కర్నూల్

ఆర్డీఎస్‌కు వరద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని: గురువారం వరకు నీరు లేక వెలవెలబోయిన రాజోలి బండకు శుక్రవారం ఒక్కసారిగా వరద నీరు రావడంతో రాజోలి బండ ప్రాజెక్టు వరద నీటి పొంగుతూ కళకళాడింది. శుక్రవారం రాత్రి నుంచి రాజోలి బండ ఆనకట్ట వద్ద పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో తుంగభద్ర ఆనకట్ట వరద నీటితో నిండిపోయింది. ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రవహించే మూడు స్లూయిస్ గేట్లను ఎత్తి తుంగభద్ర నదికి నీటిని విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్రం వైపు ఉన్న తుంగభద్ర నదికి ఒక్కసారిగా నీరు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది. రాజోలిబండ ప్రాజెక్టు పైభాగలో ఉన్న కర్నాటక నదీతీర ప్రాంతంలో, తెలంగాణ నదీ తీర ప్రాంతంలో గత ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. తుంగభద్ర నదికి ఉప నదిగా ఉన్న ఉత్కళ అనే చిన్న వాగుకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడం వల్ల రాజోలి బండ ఆనకట్టకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆనకట్ట మొత్తం నీటితో నిండిపోయింది. అయితే ఆనకట్ట పైభాగం నుంచి నీరు ప్రవహించడం లేదు. కేవలం మూడు స్లూయిస్ గేట్లను ఎత్తివేసి తుంగభద్ర నదికి నీరును వదిలారు. 600 క్యూసెక్కుల నీరు రాజోలిబండ ఆనకట్ట వద్దకు చేరినట్లు ఆంచనా. రాజోలి బండ వద్ద ఉన్న మూడు స్లూయిస్‌గెట్లను తెరిచి నీటిని తుంగభద్ర నదిలో వదలడం వల్ల ఆ నీరు మంత్రాలయం, రాంపురం, నందవరం, నదికైరావాడి, గురుజాల నుంచి సుంకేశుల డ్యాం వరకు నీరు చేరుతుంది. తుంగభద్ర నదికి నీరు వదలడం వల్ల మంత్రాలయం పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు నీటి కొరత తీరింది. అలాగే సుంకేశుల డ్యాంకు నీరు చేరడం వల్ల కర్నూలుకు తాగునీటికి ఎంతో ఉపయోగంగా ఉటుంది. రాజోలి బండ ఆనకట్టకు నీరు చేరడంతో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నీటితో పరవళ్ళు తొక్కుతుంది.
కర్నూలు తాగునీటి అవసరాలకు రోజుకు 500 క్యూసెక్కులు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు : కర్నూలు నగర ప్రజల దాహార్తి తీర్చడానికి తుంగభద్ర జలాశయం నుంచి 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయడానికి తుంగభద్ర బోర్డు అంగీకారం తెలిపిందని కలెక్టర్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. తుంగభద్ర జలాల కోసం కలెక్టర్ బోర్డు అధికారులతో బళ్లారిలో చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదమై కర్నూలు ప్రజల తాగునీటి కోసం 500 క్యూసెక్కుల చొప్పున నీటిని శనివారం నుంచి విడుదల చేస్తామని కలెక్టర్‌కు వారు తెలిపారు. దీంతో నగర ప్రజల తాగునీటి సమస్యకు త్వరలో తెరపడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. నగరంలో తాగునీటి అవసరాలు తీర్చే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వలు నిండుకోవడం, సుంకేసుల జలాశయం అడుగంటడంతో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నీటిని సుమారు 45రోజులు వినియోగించుకున్నారు. ఇక్కడ కూడా నీటి నిల్వలు తగ్గడంతో పక్కనే ఉన్న దేవమ్మ మడుగు చెరువు నుంచి మరో 10రోజులు నీటిని నగరానికి తరలించారు. దీంతో వేసవిలో నీటి సమస్య నుంచి గట్టెక్కినా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గాజులదినె్న, సుంకేసుల జలాశయాల్లో నీరు లేకపోవడంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వలు నిండుకున్నాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో గత వారం రోజులుగా తాగునీటి సమస్య మరింత జఠిలమైంది. దీంతో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు తుంగభద్ర బోర్డు అధికారులతో కలెక్టర్ చర్చించారు. తుంగభద్ర జలాలను విడుదల చేస్తామన్న బోర్డు అధికారుల హామీతో తాగునీటి సమస్యకు త్వరలో తెరపడుతుందని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు.
మతిస్థిమితం కోల్పోయిన జగన్..
* మానసిక చికిత్స అవసరం..* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
నంద్యాల: రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయనకు మానసిక వైద్యులతో చికిత్సచేయించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులుతో కలసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ వాడుతున్న భాష అభ్యంతర కరంగా ఉందని, ఆయన మాట్లాడుతున్న భాషపై ఎన్నికల కమిషన్ సుమోటాగా స్వీకరించి నోటీసులు ఇస్తే ఏదో ఆవేధనతో మాట్లాడానని వివరణ ఇవ్వడం పట్ల జనం నవ్వుకుంటున్నారన్నారు. మనిషిని చంపి సారీ అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇటీవల నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబును కాల్చి చంపమన్నాడు జగన్. నిన్న గోస్పాడు మండలం దీబగుంట్లలో సియంను ఉరితీయాలన్నారు. అసలు ముఖ్యమంత్రిని ఎందుకు ఉరి తీయాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నందుకా, కర్నూలు ఉర్దూ విశ్వవిద్యాలయానికి 150 ఎకరాల భూమి కేటాయించినందుకా, ట్రిపుల్ ఐటి స్థాపించినందుకా అని జగన్‌ను ప్రశ్నించారు. మాటి మాటికి కర్నూలు జిల్లాలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అబద్దాలు చెబుతున్నా నీ కంటే పెద్ద అబద్దాల కోరు ఎవరున్నారని జగన్‌ను ప్రశ్నించారు. అబద్దాల కోరువైనా నీవు చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారంటే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఓవైపు తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోచి నేరస్తుడుగా కోర్టుల చుట్టు తిరుగుతున్న జగన్ పేదవాడినని, కట్టు కథలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సిబిఐ 12 కేసుల్లో మొదటి ముద్దాయిగా చేర్చి విచారణ చేస్తుందని, మరో వైపు అక్రమాస్తులపై ఈడి వెంటాడుతున్న విషయం ఎవరికి తెలియదని ప్రశ్నించారు. ఓ వైపు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ మరోవైపు ఈడి కేసుల నేపద్యంలో జగన్ మతి స్థిమితం కోల్పోయారన్నారు. ఆయనకు ప్రశాంత్ కిశోర్‌లాంటి రాజకీయ వ్యూహకర్తలు అవసరం లేదని, మంచి మానసిక వైద్యుడి చికిత్స అవసరం ఉందన్నారు. జగన్ స్నేహితులు ఎవరంటే మొద్దు శీను, మంగలి కృష్ణతోపాటు అనేక మంది నేర చరిత కలిగిన వారే అని, అలాంటి నేర చరిత్ర ఉన్న నాయకుడుకు నంద్యాల ప్రజలు ఓట్లు వేసే అవకాశమేలేదని తేల్చి చెప్పారు. నంద్యాల ఓటర్లు ఎంతో విజ్ఞులని, నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు లాంటి మేథావులను ఎన్నుకొని చట్టసభలకు పంపిన చరిత్ర నంద్యాలకు ఉందన్నారు. మాకు ఐదేళ్లపాటు పాలించడానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, వారి ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేయలేకపోతే 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారు తప్ప మాటి మాటికి అభివృద్ధి జరుగలేదని అబద్దాలు చెప్పడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులమైన మేము దివంగత భూమానాగిరెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు నంద్యాలకు వచ్చామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఓ వైపు వైకాపా నంద్యాల ఎన్నిక 2019 ఎన్నికలకు రెఫరెండం అంటుందని, మేమైతే రెఫరెండంగా భావించడం లేదన్నారు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా భూమానాగిరెడ్డి చనిపోక ముందే నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రక్రియ ప్రారంభమైందని, ఫలితంగా వందల కోట్ల నిధులతో నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. జగన్ జైలు నుండి వచ్చాడు కాబట్టే జైలు భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు అధికారం అనుభవించిన శిల్పామోహన్‌రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి పుట్టగతులుండవని అన్నారు.
రాజకీయ వ్యవస్థలో మార్పు నంద్యాల నుంచే ప్రారంభం
* ఉపఎన్నిక ప్రచారంలో వైకాపా అధినేత జగన్
నంద్యాల రూరల్: రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే నంద్యాల నుండే మార్పు వస్తే 2019 కురుక్షేత్ర సంగ్రామానికి ఇవాళ వేసే ఓటు నాంది పలుకుతుందని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల మండలంలోని క్రాంతినగర్, చాపిరేవుల, పాండురంగాపురం, బాపూజీనగర్, ఊడుమాల్పురం, పోలూరు గ్రామాల్లో నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం రోడ్‌షో నిర్వహించారు. ప్రతి గ్రామంలో మహిళలు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టా రు. అనంతరం పాండురంగాపురంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన గ్రామంగా పేరొందిన పాండురంగాపురంలో రాజకీయాల్లో పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఏమిటో తెలుసన్నారు. చంద్రబాబు కుయుక్తులు ఈ గ్రామంలో పనిచేసే ప్రసక్తే లేదని తెలుస్తోందన్నారు. పాండురంగాపురం గ్రామ దగ్గరలో ఉన్న బాపూజీనగర్ వాసులకు పొలం ఇచ్చి కుంట ను తవ్వి మంచి నీటి వసతి కల్పించాలన్నారు. చంద్రబాబులాంటి నాయకుడు మాకు వద్దంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ప్రజలను మభ్యపెడుతూ, మోసం చేస్తూ రైతులను, పేదలను, డ్వాక్రా మహిళలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వాగ్దా నం కూడా అమలు కాలేదన్నారు. పేదో డు ఆశతో అడుగుతున్నాడని, పేదోని జీవితంలో చెలగాటం ఆడవద్దన్నారు. వైఎస్‌ఆర్ పాలనీలో కెసి కెనాల్‌కు రెండు పంటలకు నీరు రావడంతో రైతులు పుష్కలంగా బతికాడన్నారు. మూడేళ్లకాలంలో ఒక్క పంటకైనా నీరు వస్తాయోరావోనని నిరాశతో ఎదురుచూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. రాజకీయ నాయకులను కాలర్ పట్టుకొని ప్రశ్నించే విధంగా ప్రజలు ఉండాలన్నారు. గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు పనులు పూర్తి చేసేందుకు తాను కృషి చేసేందుకు సహకరిస్తానన్నారు. ఈ నెల 3న నంద్యాలలో నిర్వహించిన జగన్ పర్యటనలో పోలూరుగ్రామానికి చెందిన సుబ్బరాయుడు గుండెపోటుతో మృతి చెందారు. పోలూరు రోడ్‌షోకు వచ్చిన జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వైకాపా ఎల్లవేళలా ఆయన కుటుంబానికి అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో 14 వేల కోట్ల రుణమాఫీ చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారన్నారు. బాబును ప్రశ్నిస్తే కేసులు పెడతారేమోనని ప్రజలు భయపడుతున్నారన్నారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కోల్పోయిందన్నారు. రాజకీయం సినిమా లాంటిదని, 13 రీళ్లు విలన్‌ది పైచేయి ఉంటుందని, 14వ రీలులో హీరోది పైచేయిగా మారుతుందన్నారు. 2019 ఎన్నికలకు నాంది పలికేలా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైకాపా మండల అధ్యక్షులు పోలూరు మహేశ్వరరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, పున్నారెడ్డి, సర్పంచు సౌజన్య, మల్లికార్జునరెడ్డి, గోవిందరెడ్డి, సర్పంచు జయమ్మలతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దీబగుంట్లలో కాంగ్రెస్ ప్రచారం
* అడ్డుకున్న పోలీసులు.. * రోడ్డుపై బైఠాయించిన రఘువీరా
నంద్యాల రూరల్: కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, లక్ష్మిరెడ్డి, ఆళ్లగడ్డ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పుల్లయ్య దీబగుంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ఖాదర్‌ను గెలిపించాలంటూ పాదయాత్రతో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో అనుమతి తీసుకోలేదని పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు కొంత మేరా వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం దగ్గరలోనే ఉన్న శిరివెళ్ల సిఐ యుగంధర్‌బాబు దీబగుంట్లకు చేరుకొని అనుమతిని ఇచ్చారు. ఆ తరువాత యథావిధిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అడ్డంకులు సృష్టించడం పోలీసులకు తగదన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం, ప్రత్యేక హోదా కోసం, రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అబ్దుల్‌ఖాదర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అశ్వవాహనంపై ప్రహ్లాదరాయలు
* ఘనంగా సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన
మంత్రాలయం: మంత్రాలయం దివ్యక్షేత్ర వాసి, జగద్గురువు శ్రీరాఘవేంద్రులు పిలుస్తే పలికే దైవంగా.. భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటున్న భక్తవత్సలుని దర్శనం మదురాతి మదురం. 346వ సప్తరాత్రోత్సవాల సందర్భంగా ఏడురోజుల పాటు జరుగు ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధనోత్సవం పురస్కరించకుని స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అంతక ముందు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, ఉత్సవరాయల పాదపూజ, కనకమహాపూజ, నిర్మల్యవిసర్జన తదితర పత్య్రేక పూజలు చేశారు. అనంతరం శ్రీమూలరాములు, దిగ్విజయరాములు, సంతా న గోపాలకృష్ణ, వైకుంఠవాసుదేవామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీ ప్రహ్లాదరాల ను పల్లకి, గజ, కొయ్య, వెడి, బంగా రు, నవరత్న రథోత్సవాలపై అధిష్ఠించి ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పుష్ప అలంకరణ చేసిన అశ్వవాహనంపై కొలువుతీరిన శ్రీప్రహ్లాదరాయల ను మఠం మాడ వీధిలో అశేష భక్తుల నడుమ వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో పండిత కేసి విద్వాన్ రాజా ఎస్ గిరియాచార్యులు, మేనేజర్ శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ ఐపినరసింహమూర్తి, ధార్మిక అధికారి శ్రీప తి ఆచార్, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ద్వారపాలక అనంతాచార్, ధార్మి క సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాదవాచార్, కుర్డిజయతీర్థాచార్, మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాలలో ఏరులై పారుతున్న ధనం, మద్యం..
* ఎన్నికల కమిషన్ స్పందించాలి:కోట్ల
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు:ఉపఎన్నిక సందర్భంగా నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో ధనం, మద్యం ఏరులై పారుతోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. కోట్ల శుక్రవారం నగరంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులోని ఆర్కె నగర్ ఉపఎన్నికలో కూడా ఇదే తరహాలో నగదు, మద్యం ప్రవాహం ఉండిందని గుర్తుచేశారు. అయితే అక్కడ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఎన్నికను వాయిదా వేసిందని తెలిపారు. నంద్యా ల ఉపఎన్నికలో గత 3 నెలలుగా భారీగా నగదు చేతులు మారిందని, అదే తరహాలో పెద్దఎత్తున స్వదేశీ, విదేశీ మద్యం నిల్వ చేశారని విమర్శించారు. అయితే ఇక్కడ మాత్రం ఎన్నికల కమిషన్, ఆదాయ పన్ను, ఎక్సైజ్ శాఖ అధికారులు కనె్నత్తి చూడటం లేదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకుని నంద్యా ల నియోజకవర్గంలో తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం, నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఉపఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఇక నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో నా యకులు వాడుతున్న పదజాలం, చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికల్లో శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తాయని కోట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు తమను తాము అదుపు చేసుకుంటూ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలే కానీ ఎదుటి పక్షం వారిని రెచ్చగొట్టే విధంగా వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉండకూడదని హితవు పలికారు. నంద్యాల ఉపఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు నాంది కానే కాదన్నారు. ఒక స్థానంలో ఉపఎన్నిక జరిగి అందులో విజయం సాధించిన పార్టీ 2019లో అధికారంలోకి వస్తుందని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. నంద్యాల ఉపఎన్నికలో ఓడిన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటుందా అని కోట్ల ప్రశ్నించారు. కేవలం మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. నంద్యాల ఉపఎన్నికలో తాము పోటీ చేసింది విజయం కోసం కాదని తమ పార్టీ అభిమానుల కోసమేనని కోట్ల స్పష్టం చేశారు. క్రమంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటోదని వెల్లడించారు. రానున్న 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు. కోట్లతో పాటు డిసిసి అధ్యక్షడు లక్ష్మిరెడ్డి ఉన్నారు.
అటవీశాఖ అధికారులపై ఎలుగుబంటి దాడి
పాములపాడు:ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోని బైర్లూటి రేంజ్ పెద్దఅనంతాపురం బేస్‌క్యాంపు సమీపంలోని పెసురుట్ల బీట్‌లో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై శుక్రవారం ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటనలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేణుగోపాల్ తీవ్రంగా గాయపడగా ప్రొటెక్షన్ వాచర్లు నాగార్జున, ఖాదర్‌బాషా గాయపడ్డారు. అటవీ శాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు.
పెండింగ్ ఓటరు దరఖాస్తులపై విచారణ చేపట్టాలి
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
కర్నూలు: జూలై 1 నుంచి 31వ తేదీ వరకూ చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో 18-25 ఏళ్ల వయస్సు కల్గిన యువ త నుంచి స్వీకరించి పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులపై విచారణ చేపట్టి ఓటరు జాబితాలో నమో దు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, ఈఆర్‌ఓలతో ఎన్నికల అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భన్వర్‌లాల్ మాట్లాడుతూ ఈ నెల 18,19 తేదీల్లో ఢిల్లీలో ఎన్నికల సిఇఓలతో సమీక్ష జరగనుందని, కావున ఎన్నికల అజెండాలో ఉన్న 16 అంశాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై 3 రోజుల్లో నివేదికలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గ ఈఆర్‌ఓకు అత్యాధునిక సాంకేతిక హార్డ్‌వేర్ సిస్టంతో పాటు నైపుణ్యం గల సిబ్బందిని కేటాయించాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల సమాచారం సెంట్రలైజ్ చేసే విధంగా జిల్లా కేంద్రంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలపై అందిన ఫిర్యాదులపై వేగవంతంగా చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారులు సమీక్షించాలన్నారు. చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 35,210 దరఖాస్తులు అందగా 15,775 ఓటర్లను పరిశీలించామన్నారు. అందులో 18-19 సంవత్సరాల వయస్సు కల్గిన వారిని గుర్తించి ఓటరు జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఇక ఓటర్ల అక్షరాస్యత అభివృద్ధికి సంబంధించి 42 ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో సెమినార్‌లు నిర్వహించి అవగాహన కల్పించామని ఇసికి నివేదించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజెసి రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జడ్పీ సిఇఓ ఈశ్వర్, 14 నియోజకవర్గాల ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ బయోమెట్రిక్ విధానం అమలులో జిల్లా ఫస్ట్
పాములపాడు:విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించి నూతనంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం అమలులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని నంద్యాల డిప్యూటీ డిఇఓ అరవిందమ్మ తెలిపారు. ఆమె శుక్రవారం పాములపాడు ఆదర్శ పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలో 14 ఆదర్శ పాఠశాలలు ఉండగా పదింటిలో బాలికల వసతి గృహాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆమె వెంట ఎంఇఓ బాలాజీనాయక్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వీరన్నరావు ఉన్నారు.
ఎగ్జిట్‌పోల్స్, ఎన్నికల ఫలితాలపై నోటిఫికేషన్ జారీ
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు:నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం పోలింగ్ రోజున ఎగ్జిట్‌పోల్స్, ఎన్నికల ఫలితాలపై వ్యూహాత్మక ప్రకటనలపై కఠిన నిబంధనలను వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ ప్రక్రియపై ఉదయం 7 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌పోల్స్, ఎన్నికల ఫలితాలపై విశే్లషణాత్మక, వ్యూహాత్మక ప్రకటనలు జారీ చేసే అంశంపై భారత ఎన్నికల సంఘం గెజిట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తెరిగి ఎన్నికల సంఘం సూచించిన నియమాలను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.