తొలిచూపులోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత- నాగచైతన్యల ప్రేమ గురించి తెలియగానే ఈ విషయం మీడియలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తిచేసుకున్న ప్రేమపక్షులు అక్టోబర్‌లో వివాహబంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. సాధారణంగా సెలబ్రెటీ ప్రేమికులు మీడియాకు దూరంగా ఉంటారు. కానీ చైతు, సమంతలు మాత్రం ఆ విషయంలో ఎప్పుడూ భయపడలేదు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత.. చైతుపైగల ప్రేమని వివరించింది. నాగచైతన్యను చూసిన క్షణమే ప్రేమలో పడ్డట్లు సమంత తెలిపింది. సమంత ‘ఏం మాయ చేశావే’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. నాగచైతన్య హీరగో తొలి విజయాన్ని అందుకున్న చిత్రం కూడా అదే. ఆ చిత్రంనుంచే తమ ప్రయాణం మొదలైనట్టు సమంత తెలిపింది. తన మనసులో ఎప్పుడో నాగచైతన్యతో వివాహం జరిగిపోయిందని తెలిపింది. అక్టోబర్‌లో జరగబోయే వీరి వివాహానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.