తాప్సీ కొత్తగా కనిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ తాప్సి, శ్రీనివాసరెడ్డి, వెనె్నల కిశోర్, తా.రమేష్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశిదేవిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 3ఆనందో బ్రహ్మ2. ఈ చిత్రం ఈనెల 18న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మహి చెప్పిన విశేషాలు..
కారణం భయమే
నేను దెయ్యాన్ని నమ్మను. అలాగే దేవుణ్ణి కూడా. ఈ రెండిటికి కారణం భయమే. కామెడీ జోనర్‌లో సినిమా చేద్దామనుకున్నాము. భిన్నంగా చేయాలని ప్లాన్ చేశాను. అందులో భాగంగానే మనిషికే దెయ్యం భయపడితే ఎలా వుంటుందనే కానె్సప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో పాత్రలన్నీ భిన్నంగా ఉంటాయి. ఒకడు తాగుబోతు, మరొకడికి చెవుడు, ఇంకొకడికి రేచీకటి. ఇలాంటి లోపాలున్న వ్యక్తుల కథే ఈ సినిమా.
తాప్సీ గురించి
కథ అనుకున్నపుడు తాప్సీ అయితేనే బావుంటుందనిపించింది. ఆమెను కలిసి కథ చెప్పిన తరువాత ముంబై వెళ్లి అక్కడ బిజీగా మారింది. తరువాత ఇక్కడ కార్యక్రమాలన్నీ రెడీ అయ్యాక ఫోన్ చేస్తే వచ్చి నటించింది. ఆమె పాత్ర కొత్తగా వుంటుంది. ముఖ్యంగా ఒక భారీ ట్విస్టు ఉంటుంది. అదేమిటన్నది తెరమీదే చూడాలి.
కథ కోసమే
ఈ సినిమా కోసం కావాలని గ్యాప్ తీసుకోలేదు. విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల చిత్రాలను నేనే నిర్మించాను. పాఠశాల చిత్రానికి దర్శకత్వం వహించాను. ఆ తరువాత ఈ కథ కోసం కాస్త ఎక్కువ సమయం పట్టింది. కథ ప్రకారమే నటీనటులను ఎంపిక చేసుకున్నాను. ముఖ్యంగా తాప్సీ డేట్స్ కోసం నాలుగు నెలలు వెయిట్ చేశాను.
హైలెట్స్
ఈ చిత్రంలో సౌండ్ ఎఫెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. సౌండ్ డిజైనింగ్ కోసమే ఎక్కువ సమయం పట్టింది. కామెడీ ఎమోషన్, డ్రామా అన్నీ హైలెట్‌గా ఉంటాయి. అలాగే మా నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.
తదుపరి చిత్రాలు
ఈ సినిమా తరువాత తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా.

- శ్రీ