సుమంత్ మళ్లీ రావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుమంత్, ఆకాంక్షాసింగ్ జంటగా తిన్ననూరి గౌతమ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘మళ్లీ రావా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నా యి. నిర్మాత మాట్లాడుతూ- 30 రోజుల్లోనే షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్‌లోనే పూర్తిచేశామని, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అయ్యాయని, ఈ 30 రోజుల్లో సినిమా తీయడానికి అనేకమంది సహకరించారని తెలిపారు. ఓ వైవిధ్యమైన కథ తీసుకొని దానికి స్క్రీన్‌ప్లే బేస్డ్ కథనం అల్లుకుని చిత్రాన్ని రూపొందించామని, పక్కా కమర్షియల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు గౌతమ్ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సతీష్ ముత్యాల, సంగీతం శ్రవణ్ భరద్వాజ్, నిర్మాత రాహుల్ యాదవ్ నక్క, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి.