రాంబాబు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మియాజార్జ్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం 3ఉంగరాల రాంబాబు2. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్‌లో రూపొందిందని, క్రాంతిమాధవ్ తరహా మేకింగ్ వైవిధ్యంగా వుంటుందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే బిజినెస్ పూర్తిచేశామని తెలిపారు. ప్రస్తుతం సునీల్‌తో డబ్బింగ్ కార్యక్రమాలు, డిటిఎస్ కార్యక్రమాలు జరుపుతున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఈ చిత్రం సునీల్ మార్క్‌తో సాగుతుందని ఆయన అన్నారు. సర్వేష్ మురారి కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తుందని, తప్పకుండా తమ అంచనాలను అందుకుని ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. పోసాని కృష్ణమురళి, ప్రకాష్‌రాజ్, ఆశీష్ విద్యార్థి, అలీ, వెనె్నల కిశోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధునందన్, ప్రభాస్ శ్రీను, తా.రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, విజయకుమార్, నల్ల వేణు, హేమంత్, రమణారెడ్డి, జెమిని ప్రసాద్, మిధున నటించారు.