల కేంద్రంలోని కంకాలమ్మ ఆలయంలో కౌటాలసర్పంచ్ బండి రమా, రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటి చైర్మన్ సులువ కనకయ్య ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని మందమర్రి, భవానీ ఆశ్రమ స్వామి సతీష్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు దంపతులు యాగంలో పాల్గొన్ని శాస్రోక్తతంగా అభిషేక పూజాలు, వరుణ దేవునికి నిర్వహించారు. దీనికి రైతులుకూడా భారీ సంఖ్యలో వచ్చి వర్షం కురవాలని ప్రార్థించుకున్నారు. ఈ సందర్బంగా అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలంలో గతంలో ఎన్నడు లేని విధంగా వర్షంకురవాలని యాగం నిర్వహించడం ఎంతో శుభ సూచకం అని భగవంతుడు ఇకనైనా కరుణించిపంటలు సమృద్దిగా పండేందుకు వర్షాలు కురిపంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు రాములు, సత్యనారాయణ గౌడ్, హరిదాస్ గౌడ్, వినాయక్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

అక్షయపాత్రకు సామాగ్రి అందజేత
నిర్మల్: పట్టణంలోని సాయిదీక్షా సేవాసమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షయపాత్రకు అవసరమైన సామాగ్రిని అందజేసిన ఓ దాత తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన వ్యాపారి సితావర్ సత్యనారాయణ అక్షయపాత్రకు అవసరమైన వంటపాత్రలను ఈమేరకు సమితి అధ్యక్షులు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈసందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదల కడుపు నింపేందుకే అక్షయపాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమం ద్వారా శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలు నివసించే ప్రాంతాలకు వెళ్లి ఆహారాన్ని పంపిణి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. మరికొందరైతే తమ పుట్టినరోజు, వివాహా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పేదల కోసమే ఆహారపదార్థాలను తయారుచేయించి అక్షయపాత్రకు అందజేయడం జరుగుతోందన్నారు. అక్షయపాత్రకు అవసరమైన సామాగ్రిని అందజేయడం పట్ల సత్యనారాయణను ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయిదీక్షాసేవా సమితి సభ్యులు పరమేశ్వర్, రాజేష్, విశాల్, నగేష్, గురుస్వామి చెనిగారపు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

హరితహారం మొక్కలకు వందశాతం జియోట్యాగింగ్ కావాలి
* జెసి శివలింగయ్య
దివ్యనగర్: హరితహారంలో నాటిన మొక్కలకు వందశాతం జియో ట్యాగింగ్ కావాలని నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిడివోలు, ఈజియస్ ఏపివోలతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన ప్రదేశాలలో ప్రభుత్వ భూముల్లో చెరువుగట్లపై ఈత, టేకు చెట్లను విరివిగా నాటాలని తెలిపారు. గ్రామపంచాయతీల వారీగా ఎంపిడివోలు సమీక్ష జరిపి గ్రామాల్లో పర్యటించి అవసరమైన మొక్కల కోసం డి ఎఫ్‌వోను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణ హరితహారంకు 3200 మంది హరిత దళాలను ఏర్పాటుచేయడం జరిగిందని, వారి సహకారంతో గ్రామాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. అలాగే హోంస్టడీ ప్లానిటేషన్ తప్పకుండా చేపట్టాలన్నారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ద్వారా 13 మండలాల్లో 12920 మొక్కలు నాటారని, అలాగే ప్రజల సహకారంతో మొక్కలు నాటాలన్నారు. అటవీ స్థలాల్లో ఖాళీగా ఉన్నచోట ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, డి ఎఫ్‌వోలు, హరిత వనాల కొరకు ప్రతిపాదనలు సిద్దంచేసి ఉంచాలని, సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల, విద్యార్థుల భాగస్వామ్యంతో విత్తనాలు నాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, ఎఫ్ ఆర్‌వో ఇదాయత్ అలీ, ఎంపిడివోలు పాల్గొన్నారు.

వందశాతం మరుగుదొడ్లు నిర్మించిన పట్టణంగా బెల్లంపల్లి
* మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రజలు వంద శాతంమరుగుదొడ్లు నిర్మించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఓ డి ఎఫ్ ద్వారా బహిరంగ మల మూత్ర విసర్జన నియంత్రణ పట్టణంగా బెల్లంపల్లిని ఎంపిక చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసి ఆర్ ఆదేశాల మేరకు వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న పట్టణంగా బెల్లంపల్లి ఎంపికైందని మున్సిపల్ కమీషనర్ మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో దాదాపు 14 వేల నివాస గృహాలు ఉన్నాయనివాటిలో వ్యక్తి గత మరుగుదొడ్లు లేని నివాస గృహాలు 1427 ఉండగా ప్రజల సహాకారంతో పూర్తి స్థాయిలో 1427 మరుగుదొడ్లునిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం వందశాతం ఓడి ఎఫ్ సాధిస్తే కోట్లాది రూపాయలనిధులు మంజూరుచేస్తామని ఆదేశించడంతో మహిళ స్వశక్తి సంఘాలు టి ఎల్ ఎఫ్, ఎస్ ఎఫ్ జి సహాకారంతో పట్టణంలో వంద శాతంమరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు.
ఇందుకు సహాకరించిన ప్రజలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేసిన పట్టణంగా బెల్లంపల్లి ఎంపికైందని ఈ మేరకు మున్సిపల్‌సమావేశంలో ఏ కగ్రీవంగా తీర్మాణించినట్లు తెలిపారు. రానున్నరోజులలో 15 కోట్ల రూపాయలు మంజూరు అవుతాయని ఆ నిధులతో బెల్లంపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ది పరుస్తానని కమీషనర్ వివరించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత
దండేపల్లి: దండేపల్లి మండలం తాళ్ళపేట గ్రామానికి చెందిన తిరుపతి, మల్లేశ్వరి, రజితలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఆకుల రాజేందర్ అందజేశారు. తిరుపతి, మల్లేశ్వరి, రజితలు అనారోగ్యంతో అసుపత్రిలో చికిత్స పోందగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 24 వేల రూపాయల చెక్కులను అందజేసినట్లు వైస్ ఎంపిపి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మ్యాడ దయాకర్, పుట్టపాక తిరుపతి, గుమ్మడి రవి, బోడకుంటి మహేష్, లక్కాకుల శేఖర్, నెనె్నల సందీప్, బానేష్, ఎర్రం సురేష్‌లు పాల్గొన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
* కడెం మండల సమావేశంలో ఎంపిపి బుక్య అమ్మి

కడెం: కడెం, దస్తురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో నెలకొని ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా కృషిచేయాలని కడెం మండల పరిషత్ అధ్యక్షురాలు బుక్య అమ్మిబాపురావు అన్నారు. శుక్రవారం కడెం మండల పరిషత్ కార్యాలయం కమ్యూనిటి భవనంలో కడెం మండల పరిషత్ అద్యక్షురాలు బుక్య అమ్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సమీక్షపై కడెం మండలం ఎ ఈవోలు నాగమణి, సురేష్‌లు మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటికే రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల పంటల సాగుకు సబ్సీడిపై విత్తనాలు కూడా సరఫరా చేశామన్నారు. వైద్య ఆరోగ్య సమీక్షపై కడెం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మానస మాట్లాడుతూ ఆసుపత్రిలో మండలంలోని పలు గ్రామాల ప్రజలకు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆమె వివరించారు. అలాగే కడెం ఆసుపత్రిలో ప్రసవాలు కూడా చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 17 నుండి 23 వరకు నిర్వహించే మిజీల్స్, రుబెల్లా వ్యాక్సీనేషన్ కార్యక్రమంలో పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. విద్యావిభాగం సమీక్షపై మండల విద్యాధికారి నేతగోపాల్ మాట్లాడుతూ కడెం దస్తురాబాద్ మండలాల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలకు, కార్మికులకు గత సంవత్సరం నవంబర్ నెలనుండి బిల్లులు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిజీల్స్, రుబెల్లా వ్యాక్సీనేషన్ కార్యక్రమం విజయవంతం కోసం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులచే ఎల్ ఈపి కార్యక్రమాన్ని రెండు నెలలపాటు నిర్వహించడం జరుగుతుందని పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధిహామీ సమీక్షపై ఇంచార్జి ఎపివో సుభాష్ మాట్లాడుతూ కడెం మండలంలో 14 పాఠశాలలకు ఈజియస్ ద్వారా వంటషెడ్ భవనాలు మంజూరైనట్లు ఆయన తెలిపారు.

సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి
* ఎంపిపి బేర సత్యనారాయణ
మంచిర్యాల అర్బన్: గ్రామ ప్రజలు సీజనల్‌వ్యాధులపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించేందుకుతగు చర్యలు తీసుకోవాలని ఎంపిపి బేర సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గడ్‌పూర్ గ్రామం బాబా నగర్‌లోని పలు వార్డులలో పర్యవేక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల బారి నుంచి బయట పడుతామన్నారు. తమ చుట్టు ఉండే పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా ఉంచడం ద్వారా ఎలాంటి రోగాలు సంభవించవు అన్నారు. వర్ష కాలంలో రోడ్లకు ఇరువైపులా నిలిచి ఉండే నీళ్లను దోమలు చేరుతాయని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ కోవ రాజుతో మాట్లాడి గ్రామంలోని ప్రతివార్డులో పరిశుభ్ర వాతవరణం కనబడేలా మొక్కలునాటాలు నాటే బాధ్యత చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి మున్సిపల్‌చైర్ పర్సన్ పసుల సునీత రాణి తెలిపారు. శుక్రవారంమున్సిపాలిటీలోని 32వ వార్డులో రూ.2 లక్షల రూపాయల నాన్ ప్లాన్ గ్రాంట్ నిధులతో సిసి రోడ్డు పనులనుప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమెమాట్లాడుతూ మున్సిపాలిటీలోని పలు వార్డులో సిసి రోడ్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. వార్డులలో పర్యటించిసమస్య పరిష్కరానికి అన్ని విదాల కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్‌లు దెబ్బటి సుజాత, లింగంపల్లి రాములు, ఎలిగేటి శ్రీనివాస్, నాయకులు మహేష్, దెబ్బటిమహేష్, ధర్మేంధర్, తదితరులు పాల్గొన్నారు.
వంద గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం
భీమిని: కనె్నపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలో జజ్జెరవెల్లి గ్రామానికి చెందిన గౌటూరీ అబ్జుల్ మోటర్ సైకిల్‌పై తరలిస్తుండగా తనిఖీలలో వంద గుడుంబా ప్యాకేట్లు పట్టుబడ్డాయి. గుడుంబా ప్యాకేట్లను ద్విచక్ర వాహానాన్ని స్వాధీనం చేసుకోని అబ్జుల్‌పై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఎస్సై వెంట పిసి లు కిషన్, సమ్మయ్యలు ఉన్నారు.

దేవరకోట ఆలయంలో వైభవంగా కుంకుమార్చన
నిర్మల్: పట్టణంలోని అత్యంత ప్రాశస్త్యం గల పురాతన శ్రీ లక్ష్మివెంకటేశ్వర ఆలయంలో శ్రావణశుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మిమాత కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్మల్‌శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటి ఛైర్మెన్ ఆమెడ కిషన్ ముఖ్య అథితిగా హాజరుకాగా ఐవి ఎఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కమలేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమెడ లావణ్య, పట్టణాధ్యక్షురాలు ఆమెడ అపర్ణ, పట్టణ ప్రధానకార్యదర్శి ఉత్తూరి భార్గవి, మహిళా యూత్‌విభాగం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 17ను విమోచన దినంగా పాటించాలి
ఆదిలాబాద్ టౌన్: సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం విమోచ దినంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మావల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా బిజెపి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జి నాంపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ గతంలో టీఆర్‌ఎస్ నాయకులు సెప్టెంబర్ 17ను విమోచనదినంగా పాటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనల చేపట్టేవారని, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ ఎదుట జాతీయ జెండాలను ఎగరవేసి నిరసన తెలిపే వారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని పార్టీలతో కుమ్మక్కై ఓట్ల కోసం విమోచన దినాన్ని విస్మరించారని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని, తెలంగాణలో మాత్రం నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. బిజెపి అధ్వర్యంలో సెప్టెంబర్ 17ను విమోచనదినంగా పాటిస్తూ జాతీయ జెండాలను ఎగరవేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో సతీష్, నాగన్న, అశోక్ పాల్గొన్నారు.
ఏసిబి కేసులో విఆర్‌వోకు నాలుగేళ్ళ జైలు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్: ఓ రైతుకు పట్టాపాసు పుస్తకం జారీ ఇచ్చేందుకు లంచం అడిగి ఏసిబి వలలో చిక్కిన విఆర్‌వో అంపల్లి రవికాంత్‌కు నాలుగేళ్ళ కఠిన కారగార శిక్ష విధిస్తూ శుక్రవారం కరీంనగర్ జిల్లా ఏసిబి ప్రత్యేక జడ్జి పి.్భస్కర్‌రావు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే తాంసి మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన చౌటపల్లి వెంకటేష్ తన వ్యవసాయ భూమికి పట్టాపాసు పుస్తకం కోసం దరఖాస్తు పెట్టుకోగా లంచం ఇస్తేనే పాసుపుస్తకం ఇస్తానని అక్కడి విఆర్‌వో అంపల్లి రవికాంత్ తేల్చిచెప్పాడు. దీంతో బాధితుడు వెంకటేష్ 2009 ఆగస్టు 21న ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేయగా, వెయ్యి రూపాయల లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తుండగా శుక్రవారం ఏసిబి ప్రత్యేక జడ్జి భాస్కర్ రావు రెండు సెక్షన్లలో వేరు వేరు అభియోగాలపై నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. ఒకవేళ జరిమాన చెల్లించని పక్షంలో మరో మూడు నెలల శిక్ష విధించాలని తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా డి ఎస్పీ పాపలాల్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వర్తించాలని, నిస్వార్థంగా పనులు చేయాలని సూచించారు. ప్రతి పనికి లంచం ఆశించి వేదిస్తే బాధితులు ఏసిబిని ఆశ్రయించాలని, లంచం తీసుకునే వారు ఎంతటివారైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి
* ఉట్నూరు డిఎస్పీ చంద్రప్రభు
ఉట్నూరు: రాబోయే వినాయక నవరాత్రులు, బక్రీద్ పండగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని ఉట్నూరు డి ఎస్పీ చంద్ర ప్రభు అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్ ప్రాంగణంలో హిందూ, ముస్లీం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పండగలు చాలా ముఖ్యమైనవని, వాటిని అన్ని వర్గాల వారు కలిసి కట్టుగా పండగలు జరుపుకోవాలన్నారు. వదంతులు నమ్మకుండా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో కొందరి వ్యక్తుల వల్ల మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని, కాని ప్రజలు పోలీసులకు సహకరించడంతో వాటిని నియంత్రించామని అన్నారు. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని అన్నారు. అనుమాన వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని అన్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఐ గణపత్, జడ్పీటీసీ జగజీవన్, బిజెపి జాతీయ నాయకులు గుగ్లావత్ శ్రీరాం నాయక్‌తో పాటు పలు మత పెద్దలు పాల్గొన్నారు.

బాసర ఆలయంలో మంత్రి సతీమణి పూజలు
బాసర: బాసర అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల సతీమణి విజయలక్ష్మి పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు సాదరస్వాగతం పలికారు. అమ్మవారి చెంత ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేసి హారతినిచ్చారు. ఆలయ ప్రత్యేకాధికారి ఎ.సుధాకర్‌రెడ్డి మంత్రి సతీమణికి ఆలయ మర్యాదలతో సత్కరించారు. వీరివెంట తెరాసా నాయకులు గంగాశ్యాం, తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహార లోపంతోనే రక్తహీనత
* ఐటిడిఏ పివో ఆర్‌వి కర్ణన్
ఉట్నూరు: ఏజెన్సీ గ్రామాల్లో పౌష్టికాహారం లోపించడం వల్లే రక్తహీనతతో గిరిజనులు బాధపడుతున్నారని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ఇంచార్జి ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడీవో సమావేశ మందిరంలో ఐసిడిఎస్, ఐకెపి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో పౌష్టికాహార కిట్లపై అవగాహన కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉట్నూరు మండలంలోని 16 గ్రామపంచాయతీ పరిధిలోని 150 గ్రామాల్లో 80 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిలో అంతర్జాతీయ ఆహార పరిశోధన సంస్థచే తయారు చేయబడిన బిస్కెట్లు, రవ్వ ఉప్మ, న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీని వల్ల రక్తహీనతతో బాధపడుతున్న వారిలో హెమోగ్లోబిన్ పెరుగుతుందని అన్నారు. గిరిజన మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందన్నారు. ఈ పౌష్టికాహారాన్ని వాడినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ ప్రాజెక్టులో లబ్దిదారుల వివరాలు సేకరించి, వాటిని ఏవిధంగా వాడుతున్నారో గమనించాలన్నారు. అదే విధంగా వ్యాధులు బారిన పడిన గ్రామాల్లో పర్యటించి, ముందస్తు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి కుమ్ర బాలు, సహాయ వైద్యాధికారి వసంత్‌రావు, ప్రత్యేక వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

భైంసా ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి
* ఆస్పత్రిలో బంధువుల ఆందోళన
భైంసా రూరల్: భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాత్రి విధుల్లో వైద్యుని నిర్లక్ష్యవంతోనే పసికందు మృతి చెందిందని శుక్రవారం కుటుంబీకులు ఆందోళన చేశారు. తానూర్ మండలంలోని కోలూర్ గ్రామానికి చెందిన నరేందర్ తన బార్యను గురువారం రాత్రి 10 గంటలకు చికిత్స కొరకు భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. రాత్రి సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న విధుల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులు చికిత్స అందించారని వెల్లడించారు. విధుల్లోని వైద్యులు రాత్రి సమయాల్లో అందుబాటులోకి లేకపోవడంతో గర్బిణీకు సకాలంలో చికిత్స అందించ లేదని వాపోయారు. ఉదయం వచ్చిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి పసికందును బయటి తిసిన ప్రాణాన్ని కాపాడలేక పోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందినట్లు అరోపిస్తు కుటుంబీకులు ఆస్పత్రిలోనే ఆందోణకు దిగారు. విషయం తెలుసుకున్న భైంసా ఎస్సై సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులను సముదాయించడానికి తనవంతుగా ప్రయత్నించారు. స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి సమస్యను అలకించిన తరువాతే ఆందోళన విరమిస్తామని తెలిపారు. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ బాధిత కుటుంబీకలతో మాట్లాడారు. సూపరింటెండెంట్ హమితో ఆందోళన విరమించారు.
* బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : వైద్యుడు కాశీనాథ్
ఆస్పత్రిలో వైద్య సేవలు సకాలంలో అందకపోవడంతోనే పసికందు మృతి చెందినట్లు తనదృష్టికి వచ్చిందని అన్నారు. పై సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడించారు.
పురుగుల మందు తాగి యువకుని మృతి
నార్నూర్: గాధిగూడ మండలంలోని లోకారిబి గ్రామానికి చెందిన మేటిపెల్లి తరుణ్ (18) అనే యువకుడు శుక్రవారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియేట్ పూర్తిచేసుకొని ఐటి ఐ చదువాలనే కోరిక ఉండగా ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు
మందమర్రి: నిషేధిత గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సి ఐరాంచందర్‌రావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమంగా మందమర్రి సర్కిల్ పరిధిలోని సోమగూడెం కాసిపేట మందమర్రి ప్రాంతాలలో నిషేధిత గుట్కాలు, అంబార్‌లు విక్రయిస్తున్న 4గురువ్యక్తులను అరెస్టు చేసి కేసునమోదు చేయడం జరిగిందని ఆయనతెలిపారు. మంచిర్యాల కు చెందినతిరుపతి అనే హోల్ సెల్ వ్యాపారి వద్దసోమగూడెంకుచెందిన శ్రీనివాస్, కాసిపేటకు చెందిన ప్రవీన్, మందమర్రి కిచెందిన బండ శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు మంచిర్యాల నుంచి కొనుగోలు చేసి అక్రమంగా ఇక్కడవ్యాపారం కొనసాగిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు వీరిషాపుల దాడులు నిర్వహించి 1లక్ష 60 వేల విలువగల గుట్కాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయనతెలిపారు.
ఈదాడిలో మందమర్రి ఎస్సైప్రదీప్‌తో పాటు సోమగూడెం ఎస్సై సతీష్, దేవపూర్ ఎస్సైస్వామిలు దాడులు నిర్వహించడంజరిగిందని ఆయనతెలిపారు. వ్యాపారస్తులు ఎవరైనా అక్రమంగా గుట్కాలు విక్రయించిన , నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

మీజిల్స్, రూబేలాకు టీకాతో నిర్మూలన
* 17న వ్యాక్సినేషన్ ప్రారంభం
* జిల్లాలో లక్షా 97 వేల మంది పిల్లలు
* 13న అవగాహన ర్యాలీ
మంచిర్యాల: పిల్లలకు ప్రాణాంతకమైన మీజిల్స్ (తగ్గు) రూబేలా (అమ్మతల్లి) వ్యాధుల సంపూర్ణ నిర్ములనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే మూడేళ్లలో సంపూర్ణంగా నిర్ములించాలని నిర్ణయించింది. మీజిల్స్ రూబేలా (ఎంఆర్) నివారణ వ్యాక్సిన్ సార్వత్రిక వ్యాధి నిరోదక టికాల జాబితాలో చేరింది. మంచిర్యాల జిల్లాలో 9 నుంచి 15 ఏళ్ల వయస్సు గలపిల్లలను సర్వే ద్వారా అధికారులు గుర్తించి వ్యాక్సినేషన్ చేయనున్నారు. జిల్లాలో 1 లక్ష 97 వేల మందిపిల్లలు ఉండగా 9నెలల నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలబాలికలు ఎం ఆర్ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అంగన్‌వాడి కేంద్రాలల్లో 9 నెలల నుంచి 15 ఏళ్ల బాల బాలికలకు వైద్య సిబ్బంది టికాలు వేస్తారు. ఈ వ్యాక్సిన్ 5 వారాల పాటు పిల్లలను గుర్తించి వేస్తారు.
సమస్యలు...
కంటికి సంబంధిత వ్యాధులు, వినికిడి సమస్యలు, బుద్ది మాంధ్యం, ఇతర సమస్యలు వస్తాయి. తల్లులకు రూబేలా సోకితే శిశువులు పుట్టుకతోనే అంగవైకల్యం, నిర్జీవ జనానాలు, సంభవిస్తాయి. రూబేలా వైరస్‌తో చిన్నారులజ్వరం వాంతులు,చర్మం, అల్లర్జీ తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధితో శిశువులకు శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువై కొన్ని సందర్బాలలో మరణాలు సంభంవించే ప్రమాదాలు లేకపోలేదు.
టికాలతో ప్రయోజనాలు ఇవి ....
అమ్మతల్లి (శరీరంపై కందిన ఎరుపు రంగు పోక్కులు), తట్టు వంటి వ్యాధులను వ్యాక్సిన్ దూరం చేస్తుంది.పుట్టిన బిడ్డలకు చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమించకుండా చేస్తుంది. ఒక వేళ గర్భిణిలు రూబేలావ్యాధికి గురైతే గర్భస్త్ర పిండానికి సోకకుండా చేస్తుంది. భవిష్యత్‌లోసంతానానికి ఇబ్బంది కలుగకుండా కౌమారంలో ఉన్న అమ్మాయిలందరికి వ్యాక్సిన్ చేయించాలి. తక్కువ నెలలతో పిల్లలు పుట్టడం, గ్రహాణం మొర్రి, గుండే జబ్బులకు నివారిస్తాయి. పిల్లలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్క సారి వ్యాక్సిన్ వేయిస్తే జీవితాంతం పని చేస్తుంది.
మీజిల్స్ లక్షణాలు....
మీజిల్స్ ప్రాణాంతకమైన వ్యాధి ఇవి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. చిన్నారులలో వైకల్యాన్ని కలిగిస్తుంది. తీవ్రమైతే ఆకాల మరణానికి దారి తీస్తుంది. శ్వాస కోశాలకు ఇన్‌ఫెక్షన్ కలిగించి బ్రాంకైటిస్ అతిసార, గురిచేస్తుంది. ప్లేట్ స్లేట్ సంఖ్య తగ్గి పిల్లలు మరణించే ప్రమాదం ఉంది. వీపరీతమైన జ్వరం, దగ్గు, శరీరం మీద దద్దుర్లు, కళ్లు ఎర్రబారుతాయి. వ్యాధి గ్రస్తులు తుమ్మిన్నప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టిరియా ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
రూబేల్లా లక్షణాలు...
ఇవి చిన