స్క్రీన్‌ప్లే హైలెట్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా ప్రజీత్.జి దర్శకత్వంలో జాహ్నవి ఫిలింస్ పతాకంపై చంద్రశేఖర్ బొప్పన నిర్మిస్తున్న చిత్రం మేడమీది అబ్బాయి. చిత్రీకరణ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- సరికొత్త కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. గమ్యం, శంభో శివశంభో సినిమాల తరహాలో సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా వుంటుంది. నరేష్ చేసే వినోదంతోపాటు సినిమాలోని పలు ఆసక్తికరమైన అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. త్వరలో పాటలను విడుదల చేసి చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:షాన్ రెహమాన్, కెమెరా:ఉన్ని ఎస్.కుమార్, ఆర్ట్:రాజీవ్ నాయర్, ఎడిటింగ్:నందమూరి హరి, సమర్పణ:నీలిమ, నిర్మాత:బొప్పన చంద్రశేఖర్, దర్శకత్వం:జి.ప్రజీత్.