ఆటాపోటీ

ఉక్కు మనిషి.. (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లిథునేనియా దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసేమోగానీ, జిడ్రునస్ సవికాస్ పేరు మాత్రం చాలా మందికి చిరపరచితమే. 2014లో ప్రపంచ స్ట్రాంగెస్ట్ మ్యాన్‌గా ఎంపికైన అతను 225 కిలోల బరువును మోస్తూ, 31.60 సెకన్లలో ఐదు మెట్లు ఎక్కి ఏకంగా గిన్నిస్ రికార్డునే సొంతం చేసుకున్నాడు. ట్రాక్టర్ టైర్లను మోయడం, భారీ వాహనాలను తాడుతో కట్టి లాగడం వంటి ఎన్నో విన్యాసాలు చేసే జిడ్రునస్‌తో పవర్ స్టెయిర్స్ రికార్డు కోసం పోటీపడిన థార్ జొర్న్‌సన్ చైనా గొప్పతనాన్ని చాటాడు.

ధోయోపై ఉప్పు!
* సుమో రెజ్లింగ్ పోటీలు జరిగే రింగ్‌ను ‘్ధయో’ అంటారు. దీని వెడల్పు 15 అడుగులు. రింగ్‌పైకి రావాలని రెజ్లర్ (షికోనా)లను ఆహ్వానిస్తారు. రెజ్లర్ రింగ్‌పై బలంగా కాలుమోపి ప్రవేశిస్తాడు. రింగ్‌లో ఉన్న దోషాలను నివారించడంతోపాటు, దానిని శుద్ధిచేసేందుకు ఉప్పు చల్లుతారు. తద్వారా దుష్టశక్తుల వల్ల ఇబ్బందులు ఉండవని వారి నమ్మకం.

ఫిషింగ్‌కు డిమాండ్!
* ప్రపంచంలో అత్యధిక శాతం మంది పాల్గొనే క్రీడ ఫిషింగ్. చేపలుపట్టడం అనేది ఎన్నో దేశాల్లో ప్రొఫెషనల్ క్రీడగా వెలుగుతున్నది. ఎక్కువ మంది అభిమానులు వీక్షించే క్రీడ సాకర్‌కాగా, ఎక్కువ మంది ప్రత్యక్షంగా పాల్గొనేది మాత్రం ఫిషింగ్‌లోనే.

మ్యాచ్‌కో షూ..
* అమెరికా బాస్కెట్‌బాల్ స్టార్ షాక్విల్ ఒనీల్ ఎత్తు 7 అడుగులా 1 అంగుళం. అతని పాదం మిగతా ఆటగాళ్ల కంటే చాలా పెద్దది. అందుకే అతను 22 నంబర్ షూను వాడేవాడు. అంతేకాదు... ప్రతి మ్యాచ్‌కీ కొత్త షూ వేసుకోవడం అతని అలవాటు. కెరీర్‌లో 28,996 పాయింట్లు సంపాదించిన షాక్విల్ 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో, 1994 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న అమెరికా జట్టులో సభ్యుడు.

- సత్య