వరంగల్

రెవెన్యూ సర్వే పారదర్శకంగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట: జిల్లాలోని వివిధ గ్రామాలలో జరగుతున్న రెవెన్యూ సర్వే పారదర్శకంగా జరగాలని రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సర్వేపై ఆర్‌డిఓ, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తులోని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వివరాలను సేకరించడంతోపాటు పంట భూములను సర్వే చేసి రికార్డులను సరిచేయాలని ఆదేశించారు. సర్వేను త్వరగా పూర్తిచేయాలని, వారసుల పేర్లు, ఇంటిపేర్లు, రైతుల పేర్లలో తప్పొప్పులు లేకుండా సమగ్ర విచారణ చేపట్టి పహాణిలో పొందపరచాలని అన్నారు. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములు, ఆలయ భూములు, అటవీ భూములను గుర్తించాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ సర్వే బృందాలను ఏ మేరకు సర్వే నిర్వహించారని, గ్రామాలలో ఎదురు అవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌డిఓలు, తహశీల్దారులు గ్రామాలను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అన్నారు. సర్వే అనంతరం గ్రామస్థాయి అధికారి నుండి తహశీల్దారులు, ఆర్‌డి ఓలు పహాణీని క్షణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సంతకాలు చేసి, పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వాలని సూచించారు. ఓకే సర్వే నెంబర్‌లో ఉన్న పట్టాదారు దశల వారిగా అమ్ముకున్న కొన్నవారి వివరాలను పూర్తిగా పరిశీలించి రికార్డులలో చేర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.హరిత, ఎడి సర్వే ల్యాండ్ ప్రభాకర్, వరంగల్ రూరల్ ఆర్‌డిఒ మహేందర్‌జీ, నర్సంపేట ఆర్‌డిఒ రవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

గూడురు మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
* డాక్టర్ అవతారం ఎత్తిన ప్రీతిమీనా

గూడురు: ఎజెన్సీ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా రోగుల వద్దకు వెళ్లి పరిశీలించారు. రోగులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో స్థలం సరిపోవడం లేదని సిబ్బంది తెలుపగా బెడ్స్ కింద వేసి రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రోగులకు మందులు సరిపడా ఇస్తున్నారా అని కలెక్టర్ అడిగారు. డాక్టర్ ఉండే గదిలోకి వెళ్లి మరో డాక్టర్ ఎక్కడా అని ప్రశ్నించారు. సూపరింటెండెంట్‌కు ఫొన్ చేసి డాక్టర్ లీవ్‌లో ఉన్నాడా అడిగి తెలుసుకున్నారు. డ్యూటిలో ఉన్న డాక్టర్ మోహన్‌ను ఆసుపత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 400మంది వస్తున్నారని, ఇరుకైన గదులతో ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు విన్నవించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ 24గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే రూ.2లక్షల నిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆసుపత్రి లేటర్‌ప్యాడ్‌లు కూడా లేకుండా ఎం చేస్తున్నారని వచ్చే బడ్జెట్‌లో వాటిని కొనుగొలు చేయాలన్నారు. పెషేంట్‌లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. రోగులకు అన్నిపరీక్షలు చేయాలని ఆయన సూచించారు.
నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్...
గూడురు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పిహెచ్‌సి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్ పనులతోపాటు చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. వెంటనే సంబందిత శాఖ ఎఈ, డిఈలకు ఫొన్ చేసి రెండు నెలలో పూర్తిచేయాలని లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలోనే కాంట్రక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతామని హెచ్చరించడం కూడా జరిగింది. 2నెలల్లో పూర్తిచేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. అక్టోబర్ నెలలో చివరి వారంలో భవనం ప్రారంబోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాజు, ఎంపిడివో సురేందర్‌నాయక్, జెడ్పిటిసి ఖాసీం, ఎంపిపి వెంకన్న, సర్పంచ్ మోతీలాల్, ఎపివో విజయ పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచాలి
మహాదేవపూర్: మండలంలోని నాగెపల్లి ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి చందర్ అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యను పెంపుచేసి పాఠశాలలో వౌళిక వసతుల సౌకర్యం కోసం ప్రతిపాదనలు పంపించాలని ఎంపిడిఓ సూచించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించాలి
రఘునాథపల్లి: తమకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ మేకలగట్టు గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం జనగామ డీసీపి తేజావత్ వెంకన్నకు వినతిప్రతం అందచేశారు. గత నెల 26న మేకలగట్టు గ్రామంలో తీజ్ పండుగ ఆడుతుండగా చూసేందుకు వెళ్లిన నాపై అకారణంగా ఇస్లావత్ జాను, ఇస్లావత్ మహేందర్‌లు తమను హతమార్చడానికి ప్రయత్నించారన్నారు. గొడ్డలితో దాడిచేస్తుండగా చేయి అడ్డం పెట్టడంతో తీవ్రగాయాలకే పరిమితపై ప్రాణాపాయం నుండి బయటపడానని నేతావత్ బద్రు వినతిపత్రంలో పేర్కొన్నాడు. నాపై గొడ్డలితో దాడి చేస్తుండగా మహేందర్‌ను అడ్డుకున్న రాజుపై దాడిచేయగా అతనికి తలకుగాయమైందని తమపై అకారణంగా కక్ష పెంచుకొని హత్యాయత్నానికి పాల్పడిన జాను, మహేందర్‌లపై చట్టరిత్య చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని బాధితులు కోరారు.

16న కెసిఆర్ వరంగల్ పర్యటన
* మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 16న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో నిర్మించతలపెట్టిన మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు.
గత ఏప్రిల్ నెల చివరివారంలో జరిగిన టిఆర్‌ఎస్ మహాగర్జన సందర్భంలోనే మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన జరపాలని మొదట నిర్ణయించారు. కానీ పార్టీపరంగా చేపడుతున్న మహాగర్జన రోజునే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇబ్బందికరంగా ఉంటుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసారు. అప్పుడు, ఇప్పుడు అనుకుంటు వస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి 16వ తేదీని ముహుర్తంగా నిర్ణయించారు. మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి అవసరమైన 12వందల ఎకరాల భూముల సేకరణ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. పార్కు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్‌లు త్వరితగతిన సిద్ధం చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి సుమారు 1150కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం పూర్తిచేసి ఉపాధికోసం మహారాష్ట్ర, గుజరాత్‌లకు వలసవెళ్లిన చేనేత కార్మికులను ఇక్కడికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి 16వ తేదీన వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు సమాచారం అందటంతో రూరల్ జిల్లాయంత్రాంగం సిఎం పర్యటన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది.

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి
* షీ టీమ్ ఎసిపి పూజ
వడ్డేపల్లి: విద్యార్థులు కేవలం విద్యను అభ్యసించడమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా నేర్చుకోవాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాని సంరక్షణ చూసుకోవాలని షీ టీం ఎసిపి పూజ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీమాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటి, షీ టీంలపై అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పూజ మాట్లాడుతూ పాఠశాలలలో చదువుకునే ప్రతి విద్యార్థినీ విద్యార్థులు భావి తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పర్యవరణంలో ఏర్పడుతున్న పెనుమార్పుల కారణంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు ఎంతో అవసరమని, వాటి ఆవశ్యకతను సమాజంలోని అందిరికి తెలుపాల్సిన బాధ్యత కూడా విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి వారి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న వారు కూడా మొక్కలను నాటేలా అవగాహణ కల్పించాలని అన్నారు.

నేరెళ్ల ఘటనపై మొక్కుబడి విచారణ
* దోషులను తప్పించేందుకు ప్రభుత్వం యత్నం * మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక రవాణ చేస్తున్న లారీలను తగులబెట్టిన సంఘటనలో గ్రామస్తులను పోలీసులు చిత్రహింసలు పెట్టిన సంఘటనలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేసారు. ప్రభుత్వం పోలీసు అధికారులతో తుతుమంత్రంగా విచారణ జరిపించి అసలు బాధ్యులను పక్కకు తప్పించి ఎస్సైని సస్పెండ్ చేయటం, కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతు నేరెళ్ల సంఘటనపై ముఖ్యమంత్రి పోలీసులకు వత్తాసు పలికేలా మాట్లాడితే ఆయన కుమారుడు, మంత్రి కెటిఆర్ నేరెళ్లలో పోలీసలు అతిగా వ్యవహరించినట్లు, పార్టీ నాయకులు ఈ విషయంలో విఫలమయినట్లు వాఖ్యానించటం వెనక అసలు మతలబు ఏమిటో తెలియటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నెరేళ్లకు వెళ్లి అసలు వాస్తవాలు బయటకు తీయటం, పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పారు. నేరెళ్ల ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంపై, ఈ కార్యక్రమానికి హాజరైన లోకసభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌పై చేసిన కించపరిచే వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. నేరెళ్ల ఘటనకు ఆ జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐలను బాధ్యులను చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు స్పందించకుండా, ఆందోళనలు చేపట్టకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ అణచివేత ధోరణిని అవలంభిస్తున్నారని, నిజాంను మించి నిరంకుశంగా కెసిఆర్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం ప్రజలను మరోసారి మోసం చేసే కార్యక్రమమని గండ్ర ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేస్తే రైతులకు ఎంతో కొంత మేలు జరిగేదని, కానీ ప్రాజెక్టుల రిడిజైన్ పేరిట ముఖ్యమంత్రి మూడేళ్ల కాలాన్ని సరిపెట్టారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, టిడిపి మొక్కబడిగా శంకుస్థాపన చేసి వదిలిపెట్టిన దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం ఒక కొలిక్కి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. టిడిపి హయాంలో నీటిపారుదల శాఖను నిర్వహించిన కడియం శ్రీహరి దేవాదుల ప్రాజెక్టు పనులను, తెలంగాణలో చేపట్టవలసిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రస్తుత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించటం అవివేకమని అన్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన పలువురు నాయకులు, ముఖ్యకార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు వరంగల్ నగర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి, పిసిసి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె బాటలో మున్సిపల్ కార్మికులు
నక్కలగుట్ట:గత రెండు సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచకుండా ప్రభుత్వం తత్సారం చేయడం తగదని, హైదరాబాద్‌లోని కార్మికులకు పెంచి మిగతా జిల్లాల వారికి పెంచకుండా వివక్ష చూపుతుందని భావించి తమకు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మున్సిపల్ కార్మికులు అదనపు కమీషనర్‌కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 2005 ఆగస్టు నుండి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఒకే పని చేస్తున్న వారి మద్య వ్యత్యాసాలు ఉండకూడదని, ఒప్పంద కార్మికులు సైతం క్రమబద్దీకరించిన ఉద్యోగులతోపాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే తీర్పును ఇచ్చిందని గుర్తుచేశారు. అందుకు విరుద్దంగా ఒకే రకమైన పనులు చేసే మున్సిపల్ కార్మికులకు హైదరాబాదులో ఒక రకంగా, గ్రేటర్ వరంగల్‌లో మరోక రకంగా వేతనాలు చెల్లించడం దారుణమని, సుప్రీం కోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో ఇఎస్‌ఐ, పిఎఫ్ వారి వ్యక్తిగత ఖాతాలలో జమా చేయడం లేదని, గత రెండు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు. శాశ్వత కార్మికులతోపాటు ఒప్పంద కార్మికులకు కూడా రక్షణ పరికరాలు ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, జిఒ నెంబర్ 14 ప్రకారం కేటగిరీలను బట్టి వేతనాలను పెంచాలని, అర్హులైన కార్మికులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మరాజు, భిక్షపతి, రమేష్, భాస్కర్, ప్రకాష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్‌క్లబ్ సేవలు అభినందనీయం
* ఎస్పీ కోటిరెడ్డి
మహబూబాబాద్ టౌన్: లయన్స్‌క్లబ్ సేవలు అభినందనీయం అని జిల్లా ఎస్పి ఎన్.కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పి కార్యాలయంలో శుక్రవారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌లకు సంబందించి గొడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. రాష్టవ్య్రాప్తంగా ఈనెల 17నుండి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌ను విజయవంతం చేయాలన్నారు. 9సంవత్సరాల నుండి 15సంవత్సరాలలోపు పిల్లలు ఈ టీకాలును వేసుకోవాలన్నారు. వచ్చే వ్యాదులను దృష్టిలో పెట్టుకొని ఈ తట్టురుబెల్లా వ్యాక్సిన్‌లను లయన్స్‌క్లబ్‌వారు అందజేయడం అభినందనీయం అన్నారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఈ టీకాలను ఉచితంగా పంపినీ చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహాకారంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పిహెచ్‌సి, అంగన్‌వాడీ సెంటర్, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలలో ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్‌క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సమన్వయకర్త బవిరిశెట్టి నాగేశ్వర్‌రావు, కోశాధికారి నాగార్జున, రావుల రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తటాక అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి కృషి
*ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
వడ్డేపల్లి:వరంగల్‌లో ప్రసిద్దిగాంచిన భద్రకాళి దేవస్థాన దత్తత దేవాలయమైన శ్రీ చెరువు అంజనేయస్వామి దేవస్థాన అభివృద్దికి కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం గో సంరక్షణార్థం సురభి యాగ కరప్రతాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోరక్షణ కోసం సురభి యాగాన్ని వరంగల్‌లో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. గో సంతతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని తెలిపారు. ఈకార్యక్రమంలో అర్చకులు నవీన్‌శర్మ, ఇఓ సునీత, అద్దంకి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.